అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.50 కోట్లు.. జన నాయగన్ సునామీ.. సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉన్నా..

దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దుమ్ము రేపుతోంది. ఇప్పటికీ సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రాక.. మద్రాస్ హైకోర్టులోనూ ఎదురు దెబ్బ తగిలి రిలీజ్ వాయిదా పడే ప్రమాదంలో ఉన్నా బుకింగ్స్ జోరు తగ్గడం లేదు.

Published on: Jan 7, 2026, 18:59:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఒకపక్క సినిమా విడుదలైతే రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అడ్వాన్స్ బుకింగ్స్ (రూ. 50 కోట్లు) చెబుతుంటే.. మరోపక్క మద్రాస్ హైకోర్టులో కేసు తీర్పు రిజర్వ్ అవ్వడంతో జనవరి 9న సినిమా వస్తుందా రాదా అనే టెన్షన్ నెలకొంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.50 కోట్లు.. జన నాయగన్ సునామీ.. సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉన్నా..
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.50 కోట్లు.. జన నాయగన్ సునామీ.. సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉన్నా..

జన నాయగన్ బుకింగ్స్ సునామీ.. రూ. 50 కోట్లు

జన నాయగన్ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోయినా.. విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటుతున్నాయి. అదే స్థాయిలో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి.

అయితే సినిమాకు సెన్సార్ చిక్కులు ఉన్నా, కేవలం పరిమితంగా ఓపెన్ చేసిన బుకింగ్స్ తోనే 'జన నాయగన్' రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ ద్వారానే సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో కేవలం మొదటి రోజు కోసమే రూ. 32 కోట్లు రావడం విశేషం.

ఇక మలేషియాలో బుకింగ్స్ ఓపెన్ అయిన గంటన్నరలోనే 90,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విజయ్ గత చిత్రం 'లియో' (1.08 లక్షల టికెట్లు) రికార్డును ఇది దాటేలా ఉంది. అక్కడ ఈ సినిమాకు '16' రేటింగ్ ఇచ్చారు.

ఇండియా విషయానకి వస్తే.. కర్ణాటక, కేరళ వంటి పరిమిత ప్రాంతాల్లోనే బుకింగ్స్ ఓపెన్ అయినా.. ఇండియాలో 2.93 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. ఇప్పటివరకు ఇండియాలో రూ. 7.7 కోట్లు వసూలు చేసింది.

హైకోర్టు షాక్.. చెన్నైలో షోలు మాయం

సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికెట్ జాప్యంపై కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌పై బుధవారం (జనవరి 7) విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేయడంతో.. ప్లాన్ ప్రకారం జనవరి 9న సినిమా రిలీజ్ అవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

హైకోర్టు పరిణామాల నేపథ్యంలో చెన్నైలో బుక్‌మైషో (BookMyShow) ప్లాట్‌ఫామ్ సినిమా షోలను తొలగించింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు నటించిన ఈ సినిమాపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రిలీజ్ వాయిదా వేయాల్సి వస్తే మాత్రం మేకర్స్ కు అది పెద్ద దెబ్బే అవుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More