Janhvi Kapoor: షాకింగ్..పెద్ది మూవీలో తన పాత్రపై జాన్వీ సంతోషంగా లేదా? ఇది అవమానంగా భావిస్తోందా? ఆ లైక్ వెనుక అర్థమేంటి?

Janhvi Kapoor: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పెద్ది’ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, రొమాన్స్ పేరుతో వేధింపులను చూపించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు జాన్వీ కపూర్ సపోర్ట్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ అయింది.

Published on: Jun 4, 2026, 21:32:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా.. దీని చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం ముదురుతోంది.

Janhvi Kapoor: షాకింగ్..పెద్ది మూవీలో తన పాత్రపై జాన్వీ సంతోషంగా లేదా? ఇది అవమానంగా భావిస్తోందా? ఆ లైక్ వెనుక అర్థమేంటి?
Janhvi Kapoor: షాకింగ్..పెద్ది మూవీలో తన పాత్రపై జాన్వీ సంతోషంగా లేదా? ఇది అవమానంగా భావిస్తోందా? ఆ లైక్ వెనుక అర్థమేంటి?

సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం మీద ఆడియన్స్, క్రిటిక్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే, తన క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపించారనే విమర్శలను స్వయంగా జాన్వీ కపూర్ సమర్థిస్తూ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వెలుగులోకి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'రెకమండేషన్ కమ్యూనిటీ' (Recommendation Community) అనే పేజీ ‘పెద్ది’ సినిమా మీద ఒక పెద్ద అనాలిసిస్ పోస్ట్ చేసింది. "ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక స్టార్ హీరోయిన్‌కు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం పెద్ది" అని ఆ పేజీ అందులో రాసుకొచ్చింది.

రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో హీరో సామాజిక హక్కుల కోసం పోరాడుతుంటే, హీరోయిన్ అచ్చియమ్మ పాత్రను మాత్రం కేవలం గ్లామర్ షోకే పరిమితం చేశారని అందులో తీవ్రంగా విమర్శించారు. డైరెక్టర్ బుచ్చిబాబు హీరోకు సోషల్ యాక్టివిస్ట్ ఇమేజ్ ఇస్తూ, హీరోయిన్‌ను మాత్రం నడుము క్లోజప్ షాట్స్‌కే వాడేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను నటి జాన్వీ కపూర్ లైక్ చేయడం ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఆమె డైరెక్ట్‌గా ఎలాంటి కామెంట్ చేయకపోయినా.. ఈ విమర్శలతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నట్లు ఈ ఒక్క ‘లైక్’తో ఇండస్ట్రీకి గట్టి సిగ్నల్ ఇచ్చారు.

జాన్వీ కపూర్ లైక్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్
జాన్వీ కపూర్ లైక్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్

అసలు లైక్ ఎందుకు చేసింది?

సాధారణంగా టాలీవుడ్‌లో ఎంత పెద్ద డైరెక్టర్, హీరో అయినా.. హీరోయిన్స్ ఇలా ఓపెన్‌గా వాళ్ళ సినిమాల మీద వచ్చే నెగెటివ్ కామెంట్స్‌ను సపోర్ట్ చేయరు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పోతాయనే భయం లేదంటే మరేదైనా కారణం కావచ్చు. కానీ జాన్వీ ఇలా చేయడం షాక్‌కు గురి చేస్తోంది. అంటే తన పాత్రపై జాన్వీకి అసంతృప్తి ఉందా? ఈ విషయాన్ని ముందే చెప్పినా మేకర్స్ పట్టించుకోలేదా? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టు చూసిన ఓ నెటిజన్.. చివరికి జాన్వీ కపూర్ కూడా లైక్ చేసిందా అంటూ ఓ ఏడుస్తున్న ఎమోజీ పోస్ట్ చేయడం గమనార్హం.

ఈ పరిణామంపై టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి. "సొంత సినిమానే హీరోయిన్ ఇలా తక్కువ చేసి చూపించేలా బిహేవ్ చేయడం టాలీవుడ్‌ను అవమానించడమే" అని ఒక వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక మహిళగా తన ఇష్టం లేకుండా తీసిన సీన్లపై ఆమె పరోక్షంగా స్పందించిన తీరు కరెక్టేనని సినీ విశ్లేషకులు మద్దతు ఇస్తున్నారు.

రొమాన్స్ పేరుతో వేధింపులు?

‘పెద్ది’లో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న లవ్ ట్రాక్ మీద కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ ఒప్పుకోకపోయినా, ఆమె తండ్రి పెళ్లికి రిజెక్ట్ చేసినా.. ఆమెను బలవంతంగా టచ్ చేస్తానని హీరో చెప్పే డైలాగులు కాంట్రవర్సీకి దారితీశాయి. కరెంట్ పోయినప్పుడు హీరోయిన్ ప్రమేయం లేకుండా హీరో ఆమెను ముద్దు పెట్టుకోవడం, దానికి ఆమె ఏడుస్తుంటే వేరే క్యారెక్టర్ వచ్చి ‘నీ తండ్రి పొలిటికల్ కెరీర్ కోసం దీన్ని మర్చిపో’ అని సలహా ఇవ్వడం లాంటివి అస్సలు రొమాన్స్ కాదని, అవి పక్కా వేధింపులే అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

విలన్ చేసే తప్పును తప్పుగా చూపిస్తూ, హీరో చేసే ఇలాంటి పనులను రొమాన్స్‌గా కవర్ చేయడం బుచ్చిబాబు మేకింగ్ ఫెయిల్యూర్‌ను చూపిస్తుందని విమర్శకులు చెప్తున్నారు. ఏదేమైనా జాన్వీ రియాక్షన్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉమెన్ పోర్ట్రేయల్ మీద కొత్త డిబేట్‌కు తెరతీసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పేరు ఏంటి?

ఈ సినిమాలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' (Achiyyamma) అనే ఒక గ్రామీణ యువతి పాత్రలో నటించారు.

పెద్ది సినిమాపై వచ్చిన ఏ విమర్శను జాన్వీ కపూర్ లైక్ చేశారు?

ఇన్‌స్టాగ్రామ్‌లో తన పాత్రను అతిగా గ్లామరైజ్ చేస్తూ, మహిళల సమ్మతిని (Consent) తక్కువ చేసి చూపించారంటూ వచ్చిన 'రెకమండేషన్ కమ్యూనిటీ' పోస్ట్‌ను ఆమె లైక్ చేశారు.

'పెద్ది' సినిమా బడ్జెట్ ఎంత? డైరెక్టర్ ఎవరు?

ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More