Illu Illalu Pillalu September 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మధ్యాహ్నం నువ్వు విశ్వతో ఐస్ క్రీమ్ పార్లర్ కు ఎందుకు వెళ్లావని అమూల్యను నర్మద అడుగుతుంది. ధీరజ్ అన్నయ్య, ప్రేమ వదినను కలిపేందుకు ఏదో ప్లాన్ చెప్తానంటే వెళ్లానని అమూల్య చెప్తుంది.
నర్మద వార్నింగ్

ఆ కుటుంబాన్ని నమ్మలేం. జంటలను విడదీయడంలో వాళ్లు ఆరితేరారు. విషం, విరుగుడు ఒకేలా కనిపిస్తాయి. ప్రేమ, ధీరజ్ ను కలిపేందుకు ప్లాన్ చేస్తే మంచిదే. కానీ దాని వెనుక మాత్రం కుట్ర ఉంటే మొదటికే మోసం వస్తుందని అమూల్యకు నర్మద వార్నింగ్ ఇస్తుంది.
మామ అల్లుళ్లు కలిసి
మరోవైపు ఒంటరిగా కూర్చుని మందు తాగుతున్న తిరుపతి దగ్గరకు చందు వెళ్తాడు. ఇంటికి వెళ్దామంటాడు. నేను చిన్నపిల్లాడినే కానీ దొంగను కాదురా. నా అక్క అలా అనేసరికి మనసు చివుక్కుమందని తిరుపతి అంటాడు. అప్పుడే మందు బాటిల్, స్టఫ్ తో ధీరజ్, సాగర్ కూడా వస్తారు. మామ అల్లుళ్లు కలిసి మందు తాగుతారు.
ఏడ్చేసిన తిరుపతి
అమ్మ ఒక్క మాట అనగానే వెళ్లిపోతావా మామ. మీ ఫ్యామిలీ అలాంటిది. నా భార్య ప్రేమ కూడా ఒక మాట అనగానే వెళ్లిపోయింది. మీ భద్రావతి అన్నట్లు మీరంతా ఒక్కటేనని ధీరజ్ అంటాడు. అలా అనొద్దురా. నేనెప్పుడూ అక్కాబావలా చూడలేదు. అమ్మానాన్నలా చూశానని తిరుపతి ఏడ్చేస్తాడు. అమ్మలా చూసిన వేదవతి అక్క నన్ను దొంగ అనేసరికి తట్టుకోలేకపోయానని తిరుపతి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
అక్క నన్ను రెడీ చేసి స్కూల్ కు పంపేది. బావ బండి మీద డ్రాప్ చేసేవాడు. బావ కష్టం చూడలేక స్కూల్ మానేసి రైస్ మిల్ లో పని చేశా. అలాంటిది నేను దొంగతనం చేస్తానా అని తిరుపతి ఎమోషనల్ అవుతాడు. నీ గురించి మాకు తెలుసు మామ, ఇంటికి వెళ్దామని ధీరజ్ అంటాడు. మా అక్క ప్రేమతో పిలిచినప్పుడు వస్తానని తిరుపతి అంటాడు. మామా అల్లుళ్లు కలిసి ఫుల్ గా చిల్ అవుతారు.
వల్లిపై డౌట్
{{/usCountry}}అక్క నన్ను రెడీ చేసి స్కూల్ కు పంపేది. బావ బండి మీద డ్రాప్ చేసేవాడు. బావ కష్టం చూడలేక స్కూల్ మానేసి రైస్ మిల్ లో పని చేశా. అలాంటిది నేను దొంగతనం చేస్తానా అని తిరుపతి ఎమోషనల్ అవుతాడు. నీ గురించి మాకు తెలుసు మామ, ఇంటికి వెళ్దామని ధీరజ్ అంటాడు. మా అక్క ప్రేమతో పిలిచినప్పుడు వస్తానని తిరుపతి అంటాడు. మామా అల్లుళ్లు కలిసి ఫుల్ గా చిల్ అవుతారు.
