Jana Nayagan OTT: విజయ్ జన నాయగన్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? నెల రోజుల్లోపే వచ్చేస్తోందంటూ బజ్

Jana Nayagan OTT: తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 21 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు బజ్ నెలకొంది.

Published on: Aug 6, 2026, 15:25:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan OTT: తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేముందు తీసిన చివరి చిత్రం ‘జన నాయగన్’. బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.

Jana Nayagan OTT: విజయ్ జన నాయగన్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? నెల రోజుల్లోపే వచ్చేస్తోందంటూ బజ్
Jana Nayagan OTT: విజయ్ జన నాయగన్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? నెల రోజుల్లోపే వచ్చేస్తోందంటూ బజ్

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ బిగ్ ప్రాజెక్ట్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) లో ఆగస్టు 21, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు నెట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

థియేటర్లలో మిశ్రమ స్పందన.. బాక్సాఫీస్ నిరాశ

మాస్ డైరెక్టర్ హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రమోషనల్ డేస్ నుంచి భారీ హైప్ నెలకొంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన ప్రాజెక్ట్ కావడం, తమిళనాడు రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు.

అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత కమర్షియల్‌గా ఈ మూవీ ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. హెచ్. వినోద్ టేకింగ్, పొలిటికల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కథనంలో స్పీడ్ తగ్గడంతో బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఆగస్టు 21 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్.. జీ5లోకి వివిధ భాషల్లో..

బాక్సాఫీస్ రన్ పూర్తయిన నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ఆగస్టు 21న జీ5 ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అదే జరిగితే నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ఈ స్ట్రీమింగ్ విషయంపై జీ5 సంస్థ లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో మిస్ అయిన మాస్ ఆడియన్స్, విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ స్టార్ కాస్టింగ్.. అనిరుధ్ మాస్ మ్యూజిక్

కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించింది. గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించగా, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ రోల్ పోషించారు.

వీరితో పాటు సీనియర్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, రేవతి, హాస్య నటుడు సునీల్, నాజర్ వంటి దిగ్గజ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరిసారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సినిమాలకు ముగింపు.. రాజకీయంపైనే విజయ్ ఫోకస్

దళపతి విజయ్ తన సినీ కెరీర్‌లో సాధించిన రికార్డులు, బాక్సాఫీస్ స్టామినా ఇండియన్ సినిమాలో చిరస్మరణీయం. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిస్థాయి ప్రజాసేవకే సమయం కేటాయించనున్నట్లు ప్రకటించడంతో 'జన నాయగన్' ప్రాజెక్ట్‌కు ఎంతో ప్రత్యేకత లభించింది.

బాక్సాఫీస్ దగ్గర ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయినా, డిజిటల్ వేదికపై ఓటీటీ రికార్డులను బద్దలు కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న అఫీషియల్ పోస్టర్‌తో స్ట్రీమింగ్ టైమింగ్స్‌పై మరింత స్పష్టత రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More