ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 డైరెక్టర్లు వీళ్లే.. ఒక్క తెలుగు డైరెక్టర్‌కూ దక్కని చోటు

ఇండియాలో ఈ ఏడాది మోస్ట్ పాపులర్ డైరెక్టర్ల జాబితాను ఐఎండీబీ బుధవారం (డిసెంబర్ 3) రిలీజ్ చేసింది. ఇందులో ఒక్క తెలుగు డైరెక్టర్ కు కూడా చోటు దక్కలేదు. టాప్ 2లో ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్లే ఉండటం విశేషం.

Published on: Dec 03, 2025 6:58 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా సినిమా సమాచారాన్ని అందించే ప్రముఖ వేదిక IMDb.. 2025 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ డైరెక్టర్స్ జాబితాను ప్రకటించింది. నెలకు 250 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యూయర్స్ పేజ్ వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను రూపొందించారు. ఇందులో తొలి స్థానంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచిన సయ్యారాను డైరెక్ట్ చేసిన మోహిత్ సూరి ఉన్నాడు. ఒక్క తెలుగు డైరెక్టర్ కూడా టాప్ 10లో లేడు.

ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 డైరెక్టర్లు వీళ్లే.. ఒక్క తెలుగు డైరెక్టర్‌కూ దక్కని చోటు
ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 డైరెక్టర్లు వీళ్లే.. ఒక్క తెలుగు డైరెక్టర్‌కూ దక్కని చోటు

ఆర్యన్ ఖాన్ రికార్డు: తొలి సిరీస్‌తోనే టాప్-2లోకి..

ఈ జాబితాలో మోహిత్ సూరి మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం ఆర్యన్ ఖాన్ పైనే ఉంది. కేవలం 28 ఏళ్ల వయసులో, తన మొదటి ప్రాజెక్ట్‌తోనే ఆర్యన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టాప్-10 జాబితాలో ఉన్న అతి పిన్న వయస్కుడు మాత్రమే కాదు.. కేవలం వెబ్ సిరీస్ ద్వారా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దర్శకుడు కూడా ఆర్యనే కావడం విశేషం. ఈ ఏడాది అతడు బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

లోకేష్ కనగరాజ్ హవా

పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. తనదైన మేకింగ్ స్టైల్‌తో అతడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అలాగే మలయాళ స్టార్ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరూ ఈ ఏడాది వరుసగా కూలీ, ఎల్2: ఎంపురాన్ సినిమాలను అందించిన విషయం తెలిసిందే.

IMDb టాప్ 10 డైరెక్టర్స్ (2025) జాబితా ఇదే

మోహిత్ సూరి (సయ్యారా)

ఆర్యన్ ఖాన్ (ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్)

లోకేష్ కనగరాజ్

అనురాగ్ కశ్యప్

పృథ్వీరాజ్ సుకుమారన్

ఆర్.ఎస్. ప్రసన్న

అనురాగ్ బాసు

డొమినిక్ అరుణ్

లక్ష్మణ్ ఉటేకర్

నీరజ్ ఘైవాన్

ఆర్యన్ ఖాన్ సిరీస్ 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' గురించి..

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఈ ఏడాది తన తొలి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. హిందీ చిత్ర పరిశ్రమలో జరిగే అంతర్గత రాజకీయాలు, నెపోటిజం కామెంట్స్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ సిరీస్‌ను రూపొందించాడు.

బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి బయటి వ్యక్తులు పడే కష్టాలను, అక్కడ ఉండే అధికార పోరాటాలను ఈ షో ఆవిష్కరించింది. ఇందులో బాబీ డియోల్, రాఘవ్ జుయల్, లక్ష్య, సాహెర్ బాంబా, మోనా సింగ్ కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకులనుంచి దీనికి మంచి ఆదరణ లభించింది.

ఐఎండీబీ టాప్ డైరెక్టర్లు
ఐఎండీబీ టాప్ డైరెక్టర్లు
News/Entertainment/ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 డైరెక్టర్లు వీళ్లే.. ఒక్క తెలుగు డైరెక్టర్‌కూ దక్కని చోటు
News/Entertainment/ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 డైరెక్టర్లు వీళ్లే.. ఒక్క తెలుగు డైరెక్టర్‌కూ దక్కని చోటు