టీమిండియా వుమెన్ స్టార్ క్రికెట‌ర్‌ స్మృతి మంధానకు కాబోయే భ‌ర్త ఇత‌డే.. క్లారిటీ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్‌

బ్రేకింగ్.. టీమిండియా వుమెన్ స్టార్ క్రికెట‌ర్‌ స్మృతి మంధానకు కాబోయే భ‌ర్త ఎవరో తెలిసిపోయింది. ఈ భారత జట్టు వైస్ కెప్టెన్ బాయ్‌ఫ్రెండ్‌ ఈ విషయంపై క్లారిటీనిచ్చాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. 

Published on: Oct 19, 2025, 15:02:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భ్రేకింగ్.. ఇటు ఆటతో మైదానంలో, అటు అందంతో బయట అలరించే టీమిండియా స్టార్ స్మృతి మంధానకు కాబోయే భర్త ఎవరో తెలిసిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది. దీనిపై ఆమె బాయ్ ఫ్రెండ్ క్లారిటీనిచ్చాడు. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంధానతో తన పెళ్లిని ధృవీకరించాడు.

బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన (Twitter)
బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన (Twitter)

ఇండోర్ కోడలు

భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధానను పెళ్లాడనున్నాడు పలాష్ ముచ్చల్. భారత ఓపెనర్‌తో తనకున్న సంబంధంపై వస్తున్న పుకార్ల గురించి అడిగినప్పుడు, పలాష్ ముచ్చల్ నవ్వి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మీడియాతో ఇలా అన్నాడు. “ఆమె త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది.. నేను చెప్పాలనుకున్నది ఇంతే” అని చెప్పాడు.

సోషల్ మీడియాలో వైరల్

స్మృతి మంధానను పెళ్లి చేసుకోబోతున్నాననే అర్థం వచ్చేలా పలాష్ ముచ్చల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారి సంబంధం గురించి చాలా కాలంగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. భారత క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు స్పష్టత లభించింది.

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ చాలా కాలంగా బయట కలిసి కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు పలాష్ కామెంట్లతో వీళ్ల లవ్ నిజమేనని తేలింది.

2019 నుంచి డేటింగ్

పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన 2019 నుంచి రహస్యంగా డేటింగ్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలను ఎవరూ ఎప్పుడూ ధృవీకరించలేదు. గత కొన్ని నెలలుగా, మంధాన, ముచ్చల్ పలు కార్యక్రమాలలో కలిసి కనిపించారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న అనేక చిత్రాలలో కూడా కనిపించడంతో వారి బంధంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 30 ఏళ్ల ఈ సంగీత దర్శకుడు తన పెళ్లి వార్తను ఒక సరదా వ్యాఖ్యతో ధృవీకరించాడు. “మీకు హెడ్‌లైన్ ఇచ్చేశాను” అని ఆయన అన్నారు.

టీమ్ కు ఆల్ ది బెస్ట్

ముచ్చల్ తన కాబోయే భార్య మంధాన ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు తన శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న కీలకమైన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. దాని గురించి మాట్లాడుతూ పలాష్ ముచ్చల్.. “భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతిలకు నా శుభాకాంక్షలు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్ గెలిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము” అని అన్నారు.

పలాష్ ఎవరు?

పలు బాలీవుడ్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు పలాష్ దర్వకుడిగా మారాలని చూస్తున్నాడు. అతను రాజు బాజేవాలాతో డైరెక్టర్ గా మారాడు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ నటిస్తున్నారు. పలాష్ ముచ్చల్ నెట్ వర్త్ సుమారు రూ.20– రూ.41 కోట్ల వరకు ఉంటుంది. స్మృతి మంధాన నెట్ వర్త్ రూ.32– రూ.34 కోట్ల మధ్య ఉంటుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More