LPG Cylinders: గ్యాస్ సిలిండర్ల కొరతకు ఫుల్ స్టాప్.. కమర్షియల్ ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
LPG Cylinders: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక ఎలాంటి ఆంక్షలు లేకుండా సిలిండర్ల సరఫరా జరగనుంది.
LPG Cylinders: హోటళ్లు, రెస్టారెంట్లు, భారీ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ఊరట ఇస్తూ కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఒక్కసారిగా రద్దు చేసింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల అంతర్జాతీయంగా తలెత్తిన ఎల్పీజీ ఇంధన సంక్షోభం, ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన సరికొత్త ఒప్పందంతో (MoU) సద్దుమణిగింది.

దీంతో గృహేతర ఎల్పీజీ సరఫరాని యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయికి పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం (జూన్ 25) అధికారికంగా ప్రకటించింది.
బల్క్ ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణ.. పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్
గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల మూసివేత దశకు చేరుకున్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గురుగ్రామ్ లాంటి మెట్రో సిటీలలోని హోటల్స్, రెస్టారెంట్ వ్యాపారులకు ఈ నిర్ణయం ఒక పెద్ద ఊరటనిచ్చింది.
పరిశ్రమలకు అవసరమైన బల్క్ ఎల్పీజీ సరఫరాపై ఉన్న ఆంక్షలను కూడా కేంద్రం భారీగా సడలించింది. సంక్షోభానికి ముందు వాడిన గ్యాస్ పరిమాణంలో ఇప్పుడు నేరుగా 50 శాతం వరకు సరఫరా పెంచుకోవడానికి కమర్షియల్ యూజర్లకు అనుమతి ఇచ్చింది.
యుద్ధ సమయంలో ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో మన దేశంలో గ్యాస్ కొరత రాకుండా కేంద్రం అప్పట్లో నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద కొన్ని కఠినమైన నిబంధనలు తెచ్చింది. ఎల్పీజీ తయారీకి వాడే C3, C4 గ్యాస్‌లను కేవలం డొమెస్టిక్ గ్యాస్ ఉత్పత్తికే వాడాలని ఆదేశించింది. ఇప్పుడు సప్లై పెరగడంతో ఆ గ్యాస్‌లను ఇతర పరిశ్రమల అవసరాలకు కూడా వాడుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సింగిల్ డేటాబేస్ రెడీ.. డొమెస్టిక్ గ్యాస్‌కు ఎలాంటి ఢోకా లేదు
పరిశ్రమలకు ఆంక్షలు ఎత్తేసినప్పటికీ ఇళ్లలో వాడే వంటగ్యాస్ (డొమెస్టిక్ సిలిండర్లు) ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరాయంగా సరఫరా కొనసాగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్లాన్ చేశాయి.
"ఏ ఏ పరిశ్రమలకు ఎంత మొత్తంలో C3, C4 గ్యాస్‌లు అవసరమో ఒక ప్రభుత్వ టెక్నికల్ బాడీ నిర్ణయిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కమర్షియల్, ఇండస్ట్రియల్ ఎల్పీజీ యూజర్లందరి వివరాలతో ఒకే ఒక సింగిల్ డేటాబేస్‌ను కేంద్రం క్రియేట్ చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో డిమాండ్‌కు తగ్గట్టుగా గ్యాస్ సరఫరాని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయొచ్చు" అని ఇంధన శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు.. పీఎన్‌జీపై స్పెషల్ ఫోకస్
ఎల్పీజీ ఆంక్షలు ఎత్తేసినప్పటికీ కమర్షియల్ రంగాన్ని పూర్తిగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించాలనేదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పీఎన్‌జీ అనేది ఎల్‌పీజీ కంటే చాలా క్లీన్ అండ్ సేఫ్ ఫ్యూయల్ కావడం విశేషం.
ఇప్పటికే పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న వాళ్లు దాన్నే కొనసాగించాలని, మిగిలిన వ్యాపార సంస్థలను కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మద్దతుతో మెల్లగా పీఎన్‌జీ వైపు మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ కొత్త సప్లై సిస్టమ్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ కోరింది. ఈ నిర్ణయంతో దేశంలో ఇంధన భద్రత పెరగడమే కాకుండా, పరిశ్రమలకు ఎలాంటి బ్రేకులు లేకుండా ఉత్పత్తి సాగుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


