IMDb Movies: ఈ 10 సినిమాల కోసం ఇండియన్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారట.. టాప్‌లో యశ్ టాక్సిక్.. సౌత్ మూవీస్ హవా

IMDb Movies: ఐఎండీబీ టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ తొలి స్థానంలో నిలవడం విశేషం. టాప్ 10లో సౌత్, రీజినల్ సినిమాల హవా కనిపిస్తోంది.

Published on: Jul 8, 2026, 16:18:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IMDb Movies: పాన్ ఇండియా సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' (Toxic) ఐఎండీబీ మోస్ట్ యాంటిసిపేటెడ్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆలియా భట్ 'ఆల్ఫా' రిలీజ్ తర్వాత, ఆడియన్స్ నెక్స్ట్ ఏ సినిమాల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారో ఐఎండీబీ అఫీషియల్ గా ఒక రియల్-టైమ్ వ్యూస్ బేస్డ్ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఈ టాప్ 10 లిస్ట్‌లో థియేట్రికల్ రిలీజ్‌లతో పాటు కొన్ని మంచి ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.

IMDb Movies: ఈ 10 సినిమాల కోసం ఇండియన్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారట.. టాప్‌లో యశ్ టాక్సిక్.. సౌత్ మూవీస్ హవా (IMDb)
IMDb Movies: ఈ 10 సినిమాల కోసం ఇండియన్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారట.. టాప్‌లో యశ్ టాక్సిక్.. సౌత్ మూవీస్ హవా (IMDb)

టాప్‌లో నిలిచిన 'టాక్సిక్'..

కేజీఎఫ్ సిరీస్ తో గ్లోబల్ వైడ్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన యశ్.. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో 'టాక్సిక్' మూవీ చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో చాలా మార్పులు జరిగినప్పటికీ ఫ్యాన్స్ లో దీనిపై ఉన్న బజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఈ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో మిస్టరీ థ్రిల్లర్ 'ఇంద్రజాల్' నిలిచింది. జాగేశ్వర్ ధోబ్లే డైరెక్ట్ చేసిన ఈ మూవీ జులై 24న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ కమ్‌బ్యాక్ మూవీ 'ఆవారాపన్ 2' ఉంది. నితిన్ కక్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఇన్టెన్స్ థ్రిల్లర్ ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రానుంది.

రీజనల్ సినిమాల హవా..

పంజాబీ డ్రామా 'దస్తార్' ఈ ఐఎండీబీ లిస్ట్‌లో ఫోర్త్ ప్లేస్ ఆక్రమించింది. సింగ్ బల్వీర్, అమర్ హుండల్ కలిసి డైరెక్ట్ చేసిన ఈ పంజాబీ మూవీ జులై 17న థియేటర్లలోకి వస్తోంది. ఇక ఐదో స్థానంలో తమిళ రొమాంటిక్ డ్రామా 'ఇధయమ్ మురళి' నిలిచింది. మంచి లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 10న థియేటర్లలోకి రాబోతోంది.

బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీ 'ధమాల్ 4' ఆరో ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ లాంటి స్టార్స్ నటించిన ఈ ఫన్ రైడ్ జులై 10న థియేటర్లలో నవ్వులు పూయించడానికి వస్తోంది. ఏడో ప్లేస్‌లో రామచంద్ర గావ్కర్ డైరెక్ట్ చేసిన మరాఠీ హారర్ కామెడీ ఫిల్మ్ 'భూతం భయ్యమ్' జులై 23న రిలీజ్ కు రెడీ అయింది.

అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ తమిళ యాక్షన్ క్రైమ్ డ్రామా 'డీసీ' (DC) ఎనిమిదో స్థానం దక్కించుకుంది. ఈ మూవీ జులై 31న థియేటర్లను షేక్ చేయనుంది. ఇక తొమ్మిదో ప్లేస్‌లో మయూర్ ప్రధాన్ తెరకెక్కించిన మరాఠీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'తులా పహతా' జులై 10న థియేటర్లలో సందడి చేయనుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో సన్నీ డియోల్ 'ఇక్కా'

ఈ టాప్ 10 లిస్ట్‌లో చివరగా ఓటీటీ కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇక్కా' (Ikka) ఉంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అక్షయ్ ఖన్నా, సన్నీ డియోల్ నటించిన ఈ ఇంటెన్స్ డ్రామా జులై 10న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కాబోతోంది. సిద్ధార్థ్ పి మల్హోత్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై నార్త్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే ఈ 10 సినిమాల్లో ఏకంగా 4 సినిమాలు (ధమాల్ 4, ఇక్కా, ఇధయమ్ మురళి, తులా పహతా) ఇదే శుక్రవారం (జులై 10) రిలీజ్ అవుతుండటం సినీ లవర్స్‌కు పెద్ద పండగ అని చెప్పొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More