...
...
Next Story

Shiva Nirvana Vaishnavi: అప్పుడు న‌డుం గిల్లే సీనంటే కంఫర్ట‌బుల్ కాదన్నావ్.. బేబీ చూసి షాక‌య్యా: వైష్ణ‌వితో శివ నిర్వాణ

Shiva Nirvana Vaishnavi: ఇరుముడితో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ తాజా కామెంట్లు వైరల్ గా మారాయి. యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి అతను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎపిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

Published on: Sep 5, 2026, 16:19:31 IST
Advertisement

Shiva Nirvana Vaishnavi: ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్న సినిమా ఇరుముడి. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి శివ నిర్వాణ చెప్పిన మాటలే అందుకు కారణం.

ఎపిక్ ట్రైలర్

అప్పుడు న‌డుం గిల్లే సీనంటే కంఫర్ట‌బుల్ కాదన్నావ్.. బేబీ చూసి షాక‌య్యా: వైష్ణ‌వితో శివ నిర్వాణా
అప్పుడు న‌డుం గిల్లే సీనంటే కంఫర్ట‌బుల్ కాదన్నావ్.. బేబీ చూసి షాక‌య్యా: వైష్ణ‌వితో శివ నిర్వాణా

తాజాగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఎపిక్ మూవీకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ ఎపిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా వైష్ణవి గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ కు రష్మిక మందన్న చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం.

శివ నిర్వాణ కామెంట్లు

ఎపిక్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శివ నిర్వాణ మాట్లాడుతూ.. వైష్ణవి చైతన్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘టక్ జగదీష్’ మూవీలో వైష్ణవి ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

‘‘టక్ జగదీష్ సినిమా షూటింగ్ లో రౌడీ వచ్చి నడుం గిల్లాలి. నీకు గుర్తుందా? రౌడీని నడుం గిల్లమని చెప్పా. కానీ వైష్ణవి అందుకు ఒప్పుకోలేదు. నేను కంఫర్టబుల్ గా లేనని చెప్పింది’’ అని శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.

ఆ మీమ్ గుర్తొచ్చింది

శివ నిర్వాణకు ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య థ్యాంక్స్ చెప్పింది. ‘‘టక్ జగదీష్ జర్నీ ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది. బేబీ తర్వాత మీ నుంచి కాల్ వచ్చిన రోజు కూడా గుర్తుంది. మీ మాటలు గుర్తున్నాయి. మీ సినిమాలన్నీ చూస్తూనే ఉంటా. ఇరుముడికి ఫ్యామిలీతో కలిసి వెళ్లాం. మా అమ్మమ్మ ఎమోషనల్ అయింది’’ అని వైష్ణవి చైతన్య తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks