Janhvi Kapoor: ఇది వాళ్లకు అలవాటే.. విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తోంది: పెద్ది మూవీపై జాన్వీ కామెంట్స్‌పై తెలుగు ఫ్యాన్స్
Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెద్ది మూవీలో తన పాత్ర చిత్రీకరణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan 9) వేదికగా పాల్గొన్న జాన్వీ.. 'పెద్ది'లో తన పాత్రను చూపించిన విధానం అత్యంత అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా మూవీ 'పెద్ది' (Peddi). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా అచియమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై థియేట్రికల్ రన్ ముగించుకున్నప్పటికీ, అందులో కథానాయిక పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలు ఇంకా ఆగడం లేదు.

తాజాగా ప్రసిద్ధ బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan Season 9)లో వరుణ్ ధావన్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్.. 'పెద్ది' సినిమా వివాదంపై తొలిసారిగా నోరు విప్పారు. సౌత్ చిత్ర పరిశ్రమలో 'బౌండ్ స్క్రిప్ట్స్' ఉండవని, కెమెరా యాంగిల్స్ ముందే చూపించరని వ్యాఖ్యానించిన జాన్వీపై టాలీవుడ్ అభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
'విక్టిమ్ కార్డ్' వాడుతోందంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ విమర్శలు
దర్శకుడు బుచ్చి బాబు సానా ఇప్పటికే వివాదాస్పద సీన్ల గురించి క్షమాపణలు చెప్పారని, షూటింగ్‌కు ముందే పూర్తి కథను జాన్వీకి వివరించారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత లేదా విమర్శలు వచ్చిన తర్వాత బాలీవుడ్ నటీనటులు సౌత్ పరిశ్రమపై నిందలు వేస్తూ 'విక్టిమ్ కార్డ్' (Victim Card) వాడటం అలవాటుగా మారిందని ధ్వజమెత్తుతున్నారు.
మరికొందరైతే జాన్వీ కపూర్ గతంలో నటించిన హిందీ సినిమాలలోని కొన్ని బోల్డ్ అండ్ గ్లామరస్ క్లిప్‌లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఆమె 'డబుల్ స్టాండర్డ్స్' ప్రదర్శిస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద 'పెద్ది' సినిమా విడుదలైన నెలల తర్వాత కూడా జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్లు టాలీవుడ్ వర్గాల్లో, బాలీవుడ్ కారిడార్లలో సరికొత్త చర్చకు తెరలేపాయి.
అసలు జాన్వీ కపూర్ ఏమన్నదంటే?
ఇంటర్వ్యూలో హోస్ట్ కరణ్ జోహార్ 'పెద్ది' సినిమాపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ ఎంతో తీవ్రమైన పదజాలంతో స్పందించారు. "పెద్ది సినిమాలో నా పాత్రను చూపించిన విధానం చాలా వివాదాస్పదమైనది. అది అత్యంత దారుణమైన ఆబ్జెక్టిఫికేషన్ కు గురిచేసింది. నిజం చెప్పాలంటే, కథాపరంగా అది లైంగిక దాడిని ప్రోత్సహించేలా ఉందనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా వల్ల సమాజానికి ఎలాంటి ప్రతికూల సందేశం వెళ్లిందో తలుచుకుంటే నా మనస్సాక్షి నన్ను వేధిస్తోంది. ఆ సిగ్గును నేను జీవితాంతం మోయక తప్పదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన తప్పును కూడా అంగీకరిస్తూ.. "నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది. దర్శకుడిని ప్రశ్నించి, ఆ సీన్లను వద్దని చెప్పే అవకాశం నాకున్నప్పటికీ నేను ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో ఒక నటిగా నన్ను నేను కించపరుచుకున్నట్లే అనిపించింది" అని విచారం వ్యక్తం చేశారు.
సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు: "బౌండ్ స్క్రిప్ట్స్ ఉండవు!"
అయితే తప్పును ఒప్పుకుంటూనే సౌత్ చిత్ర పరిశ్రమ పనితీరుపై జాన్వీ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. "సౌత్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా మాత్రమే పూర్తిస్థాయి 'బౌండ్ స్క్రిప్ట్స్' (Bound Scripts) ఇస్తుంటారు. సెట్‌లోకి వెళ్లే వరకు ఏ కెమెరా యాంగిల్‌లో నిన్ను ఎలా షూట్ చేస్తున్నారో స్పష్టత ఉండదు" అని సౌత్ సినిమాలపై కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై తెలుగు సినీ అభిమానులు, సోషల్ మీడియా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'దేవర', 'పెద్ది' వంటి కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే నటించిన జాన్వీ కపూర్.. మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశించి అలా మాట్లాడటం సరైంది కాదని మండిపడుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


