Yash: పేరెంట్స్‌తో కలిసి చూడలేని సీన్స్ చేయను.. అప్పట్లో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పిన యశ్.. ఇప్పుడీ బూతు సీన్లు ఏంటంటూ..
Yash: టాక్సిక్ మూవీలో యశ్ సీన్స్ చూసి ఇప్పుడతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఓ పన్నెండేళ్ల కిందట పెద్ద స్టార్ కాకముందు ఓ ఇంటర్వ్యూలో యశ్ చెప్పిన డైలాగ్స్ గుర్తు చేస్తూ ఇప్పుడీ బూతు సీన్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Yash: 'కేజీఎఫ్' సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో యశ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యాడు. కొన్నేళ్లకు ముందు ఫ్యామిలీతో కలిసి చూడలేని బోల్డ్ సీన్స్ అస్సలు చేయనని చెప్పిన మన రాఖీ భాయ్.. ఇప్పుడు తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్' (Toxic) కంటెంట్ తో విమర్శల పాలవుతున్నాడు. ఆ పాత వీడియో ఏంటి, ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోందో చూద్దాం.

రమేష్ అరవింద్ షోలో యశ్ కామెంట్స్
'కేజీఎఫ్' తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు యశ్ కన్నడలో గుగ్లీ, గజకేసరి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి లాంటి సూపర్ హిట్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే 2014లో పాపులర్ హోస్ట్ రమేష్ అరవింద్ చేసిన 'వీకెండ్ విత్ రమేష్' టాక్ షోలో యశ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
ఆ షోలో యశ్ మాట్లాడుతూ.. తను రొమాంటిక్ సీన్స్ లో బాగా యాక్ట్ చేస్తానని జనాలు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంటుందని అన్నాడు. సెట్స్ లో అలాంటి సీన్స్ చేసేటప్పుడు తనకు చాలా భయంగా, నెర్వస్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. "నేను రొమాంటిక్ సీన్స్ చేస్తుంటే రాధికాతో సహా సెట్స్ లో అందరూ నన్ను చూసి పగలబడి నవ్వుతారు" అని ఫన్నీగా చెప్పాడు.
ఫ్యామిలీ ఆడియన్స్ రూల్.. అమ్మ సెటైర్లు
"ఈ రోజు వరకు నేను ఒకటే రూల్ పెట్టుకున్నా. నా పేరెంట్స్ తో ఒకే గదిలో కూర్చుని చూడటానికి ఇబ్బందిగా అనిపించే ఏ సీన్ కూడా నేను ఫ్యూచర్ లో చేయను. ఎందుకంటే అలాంటి సీన్స్ చూసేటప్పుడు చాలా మంది ఆడియెన్స్ కి అసౌకర్యంగా ఉంటుంది" అని యశ్ అప్పట్లో చెప్పాడు.
అంతేకాదు హీరోయిన్ చీర లాగమంటే తనకు వణుకు వచ్చేస్తుందని, రొమాన్స్ చేయడం నీకు అస్సలు రాదని వాళ్ల అమ్మ కూడా తనను ఆటపట్టించేదని యశ్ గుర్తుచేసుకున్నాడు.
'టాక్సిక్' టీజర్ తో మొదలైన రచ్చ
కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పీరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'టాక్సిక్' కోసం యశ్ ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ 'లేడీస్ అండ్ లేడీస్' టీజర్ చూశాక ఫ్యాన్స్ యశ్ పాత డైలాగులను బయటకు తీశారు.
అందులోని కొన్ని కంటెంట్ విజువల్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. "కానీ పేరెంట్స్ తో చూడలేని సినిమాలు చేయనని యశ్ అప్పట్లో చెప్పాడు కదా" అంటూ టీజర్ స్క్రీన్ షాట్స్ ను ఎక్స్ వేదికగా షేర్ చేసి యశ్ ను ట్రోల్ చేస్తున్నారు.
కియారా అద్వానీపై నెగెటివిటీ..
ఈ క్రమంలో యశ్ కో-స్టార్ కియారా అద్వానీపై కూడా నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. దీనిపై ఒక నెటిజన్ ఫైర్ అవుతూ.. "యశ్ ఇలాంటి సీన్స్ చేస్తుంటే వాళ్ల ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా ఉంటుందా అని ఎవరూ అడగరు. కానీ కియారాను మాత్రం పాయింట్ అవుట్ చేస్తారు" అంటూ కౌంటర్ వేశాడు.
"యశ్ కు పెళ్లైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎవరూ యశ్ క్యారెక్టర్ ను తప్పుబట్టరు. ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజం. ఇక్కడ ఆడవాళ్ల క్యారెక్టర్ ను మాత్రమే ఈజీగా జడ్జ్ చేస్తారు.. మగాళ్ల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు" అని మరో యూజర్ తన కోపాన్ని బయటపెట్టాడు.
భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న 'టాక్సిక్'
'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఏకంగా నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు.
ఆగస్ట్ 26న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేస్తానన్న యశ్.. ఇప్పుడు ఏకంగా టీజర్ లోనే పిల్లలను దూరంగా ఉంచండి అని అడల్ట్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


