Ravi Teja Irumudi: ర‌వితేజ‌కు డ‌బుల్ జాక్‌పాట్‌-ఇరుముడి స‌క్సెస్‌తో పేరుకు పేరు-డ‌బ్బుకు డ‌బ్బు-ఇప్ప‌టికే రూ.50 కోట్లు!

Ravi Teja Irumudi: మాస్ మహారాజ రవితేజకు ఇరుముడి మూవీతో డబుల్ జాక్‌పాట్‌ తగిలింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. అంతేకాకుండా రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ద్వారా రవితేజ అకౌంట్లో భారీగా డబ్బు చేరుతోంది. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Aug 31, 2026, 05:48:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ravi Teja Irumudi: సినీ పరిశ్రమలో కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా సాధిస్తున్న వసూళ్ల కంటే.. ఈ చిత్రం ద్వారా హీరో రవితేజ అందుకున్న లాభాలు ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ర‌వితేజ‌కు డ‌బుల్ జాక్‌పాట్‌-ఇరుముడి స‌క్సెస్‌తో పేరుకు పేరు-డ‌బ్బుకు డ‌బ్బు-ఇప్ప‌టికే రూ.50 కోట్లు! (x/RaviTeja_offl)
ర‌వితేజ‌కు డ‌బుల్ జాక్‌పాట్‌-ఇరుముడి స‌క్సెస్‌తో పేరుకు పేరు-డ‌బ్బుకు డ‌బ్బు-ఇప్ప‌టికే రూ.50 కోట్లు! (x/RaviTeja_offl)

రవితేజకు జాక్‌పాట్

ఇరుముడి సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ వీకెండ్ లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఓ నటుడిగా రవితేజ కెరీర్ ను ఇరుముడి నిలబెట్టింది. మరోవైపు రూ.7 నుంచి రూ.8 కోట్ల రెమ్యునరేషన్ కు బదులుగా నైజాం ఏరియా రైట్స్ తీసుకున్న రవితేజకు, ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్ల షేర్ వసూళ్లు దక్కే దిశగా సినిమా దూసుకుపోతోంది.

మైత్రి మూవీ మేకర్స్ - రవితేజ డీల్

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘ఇరుముడి’ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన ఒప్పందం జరిగింది. ‘ఇరుముడి’ సినిమా సైన్ చేసే సమయానికి రవితేజ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయన రెమ్యూనరేషన్ దాదాపు రూ.7 నుంచి రూ.8 కోట్లుగా ఉంది. అయితే నిర్మాతలు ఆయనకు నగదు రూపంలో పారితోషికం ఇవ్వడానికి బదులుగా, నైజాం ప్రాంత థియేట్రికల్ హక్కులను రెమ్యూనరేషన్‌గా బదిలీ చేశారని తెలిసింది.

రూ.20 కోట్లు అనుకుంటే

ఇరుముడి సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న మొదటి రెండు రోజుల్లోనే.. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఈజీగా రూ.20 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. అంటే, తన రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు మొత్తాన్ని (రూ.20 కోట్లు+) రవితేజ లాభంగా పొందబోతున్నారని అందరూ భావించారు.

ఊహకు అందని ట్విస్ట్

అయితే ఇక్కడే అసలైన బాక్సాఫీస్ మ్యాజిక్ జరిగింది. కేవలం రూ.20 కోట్లతో ఆగిపోతుందనుకున్న ‘ఇరుముడి’ వసూళ్ల ప్రభంజనం నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. తాజా ట్రేడ్ అప్‌డేట్స్ ప్రకారం, ఈ సినిమా కేవలం నైజాం ఏరియాలోనే ఏకంగా రూ.50 కోట్ల షేర్ వసూలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్ శాలరీ స్థానంలో రవితేజ నైజాం రైట్స్ రిస్క్ తీసుకోవడం వల్ల.. ఇప్పుడు ఆయనకు ఏకంగా రూ.50 కోట్ల భారీ మొత్తం చేతికి అందబోతోంది. అంటే తన సాధారణ రెమ్యూనరేషన్ కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ లాభాన్ని ఆయన ఒకే ఒక్క ఏరియా ద్వారా అందుకోవడం విశేషం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More