వల్లిపై డౌట్
{{/usCountry}}పొద్దున ఇంట్లో ‘గాల్లో తేలినట్లుందే’ అంటూ సాంగ్ వేసుకొని శ్రీవల్లి తెగ గంతులు వేస్తుంది. ఇక వేదవతి అత్తయ్య.. అంటూ అప్పుడే వచ్చిన నర్మదను చూస్తుంది బల్లక్కాయ్. అత్తయ్యను కూడా పంపించేస్తావా? నీ దొంగ నాటకాలు ఆపు. తిరుపతి బాబాయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి నువ్వే కారణమని డౌట్ గా ఉందని నర్మద అనేసరికి వల్లి మైండ్ బ్లాక్ అవుతుంది.
అను సెల్లాయ్ అను. మీ ఆయన డబ్బులు కొట్టేసి ఉద్యోగం కొనుక్కోవడానికి కారణం కూడా నేనే అను. అన్నింటికీ కారణం నేనేనని అంటున్నారు. ఇంతమంచిదానిపై నిందలు వేస్తే దేవుడు ఊరుకోడని వల్లి తెగ డ్రామా చేస్తుంది.
రామరాజు పిలుపు
అప్పుడే తిరుపతి అని రామరాజు పిలుస్తుంటాడు. దీంతో తమ్ముడు వచ్చాడేమోనని వేదవతి సంతోషంతో లోపలికి వస్తుంది. కానీ బల్లక్కాయ్ వచ్చి అత్త మాటలు అనేసరికి తిరుపతి బాబాయ్ వెళ్లిపోయాడు కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తిరుపతి ఇంటికి రాలేదు. వాడు నా మాటలను చూశాడు కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని, అక్క ప్రేమను అర్థం చేసుకోలేదని వేదవతి ఏడుస్తుంది.
నర్మదకు తెలిసిన నిజం
అనాల్సిన మాటలన్నీ అనేసి, తమ్ముడు వెళ్లిపోయాడని ఏడిస్తే ఎలా అని వేదవతిపై రామరాజు కోప్పడతాడు. వేదవతిని పక్కకు తీసుకెళ్లి ఏం జరిగిందని నర్మద అడుగుతుంది. దీంతో సుక్కుకు తిరుపతి బాబాయ్ రూ.6 లక్షల చైన్ ఇచ్చాడని శ్రీవల్లి చెప్పిన మాటలను నర్మదకు వేదవతి చెప్తుంది. ఆ సుకన్యే వీడియో కాల్ లో తిప్పుకుంటూ చూపించింది. ఆ ఖిలాడీ భాగ్యం వాళ్లు మా తమ్ముడితో ఆడుకుంటున్నారని వేదవతి చెప్తుంది.
తిరుపతి, సుకన్య జంప్
మరోవైపు ప్రేమ ఆటోలో, ధీరజ్ కార్లో వస్తారు. తిరుపతి, సుకన్య బ్యాగులతో రెడీగా ఉంటారు. రేయ్ చిన్నోడా మా గురించి నువ్వు నీ భార్యకే చెప్పలేదంటే, ఇక ఇంట్లో ఎప్పుడు చెప్తావ్? ఎప్పుడు పెళ్లి చేస్తావ్? అని తిరుపతి అనేసరికి ప్రేమ షాక్ అవుతుంది. పెద్దోళ్లు ఈ పిల్లలు ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. అందుకే వెళ్లిపోదామని అనుకుంటున్నామని తిరుపతి చెప్తాడు.
దండుపాళ్యం బ్యాచ్
భద్రావతి పెళ్లి చూపులు అరెంజ్ చేసింది. నా పెళ్లి చేసి తీరుతానని శపథం పట్టింది. అందుకే లేచిపోయి పెళ్లి చేసుకోవాలనున్నామని తిరుపతి వివరిస్తాడు. తిరును ప్రేమించానని సుక్కు అనడంతో ప్రేమ ఫైర్ అవుతుంది. ఈ సారి ఎవరి కొంపలు కూల్చడానికి రెడీ అయ్యావ్. వీళ్లది దండుపాళ్యం బ్యాచ్. ఇప్పుడే అత్తయ్య, మామయ్యకు కాల్ చేస్తానని ప్రేమ అంటుంది.
తిరుపతి తెగ టెన్షన్ పడతాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.