Irumudi Movie: మోత మోగిపోతున్న థియేటర్లు.. ఇరుముడి సినిమా క్రేజ్.. హారతులు, భజనలు.. ఫ్యాన్స్‌తో కలిసి రవితేజ పిల్లలు!
Irumudi Movie: సినిమా థియేటర్లు మోత మోగుతున్నాయి. భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నాయి. హారతులు, భజనలతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇవన్నీ.. ఇరుముడి రిలీజ్ సందర్భంగా థియేటర్లలో కనిపిస్తున్న సీన్లు. ఇక ఫ్యాన్స్ తో కలిసి రవితేజ కొడుకు, కూతురు మూవీ చూడటం విశేషం.
Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ థియేటర్లలో అదరగొడుతోంది. ఇవాళ (ఆగస్టు 21) రిలీజైన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీతో రవితేజ హిట్ కొట్టాడని అంతా అంటున్నారు. మరోవైపు థియేటర్లలో ఇరుముడి స్క్రీనింగ్ సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ గా మారాయి.

ఇరుముడి సక్సెస్
వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు తీసిన రవితేజ ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రూట్ మార్చి ‘ఇరుముడి’ అని ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ తో థియేటర్లలోకి వచ్చాడు. ఆ ప్రయోగం ఫలించింది. ఇరుముడి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ స్క్రీనింగ్ అవుతున్న థియేటర్లలో ఆడియన్స్ భక్తితో ఊగిపోతున్నారు.
స్క్రీన్ కు హారతి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకదాంట్లో థియేటర్ లోపల స్క్రీన్ కు హారతి ఇస్తున్న సీన్ హాట్ టాపిక్ గా మారింది. స్క్రీన్ పై ఇరుముడి సినిమాలోని అయ్యప్ప సాంగ్ వస్తుంటే ఓ ప్రేక్షకుడు హారతి ఇస్తూ కనిపించాడు. ఈ వీడియోను రవితేజ ఫ్యాన్స్, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
భజనలు, డ్యాన్స్ లు
ఇరుముడి సినిమాలో హీరో అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే ‘కట్టు కట్టు కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ పాటలు రాగానే ఆడియన్స్ కూడా గొంతు కలుపుతున్నారు. కొంతమంది ఏమో స్క్రీన్ ముందుకు వెళ్లి భజన చేస్తున్నారు. డ్యాన్స్ లు చేస్తున్నారు. విదేశాల్లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి.
రవితేజ పిల్లలు
మరోవైపు మాస్ మహారాజా రవితేజ పిల్లలు ఫ్యాన్స్ తో కలిసి ఇరుముడి సినిమా చూశారు. హైదరాబాద్ లోని విమల్ థియేటర్లో వీళ్లు ఫస్ట్ షో చూశారు. రవితేజ కొడుకు, కూతురు థియేటర్ కు వచ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇరుముడి గురించి
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటించిన మూవీ ఇరుముడి. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. ప్రతి అమ్మాయిలోనూ తన సొంత కూతురిని చూసుకునే తండ్రి కథతో ఈ మూవీ తెరకెక్కింది.
ఇరుముడి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. చిత్రానికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


