కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' ఎలా ఉంది? డ్యూడ్‌తో పోటీలో నిలిచిందా? ట్విటర్ రివ్యూ.. నెటిజన్ల పోస్టులు వైరల్

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘కె ర్యాంప్'. ఇవాళ ఈ మూవీ రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం 'డ్యూడ్'తో పోటీ పడుతున్న ఈ చిత్రం ట్విటర్ రివ్యూ ఇక్కడ చూసేయండి.

Published on: Oct 18, 2025, 15:21:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'కె ర్యాంప్' శనివారం (అక్టోబర్ 18) థియేటర్లలో విడుదలైంది. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ సినిమా.. ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం 'డ్యూడ్', సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘తెలుసు కదా’తో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతోంది. ఈ పోటీ మధ్య అబ్బవరం సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

కె ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరం స్టిల్
కె ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరం స్టిల్

డెబ్యూ డైరెక్టర్

కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. జైన్స్ నాని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా కథానాయికగా నటించింది. వీరితో పాటు సాయి కుమార్, నరేష్ విజయకృష్ణ, కామ్నా జఠ్మలానీ, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ తాండ, శివ బొమ్మక్కు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కె ర్యాంప్ ట్విటర్ రివ్యూ

మార్నింగ్ షోల తర్వాత చాలా మంది తమ రివ్యూలను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఒక యూజర్ 'కె ర్యాంప్' సెకండాఫ్‌ను ప్రశంసించారు. సినిమాను 'డీసెంట్' అని పేర్కొంటూ ఆ పోస్ట్‌లో ఇలా రాశారు. “నా షో పూర్తయింది, సెకండాఫ్ బాగుంది..!! డిజార్డర్ క్యారెక్టరైజేషన్ సీన్స్, కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యాయి. ఫాదర్ సెంటిమెంట్ మినహా, సీన్ 1 నుంచే కుమార్ అబ్బవరం షో అదరిపోయింది. క్లైమాక్స్ బాగుంది. మొత్తంగా ఒక డీసెంట్ ఎంటర్‌టైనర్. 2.5/5 ” అని పోస్టు చేశాడు.

యావరేజ్

మరో యూజర్ ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్ ఇచ్చి ఇలా రాశారు. “మంచి ప్రయత్నమే కానీ ఫ్లాట్‌గా సాగింది. ఓవరాల్.. 2.35/5. కొన్ని అరుదైన మంచి క్షణాలు ఉన్నాయి, కానీ మొత్తంగా ఒక యావరేజ్ సినిమా. కంటెంట్ జానర్ కిరణ్ అబ్బవరానికి సరిపోతుంది. ముఖ్యంగా బీజీఎం అద్భుతంగా ఉంది. సంగీతమే ఈ సినిమాను కాపాడింది. కథ ఫర్వాలేదు” అని పేర్కొన్నాడు.

ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మరో యూజర్ ఇలా రాశారు. “ కె ర్యాంప్ మొదటి భాగం మిశ్రమంగా ఉంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేదు. కామెడీ లౌడ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. మొత్తంగా సెకండాఫ్ మెరుగ్గా ఉంటుందనే ఆశతో చూడొచ్చు!” అని పోస్టు చేశాడు.

“ఫన్ కామెడీ, హీరో-హీరోయిన్ల మధ్య ఆకట్టుకునే సన్నివేశాలతో సెకండాఫ్ అదరగొట్టింది, ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగిసింది” అని కిరణ్ అబ్బవరం సినిమా క్లైమాక్స్‌కు మరో యూజర్ ఫిదా అయ్యాడు.

ఔట్‌డేటెడ్

వెంకీ రివ్యూస్ ఈ సినిమాను 'ఔట్‌డేటెడ్' అని పేర్కొంటూ ఘాటైన రివ్యూ ఇచ్చింది. “కె ర్యాంప్ ఒక సిల్లీ, ఔట్‌డేటెడ్ సినిమా. ఇది మొదటి నుంచి చివరి వరకు ఓవర్ ది టాప్‌గా ఉంది!. ఈ సినిమా చాలా సాధారణ కథతో, మనం ఎన్నోసార్లు చూసిన రొటీన్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. కేవలం వినోదాన్ని పంచే జానర్‌కు ఇది వర్కవుట్ అయ్యేదేమో కానీ ఇక్కడ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ హద్దులు దాటి చిరాకు తెప్పించేలా, సిల్లీగా అనిపిస్తుంది. దర్శకుడు కొన్ని కామెడీ సీన్స్‌ను మాత్రమే పండించగలిగాడు. మిగతా రచన పేలవంగా, లోతు లేకుండా ఉంది. కిరణ్ అబ్బవరం ఎప్పటిలాగే ఎనర్జీని పాత్రకు అందించాడు, కానీ గత చిత్రాల మాదిరిగానే రిపీట్‌గా అనిపించింది’’ అని పోస్టు చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More