Irumudi Collection: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుట్.. రవితేజ ఇరుముడి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?

Ravi Teja Irumudi Box Office Collection Day 2: మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Published on: Aug 23, 2026, 17:43:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ravi Teja Irumudi 2 Days Worldwide Box Office Collection: మాస్ మహారాజా రవితేజ సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఇరుముడి'. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా, రెండో రోజు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది.

2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుట్.. రవితేజ ఇరుముడి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?
2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుట్.. రవితేజ ఇరుముడి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం

ట్రేడ్ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2,943 షోలలో ప్రదర్శితమైన ఇరుముడి చిత్రం రెండో రోజు రూ. 16.10 కోట్ల నికర (Net) వసూళ్లను సాధించింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి భారతీయ బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' మొత్తం రూ. 31.40 కోట్ల నికర వసూళ్లను సాధించి సత్తా చాటింది.

తెలుగు వెర్షన్‌కే ఎక్కువ

అలాగే, రూ. 36.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో అత్యధిక వాటా తెలుగు వెర్షన్ నుంచే రావడం విశేషం. తెలుగు వెర్షన్ ద్వారా రూ. 31.34 కోట్లు రాగా, తమిళ వెర్షన్ నుంచి రూ. 0.06 కోట్లు వసూలయ్యాయి.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఏకంగా 78.54 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఇరుముడి సినిమా. ఉదయం షోలకు 63.00 శాతంతో ప్రారంభమైన ఆక్యుపెన్సీ, మధ్యాహ్నానికి 80.00 శాతానికి, సాయంత్రానికి 82.85 శాతానికి పెరిగింది.

థియేటర్లు హౌస్‌ఫుల్

ఇక నైట్ షోలలో ఏకంగా 88.31 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. వారాంతం కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓవర్సీస్‌లోనూ రవితేజ హవా

ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ రవితేజ తన మాస్ పవర్‌ను నిరూపించుకుంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో రెండో రోజు రూ. 5.00 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, అక్కడ మొత్తం రూ. 11 కోట్ల గ్రాస్ మార్కును తాకింది. దీనితో కలిపి 'ఇరుముడి' ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు కేవలం రెండు రోజుల్లోనే రూ. 47.45 కోట్లకు చేరుకున్నాయి.

ఇరుముడి థియేట్రికల్ బిజినెస్

అయితే, మీసాలోడి ఇరుముడి సినిమాకు వరల్డ్ వైడ్‌గా సుమారుగా రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన ఇరుముడి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపుగా రూ. 21 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్

అయితే, ఇరుముడి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 47.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి, ఈ లెక్కన 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సునాయసంగా దాటేసింది ఇరుముడి సినిమా. ఇలా రెండ్రోజుల్లోనే ఇరుముడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

ఇరుముడి హిట్‌కి కారణాలు

ఇదిలా ఉంటే, ఇరుముడి సినిమాలో రవితేజ నటనతో పాటు బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తమ పాత్రల్లో ఒదిగిపోయారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడతారని 'ఇరుముడి' వసూళ్లు మరోసారి రుజువు చేస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More