Jaquelin Fernandes: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా.. అన్ని హద్దులూ దాటేశారు: లేటెస్ట్ సాంగ్‌పై ట్రోలింగ్
Jaquelin Fernandes: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఓ పాటపై ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సాంగ్ లో ఆమె బూబ్స్ కనిపించేలా చూపించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత యూట్యూబ్ వీడియోలో బ్లర్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Jaquelin Fernandes: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త మ్యూజిక్ వీడియో 'జుగ్ని' (Jugni) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల 'వెల్కమ్ టు ది జంగిల్' మూవీతో ఏకంగా రూ.120 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రాబట్టి మంచి జోష్ మీదున్న ఈ భామకు.. ఇప్పుడు ఒక విచిత్రమైన వివాదం చుట్టుముట్టింది. ఈ పాటలో ఆమె మితిమీరిన ఎక్స్‌పోజింగ్, దానిని అలాగే యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు వివాదం ఏంటి?
పాపులర్ సింగర్ బి ప్రాక్ పాడిన 'జుగ్ని' ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఇటీవల యూట్యూబ్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ పాటలోని ఒక డ్యాన్స్ సీక్వెన్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసుకున్న డ్రెస్ ఓ చోట మరీ ఆమె బూబ్స్ మొత్తం కనిపించేలా చేసింది. దీనిని చూసీచూడనట్లు మేకర్స్ అలాగే మొదట యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయడంతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.
వీడియోలో ఆమె బోల్డ్ లుక్స్ మితిమీరిపోయాయని, ఎడిటింగ్‌లో టీమ్ సరిగ్గా చెక్ చేసుకోకుండానే ఆ సీన్‌ను అలానే వదిలేసిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్లిప్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, షార్ట్ వీడియోలు నిమిషాల్లో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి.
యూట్యూబ్‌లో బ్లర్.. అయినా ఆగని రచ్చ!
వివాదం ముదరడంతో మేకర్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. యూట్యూబ్‌లో ఉన్న అఫీషియల్ వీడియోలోని ఆ పర్టికులర్ బోల్డ్ సీక్వెన్స్‌ను మేకర్స్ బ్లర్ చేశారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయిందని సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
ఎంత పెద్ద మేకర్స్ అయినా, స్టార్ హీరోయిన్ అయినా రిలీజ్ కంటే ముందే ఆ సీన్‌ను ఎలా గమనించలేకపోయారో అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక పొరపాటా లేక కావాలనే ఆడియన్స్ అటెన్షన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంటా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్‌లో 'జుగ్ని'.. జాక్వెలిన్ కెరీర్ గ్రాఫ్
ఏది ఏమైనా ఈ వివాదం పాట వ్యూస్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం 'జుగ్ని' సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. బి ప్రాక్ ఎనర్జిటిక్ వాయిస్, జాక్వెలిన్ గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల కిందట రిలీజైన ఈ పాటకు ఇప్పటికే 14 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.
గతంలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ 'కిక్', 'జుడ్వా 2', 'రేస్ 3' లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌తో బాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల వివాదాల వల్ల కొంతకాలం వార్తల్లో నిలిచిన ఈ భామ.. 'వెల్కమ్ టు ది జంగిల్' సినిమా భారీ విజయం సాధించడంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త పాట వివాదం మళ్లీ ఆమె పేరును బి టౌన్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


