Irumudi Box Office Collection: ఇరుముడి బ్లాక్‌బస్టర్.. రెండు రోజుల్లోనే బ్రేక్ఈవెన్.. మూడు రోజుల్లో రూ.75 కోట్లు..
Irumudi Box Office Collection: రవితేజ ఇరుముడి మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ సినిమా తొలి వీకెండ్ లో ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్ లోనూ చేరింది.
Irumudi Box Office Collection: మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ దగ్గర నయా హిస్టరీ క్రియేట్ చేశారు. ఆయన లేటెస్ట్ డివోషనల్ మాస్ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' థియేటర్లలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. జస్ట్ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసి, మొదటి వికెండ్‌లోనే రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మాస్ రాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వికెండ్ ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పింది.

2 రోజులలోనే బ్రేక్ ఈవెన్.. రూ. 75 కోట్ల రికార్డ్ కలెక్షన్లు
సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా థియేట్రికల్ రికవరీ టార్గెట్ పూర్తి చేయడానికి వారం నుంచి రెండు వారాల సమయం పడుతుంది. కానీ 'ఇరుముడి' మూవీ రూ. 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కేవలం రెండు రోజుల్లోనే దాటేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రవితేజ కెరీర్‌లోనే ఆల్-టైమ్ హయ్యెస్ట్ వీకెండ్ గ్రాసర్‌గా నిలిచింది. శుక్రవారం (ఆగస్ట్ 21) నుంచి మొదలైన ఈ రన్ సోమవారం (ఆగస్ట్ 24) కూడా ఏమాత్రం తగ్గలేదు. వీక్‌డేస్‌లో కూడా బుకింగ్స్ సాలిడ్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమా లాంగ్ రన్ భారీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
ఓవర్సీస్‌లో రవితేజ నయా రికార్డ్.. ఫస్ట్ టైమ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో..
ఇటు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'ఇరుముడి' ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అరుదైన మైలురాయి దాటింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్ల (1 Million Dollars) మార్కును క్రాస్ చేసి రవితేజ కెరీర్‌లోనే తొలి మిలియన్ డాలర్ క్లబ్ మూవీగా నిలిచింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో మాస్ మహారాజాకు ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్, ల్యాండ్‌మార్క్ అచీవ్‌మెంట్ అని చెప్పవచ్చు. యూఎస్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వీకెండ్ ముగిసినా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. BookMyShow లో సోమవారం గంటకు 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతుండటం ఈ సినిమా మేనియాకు అద్దం పడుతోంది.
డివోషనల్ ఎమోషన్, మాస్ విందు.. లాభాల బాటలో బయర్స్
మాస్ ఎంటర్‌టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్ ఎలిమెంట్స్ సరికొత్త కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. రవితేజ ఎనర్జీ, డైరెక్టర్ టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తున్నాయి.
థియేట్రికల్ రికవరీని రికార్డు టైమ్‌లో పూర్తి చేయడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ భారీ లాభాల బాట పట్టారు. మాస్ రాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచే దిశగా 'ఇరుముడి' దూసుకుపోతోంది. గతంలో నిన్ను కోరి, మజిలీ, ఖుషీలాంటి లవ్ స్టోరీలను అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఇప్పుడీ డివోషనల్ మూవీతో రవితేజకు బ్లాక్‌బస్టర్ అందించడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


