Janhvi Kapoor Peddi: ‘పెద్ది’లో ఆ అవమానం నన్ను వేధిస్తూనే ఉంటుంది.. నాదే తప్పు.. మళ్లీ అది జరగదు: జాన్వీ సంచలన కామెంట్స్
Janhvi Kapoor Peddi: రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’లో తన పాత్ర చిత్రీకరణపై నటి జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన క్యారెక్టర్‌ను గ్లామర్ పేరిట మితిమీరిన ఎక్స్‌పోజింగ్ చేయడం, మహిళా సమాజంపై అది చూపించే ప్రతికూల ప్రభావం తన మనస్సాక్షిని ఇప్పటికీ తీవ్రంగా వేధిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Janhvi Kapoor Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణపై ప్రేక్షకులు, మహిళా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

క్యారెక్టర్ పరిచయం చేసే సమయంలో జాన్వీ శరీరాకృతిపైనే కెమెరా కోణాలు ఎక్కువగా కేంద్రీకరించడం, అలాగే ఆమె అనుమతి లేకుండా హీరో ముద్దుపెట్టుకునే సీన్ల వల్ల మహిళలను తక్కువ చేసి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ అత్యంత ఎమోషనల్ గా స్పందించారు.
"ఆ అవమానాన్ని జీవితాంతం మోస్తాను!" — జాన్వీ ఆవేదన
'పెద్ది' సినిమాలో తన పాత్రపై వచ్చిన వివాదాన్ని ఎలా స్వీకరించారని కరణ్ జోహార్ అడగ్గా.. జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. "ఆ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు. కానీ అలాంటి ఒక సీన్ లేదా నెరేటివ్ మన సమాజంలో, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఆలోచిస్తే నా మనస్సాక్షి తీవ్రంగా వేదనకు గురవుతోంది. ఆ అవమానాన్ని నా జీవితాంతం నాలోనే మోస్తాను. ఒక నటిగా నేను మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. 100 శాతం అది నా పొరపాటే. అది తీవ్రమైన ఆబ్జెక్టిఫికేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటిది మళ్లీ జరగదు" అని పేర్కొన్నారు.
నా తప్పే.. అలా చేయాల్సింది కాదు
తనపై తానే నిందలు వేసుకుంటూ చాలా రోజులు మానసికంగా నలిగిపోయానని జాన్వీ వెల్లడించారు. "తప్పును వేరొకరిపైకి నెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ దక్షిణాదిలో సాధారణంగా పక్కాగా రాసుకున్న బౌండ్ స్క్రిప్ట్‌లు లేదా కెమెరా యాంగిల్స్ ముందే నటులకు చూపించే సంస్కృతి తక్కువగా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్తే అది చేయడమే నటీనటుల బాధ్యత. అయితే నాకున్న స్టార్‌డమ్, అధికారాలను ఉపయోగించి ఆ సీన్లలో మార్పులు చేయించి ఉండాల్సింది. అది నాకో వింత అనుభవం. అయితే ఈ వివాదం వల్ల జరిగిన మంచి ఏంటంటే.. ఇకపై ఏ దర్శకుడైనా ఒక మహిళా పాత్రను ఆ రకంగా తెరపై చూపించే ముందు వందసార్లు ఆలోచిస్తారు" అని జాన్వీ స్పష్టం చేశారు.
దండం పెట్టి క్షమాపణలు కోరిన దర్శకుడు బుచ్చి బాబు సానా
'పెద్ది' విడుదలైన సమయంలో విమర్శలు వెల్లువెత్తడంతో దర్శకుడు బుచ్చి బాబు సానా సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. "నాకు తెరపైనా, బయటా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రనూ కించపరచడం మా ఉద్దేశం కాదు. ప్రేక్షకులు, విమర్శకుల భావోద్వేగాలను మేము గౌరవిస్తున్నాం. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సినిమాలో వివాదాస్పదంగా అనిపించిన ఆ సీన్లను తొలగించి, మార్పులు చేస్తున్నాం" అని ఆయన ప్రకటన విడుదల చేసి ఆ సీన్లను సినిమా నుంచి కట్ చేశారు.
ఈ అనుభవంతో రాబోయే రోజుల్లో కంటెంట్ ఎంపికలోనూ, పాత్రల చిత్రీకరణ విషయంలోనూ తాను మరింత కఠినంగా ఉంటానని జాన్వీ కపూర్ వెల్లడించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


