కరోనా మహమ్మారి తర్వాత ఇండియన్ సినిమా 2025లో చెలరేగిపోయింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ (Ormax Media) రిపోర్టు ప్రకారం.. 2025లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. 13,397 కోట్లకు చేరాయి. 2024తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. 2023లో నమోదైన రూ. 12,198 కోట్ల రికార్డును కూడా ఈ ఏడాది బ్రేక్ చేసింది.
హిందీ సినిమా హవా

చాలా రోజులుగా సౌత్ సినిమాల హవాలో కొట్టుకుపోతున్న హిందీ సినిమా గతేడాది మళ్లీ గాడిలో పడింది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) మూవీ ఇండియాలో ఏకంగా రూ. 950.1 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
ఈ సినిమా విజయంతో హిందీ పరిశ్రమ మొత్తం వసూళ్లు రూ. 5,504 కోట్లకు చేరాయి. ఇది గతేడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ కావడం విశేషం. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల హవా తగ్గి (7%), స్ట్రైట్ హిందీ సినిమాల వాటా (93%) పెరగడం విశేషం.
కాంతార దెబ్బకు కన్నడ ఇండస్ట్రీ టాప్
ప్రాంతీయ భాషల్లో గుజరాతీ సినిమా ఏకంగా 189% వృద్ధిని సాధించింది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లాలో: కృష్ణ సదా సహాయతే అనే మూవీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కన్నడ పరిశ్రమ 73% వృద్ధితో సత్తా చాటింది. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ ఒక్క కన్నడ వెర్షనే రూ. 237 కోట్లు రాబట్టడం దీనికి ప్రధాన కారణం.
తెలుగు, తమిళం డల్..
హిందీ, కన్నడ పరిశ్రమలు దూసుకెళ్తుంటే.. తెలుగు, తమిళ పరిశ్రమలు మాత్రం పెద్దగా వృద్ధిని నమోదు చేయలేదు. తెలుగు సినిమా వసూళ్లు కేవలం ఒక శాతం వృద్ధితో నిలకడగా ఉండగా, తమిళ సినిమా 1 శాతం తగ్గుదల నమోదు చేసింది. తెలుగు సినిమాలు గతేడాది మొత్తంగా రూ.2348 కోట్లు వసూలు చేయగా.. తమిళ సినిమాలకు రూ.1805 కోట్లు వచ్చాయి. మలయాళం సినిమా అంతకు ముందు ఏడాదిలాగే రూ.1164 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా భారతీయ బాక్సాఫీస్‌లో దక్షిణాది సినిమాల వాటా 48 శాతం నుంచి 44 శాతానికి పడిపోయింది.
టికెట్ రేట్లు పెరిగాయి.. జనం తగ్గారు
{{/usCountry}}హిందీ, కన్నడ పరిశ్రమలు దూసుకెళ్తుంటే.. తెలుగు, తమిళ పరిశ్రమలు మాత్రం పెద్దగా వృద్ధిని నమోదు చేయలేదు. తెలుగు సినిమా వసూళ్లు కేవలం ఒక శాతం వృద్ధితో నిలకడగా ఉండగా, తమిళ సినిమా 1 శాతం తగ్గుదల నమోదు చేసింది. తెలుగు సినిమాలు గతేడాది మొత్తంగా రూ.2348 కోట్లు వసూలు చేయగా.. తమిళ సినిమాలకు రూ.1805 కోట్లు వచ్చాయి. మలయాళం సినిమా అంతకు ముందు ఏడాదిలాగే రూ.1164 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా భారతీయ బాక్సాఫీస్‌లో దక్షిణాది సినిమాల వాటా 48 శాతం నుంచి 44 శాతానికి పడిపోయింది.
టికెట్ రేట్లు పెరిగాయి.. జనం తగ్గారు
{{/usCountry}}ఈ వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణం టికెట్ ధరలు 20 శాతం పెరగడమేనని ఆర్మాక్స్ మీడియా రిపోర్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం 6 శాతం తగ్గింది. 2025లో ఏకంగా 37 సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. 2024లో ఈ సంఖ్య 22 మాత్రమే.
2025లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 మూవీస్
ధురంధర్: రూ. 950.1 కోట్లు
కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1: రూ. 724.3 కోట్లు
ఛావా: రూ. 691.9 కోట్లు
సయ్యారా : రూ. 396.1 కోట్లు
కూలీ: రూ. 324.6 కోట్లు
మహావతార్ నరసింహ: రూ. 301.0 కోట్లు
వార్ 2: రూ. 282.7 కోట్లు
అవతార్: ఫైర్ అండ్ యాష్: రూ. 238.5 కోట్లు
దే కాల్ హిమ్ ఓజీ: రూ. 223.3 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం: రూ. 221.4 కోట్లు