Irumudi Box Office: ఇరుముడికి రూ.100 కోట్లు.. రవితేజ ఖాతాలో మూడో బ్లాక్‌బస్టర్.. ఆ రెండింటి తర్వాత..
Irumudi Box Office: ఇరుముడి సరికొత్త చరిత్ర సృష్టించింది. మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ లా నిలిచింది. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
Irumudi Box Office: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన పూనకాల రేంజ్ కలెక్షన్లతో దుమ్మురేపుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అరుదైన మైలురాయిని చేరుకుంది.

రెండే రోజుల్లో బ్రేక్ ఈవెన్.. బయ్యర్లకు ఊహించని లాభాలు
థియేటర్లలోకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిన ఈ సినిమా, ఇప్పుడు బయ్యర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఈ ఘనతతో రవితేజ కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన మూడో సినిమాగా 'ఇరుముడి' చరిత్ర సృష్టించింది. గతంలో ఆయన నటించిన 'ధమాకా', మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు ఈ మార్కును దాటగా, ఇప్పుడు 'ఇరుముడి'తో మాస్ మహారాజా గ్రాండ్ హ్యాట్రిక్ కొట్టారు.
అసలైన నంబర్స్.. మైత్రీ మూవీ మేకర్స్ పక్కా ప్రమోషన్స్
ఈ సినిమా విజయంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రమోషన్స్, క్వాలిటీ మేకింగ్ ముఖ్య పాత్ర పోషించాయి. ఎలాంటి ఫేక్ నంబర్స్ లేకుండా, పక్కా ఒరిజినల్ కలెక్షన్ల లెక్కలను మాత్రమే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు.
"అయ్యప్ప స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల అపారమైన అభిమానంతో 'ఇరుముడి' 100 కోట్ల గ్రాస్ సాధించింది" అని నిర్మాతలు సోషల్ మీడియాలో అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
వర్కింగ్ డేస్‌లోనూ 90 శాతం హోల్డ్.. మైండ్ బ్లోయింగ్ టాక్
మొదటి రోజు వచ్చిన భారీ కలెక్షన్లతో పోలిస్తే, వర్కింగ్ డేస్‌లో కూడా 90 శాతం కలెక్షన్ల హోల్డ్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఏకగ్రీవ పాజిటివ్ టాక్ వల్ల బి, సి సెంటర్లలో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.
రవితేజ మార్క్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, గుండెలను పిండేసే సెంటిమెంట్ సీన్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి డిఫరెంట్ ఎమోషనల్ కథతో వచ్చి సెంచరీ కొట్టడం ఆయన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన రికార్డుగా నిలిచిపోనుంది.
యశ్ 'టాక్సిక్' నుంచి కాంపిటీషన్.. లైఫ్‌టైమ్ రన్ ఎంత ఉండొచ్చు?
బుధవారం (ఆగస్ట్ 26) కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పాన్ ఇండియా కాంపిటీషన్‌ను తట్టుకుని 'ఇరుముడి' ఫుల్ రన్‌లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
'టాక్సిక్' టాక్ ఎలా ఉంటుందనే దానిపైనే 'ఇరుముడి' లైఫ్‌టైమ్ వసూళ్లు ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా, ప్రసుతం ఉన్న జోరు చూస్తుంటే మాస్ మహారాజా బాక్సాఫీస్ వేట ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


