...
...
Next Story

Illu Illalu Pillalu September 9 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ ఖేల్ ఖతం-ఫ్రెండ్‌తో న‌ర్మ‌ద ప్లాన్‌-తిరుకు షాక్

Illu Illalu Pillalu September 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో తిరుపతి, సుకన్య పెళ్లిని గుడిలో చేస్తామని ధీరజ్, ప్రేమ చెప్తారు. బల్లక్కాయ్ గుట్టు రట్టు చేసేందుకు తన ఫ్రెండ్ ను నర్మద హెల్ప్ అడుగుతుంది. ఇక తిరుపతికి నిశ్చితార్థం అని సేనాపతి షాక్ ఇస్తాడు.

Published on: Sep 9, 2026, 08:01:17 IST
Advertisement

Illu Illalu Pillalu September 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మామ తిరుపతి, ధీరజ్ కలిసి మందు కొడతారు. నీ ప్రేమ కథలో చరిత్రలో లేని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయని ధీరజ్ అంటాడు. అప్పుడు స్కూటీ మీద అక్కడికి ప్రేమ వస్తుంది.

ధీరజ్, ప్రేమ వార్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

నా బతుక్కి మందు తాగినప్పుడు కూడా ప్రశాంతత లేకుండా పోయిందని ధీరజ్ అనుకుంటాడు. రోజురోజుకూ ఇంత దారుణంగా, దరిద్రంగా తయారవుతున్నావ్ ఏంట్రా? అని ప్రేమ కోప్పడుతుంది. నిన్ను పిలవలేదని తిడుతున్నావా? ఎక్స్ ట్రా క్వార్టర్ తెచ్చా, లాగించేయ్ అని ధీరజ్ అంటాడు. అంతే ఇక ధీరజ్, ప్రేమ వార్ మళ్లీ స్టార్ట్ అవుతుంది.

చచ్చిపోతానన్న తిరుపతి

నువ్వు అపార్థాలకు అమ్మమ్మవి అని తెలిసి కూడా నిన్ను ప్రేమించాను కదా తప్పంతా నాదేనని ధీరజ్ అంటాడు. ఇదంతా చూస్తున్న తిరుపతికి చిర్రెత్తుకొస్తుంది. మీరు పక్కకు వెళ్లి కొట్టుకోండి, నేను మందులో విషం కలుపుకొని తాగేసి చచ్చిపోతానంటాడు. భద్రావతి తిట్టిందని సుకన్య ప్రాణాలు తీసుకోబోయిందని తిరుపతి ఫీల్ అవుతాడు.

గుడిలో పెళ్లి

ప్రేమ గురించి తిరుపతి గొప్పగా చెప్తాడు. నేను, సుక్కు లేచిపోతాం అల్లుడు. నా చిన్న అల్లుడు ఈ మామ బాధను అర్థం చేసుకోలేనప్పుడు నేనెందుకు? చచ్చిపోతానని తిరుపతి అంటాడు. నేను, ఈ దెయ్యం కలిసి గుడిలో మీ పెళ్లి చేస్తామని ధీరజ్ చెప్తాడు. దీనికి ప్రేమ ఒప్పుకోనంటుంది.

మరోవైపు అన్నయ్య ఇంకా రాలేదని అమూల్య బయట ఎదురుచూస్తుంటుంది. నర్మద ఏమో ఫ్రెండ్ స్మితతో ఫోన్లో మాట్లాడుతూ బయటకు వస్తుంది. చిన్నన్నయ్య ఇంకా ఇంటికి రాలేదని నర్మదకు చెప్తూ అమూల్య టెన్షన్ పడుతుంది. ధీరజ్ ను స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొస్తుంది ప్రేమ. పడేస్తానని స్కూటీని అటూఇటూ తిప్పుతుంది. దీంతో ప్రేమ నడుమును పట్టుకుంటాడు ధీరజ్.

కందిరీగ నడుము కాస్తా

వెనుకాల నుంచి ప్రేమను ధీరజ్ గట్టిగా హగ్ చేసుకుంటాడు. పట్టుకోకపోతే పడిపోతానని అంటాడు. పర్లేదులే గట్టిగా పట్టుకో. లేదంటే పడిపోతావని ప్రేమ అంటుంది. మీ వాళ్లు నిన్ను బాగా మేపుతున్నట్లున్నారు. ఇంతకుముందు కందిరీగలా ఉండే నడుము ఇప్పుడు ఉడుములా మారిందని ధీరజ్ సెటైర్లు వేస్తాడు.

ఇంటికి వచ్చిన ధీరజ్, ప్రేమను చూసి నర్మద కౌంటర్లు వేస్తుంది. లోక కళ్యాణం కోసం తాగానని ధీరజ్ అంటాడు. ఏమైందని నర్మద అడిగితే తిరుపతి పెళ్లి గురించి చెప్తూ మధ్యలో ఆగిపోతుంది ప్రేమ. తిరుపతితో కలిసి తాగాడని కవర్ చేస్తుంది.

నర్మదకు ఫ్రెండ్ హెల్ప్

ఉదయం తన ఫ్రెండ్ స్మితను నర్మద కలుస్తుంది. స్మిత, ఆమె భర్తవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వేర్వేరు రాష్ట్రాల్లో మా పోస్టింగ్. కబుర్లు, కాపురం, ఆఖరికి రొమాన్స్ కూడా ఫోన్లోనే. కానీ నువ్వు లక్కీ నర్మద. నీకు, మీ ఆయనకు ఒకే ఊర్లో జాబ్. పుట్టిల్లు, అత్తారిల్లు కూడా ఒకే దగ్గర అని స్మిత అంటుంది.

స్మితకు భద్రావతి, బల్లక్కాయ్, బల్లి వాళ్ల అమ్మానాన్న, సుకన్య ఫొటోలను నర్మద చూపిస్తుంది. జరిగిన గొడవలన్నింటి గురించి చెప్తుంది. ప్రేమ, ధీరజ్ విడిపోవడంలో వీళ్ల నలుగురి కుట్ర ఉందని నా డౌట్. దీన్ని నువ్వు కనిపెట్టాలని నర్మద అడుగుతుంది. నీకు హోం మినిస్టర్ వింగ్ లో జాబ్ కాబట్టి పోలీసులు సపోర్ట్ చేస్తారని నర్మద చెప్తుంది. నర్మద కోసం ఈ హెల్ప్ చేసేందుకు స్మిత ఒప్పుకొంటుంది.

తిరుపతికి షాక్

మరోవైపు అహ నా పెళ్లంటా అని పెళ్లి కొడుకులా రెడీ అయి హుషారుగా పాటలు పాడతాడు తిరుపతి. ధీరజ్ మందు ఎక్కవై వాగితే నువ్వు నమ్మడం ఏంటీ అని ప్రేమ అంటుంది. అప్పుడే తిరుపతి గుడికి వెళ్దాం పదా అని సేనాపతి రావడంతో ప్రేమ, తిరుపతి షాక్ అవుతారు. గుడిలో నీకు నిశ్చితార్థం అని సేనాపతి చెప్పడంతో తిరుపతి మైండ్ బ్లాక్ అవుతుంది.

అక్క ఆల్రెడీ గుడిలో ఏర్పాట్లు చేసింది. పదా అంటూ తిరుపతిని సేనాపతి లాక్కెళ్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks