Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అటు యాక్టింగ్ లో, ఇటు అందంలోనూ దివంగత తన తల్లికి ఏ మాత్రం తగ్గకుండా జాన్వీ సాగిపోతోంది. తాజాగా ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్లో జాన్వీ కపూర్ మెరిసిపోయింది. ఆమె ఫొటోలు, వైరల్ తెగ వైరల్ గా మారాయి.
జాన్వీ కపూర్ వైరల్

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లను పరుగెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ (మే 23) మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో జాన్వీ కపూర్ పార్టిసిపేట్ చేసింది.
బ్లూ కలర్ డ్రెస్ లో
పెద్ది కి ఆవాజ్ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆమె ఎంట్రీ టైమ్ లో ఫ్యాన్స్ కేకలు పెట్టారు. ఈ స్పెషల్ ప్లేస్ లో పెద్ది ఈవెంట్ జరగడం హ్యాపీగా ఉందని జాన్వీ తెలిపింది. పెద్ది మూవీలో జాన్వీ కపూర్.. అచ్చియమ్మ క్యారెక్టర్ ప్లే చేసింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే అమ్మాయిగా ఆమె నటించింది.
అప్పట్లొ ఆ జోడీ
అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి జోడీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో వీళ్ల మ్యాజిక్ అదిరిపోయింది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జత కట్టారు. పెద్ది సినిమాతో ఫస్ట్ టైమ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ జోడీ కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి.
రామ్ చరణ్ కష్టం
{{/usCountry}}అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి జోడీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో వీళ్ల మ్యాజిక్ అదిరిపోయింది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జత కట్టారు. పెద్ది సినిమాతో ఫస్ట్ టైమ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ జోడీ కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి.
రామ్ చరణ్ కష్టం
{{/usCountry}}పెద్ది మూవీలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. క్రికెటర్ గా, రన్నర్ గా, రెజ్లర్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ది ట్రైలర్ లో చరణ్ కష్టం కనిపించింది. ఈ మూవీ కోసం అతను ఎంతలా కష్టపడ్డాడో తెలిసొచ్చింది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న పెద్ది మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఆస్కార్ ఆవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ కు అదిరే రెస్పాన్స్ దక్కింది.