Jailer 2: మోహన్‌లాల్‌లాాంటి సూపర్ స్టార్ సీన్లను కట్ చేస్తారా.. మళ్లీ ఇలాంటి సినిమా చేయను: జైలర్ 2పై డిజైనర్ విమర్శలు

Jailer 2: రజనీకాంత్ జైలర్ 2 మూవీపై వివాదం రేగింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్రను ట్రిమ్ చేయడంపై ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Oct 15, 2026, 17:44:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), తమిళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ 'జైలర్ 2' (Jailer 2) థియేటర్లలో దూసుకుపోతుండగానే ఒక పెద్ద వివాదం రాజుకుంది. మలయాళ దిగ్గజ నటుడు, మోస్ట్ పాపులర్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ఈ సినిమాలో పోషించిన ‘మాథ్యూ’ రోల్‌కు సంబంధించిన చాలా సీన్లను ఎడిటింగ్ టేబుల్ మీద లేపేయడంపై ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంషుద్దీన్ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Jailer 2: మోహన్‌లాల్‌లాాంటి సూపర్ స్టార్ సీన్లను కట్ చేస్తారా.. మళ్లీ ఇలాంటి సినిమా చేయను: జైలర్ 2పై డిజైనర్ విమర్శలు
Jailer 2: మోహన్‌లాల్‌లాాంటి సూపర్ స్టార్ సీన్లను కట్ చేస్తారా.. మళ్లీ ఇలాంటి సినిమా చేయను: జైలర్ 2పై డిజైనర్ విమర్శలు

సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక దిగ్గజ నటుడి క్యారెక్టర్ సీన్లను ఇలా అనవసరంగా కట్ చేయడం ఏంటని ఆయన టీమ్‌ను నిలదీశారు.

సీన్లు ఎడిట్ చేయడం దారుణం.. 'జైలర్ 3' వస్తే నేను చేయను

కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంషుద్దీన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మోహన్‌లాల్ కాస్ట్యూమ్స్‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. "నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జైలర్ 2 రిలీజ్ సందర్భంగా ఒక ముఖ్యమైన అప్‌డేట్ పంచుకోవాలి. షూటింగ్ ముగిసినప్పుడు మా వర్క్ చూసి నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కానీ థియేటర్లలో సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయింది. లాలెట్టన్ (మోహన్‌లాల్) కోసం డిజైన్ చేసిన మూడు డిఫరెంట్ లుక్స్ పూర్తిగా ఎడిటింగ్‌లో తీసేశారు. చివరికి ట్రైలర్‌లో చూపించిన సీన్‌ను కూడా బాగా ట్రిమ్ చేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా నెల్సన్ టీమ్ మేకింగ్ విధానాన్ని తప్పుబడుతూ.. "సినీ పరిశ్రమలో నాకున్న అనుభవంతో చెబుతున్నా, మోహన్‌లాల్ సర్ లాంటి గ్లోబల్ సూపర్ స్టార్ సీన్లను ఇలా ట్రిమ్ చేయడం దారుణమైన ఆప్షన్. మన లాలెట్టన్ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఇలా తగ్గించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఒకవేళ భవిష్యత్తులో 'జైలర్ 3' సిక్వెల్ వస్తే నేను కచ్చితంగా ఆ ప్రాజెక్ట్‌లో ఉండను. నన్ను నమ్మిన ఫ్యాన్స్ అందరికీ సారీ" అని బిగ్ బాంబ్ పేల్చారు.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం

జైలర్ ఫస్ట్ పార్ట్‌లో మోహన్‌లాల్ చేసిన మాథ్యూ క్యారెక్టర్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఐకానిక్ గ్లాసెస్, ఫ్లాషీ షర్ట్స్‌తో మోహన్‌లాల్ ఎంట్రీ ఇస్తే థియేటర్లు విజిళ్లతో హోరెత్తిపోయాయి. సెకండ్ పార్ట్‌లో ఆ రచ్చ మరింత రేంజ్‌లో ఉంటుందని ఆశించిన అభిమానులకు కేవలం కొన్ని సెకన్ల క్లైమాక్స్ షాట్‌తో సరిపెట్టడం ఏమాత్రం నచ్చలేదు.

"అసలు సరైన రోల్ ఇచ్చే ఆలోచన లేనప్పుడు ఆయనను పిలవడం ఎందుకు?" అని మోహన్‌లాల్ ఫ్యాన్స్ నెల్సన్ దిలీప్‌కుమార్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎడిటింగ్ ఛాయిస్ వల్ల ఒక లెజెండరీ యాక్టర్ స్క్రీన్ టైమ్ తగ్గిపోవడం నిజంగా డిసప్పాయింటింగ్ అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జైలర్ 2 సినిమాకు మాత్రం తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More