Ram Charan: కేవలం 8 గంటల్లో ఆ సీన్ పూర్తి చేశాం.. కష్టమే కానీ అసాధ్యం కాదు: పెద్ది మూవీపై రామ్ చరణ్
Ram Charan: రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ పెద్ది హిందీ టీవీ ప్రీమియర్ కాబోతున్న వేళ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా మూవీలోని ఓ సీన్ గురించి చరణ్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.
Ram Charan: డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. 1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.

సోనీ మాక్స్ (Sony MAX) ఛానెల్లో అక్టోబర్ 24 రాత్రి 8 గంటలకు హిందీలో ప్రసారం కానున్న సందర్భంగా, రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ విశేషాలను, తనకు బాగా కనెక్ట్ అయిన సీన్ల గురించి మీడియాతో పంచుకున్నారు.
కష్టమే కానీ అసాధ్యం కాదు.. ఆ ఎమోషనల్ సీన్ గురించి చరణ్ మాటల్లో..
పెద్ది సినిమాలోని కీలక సన్నివేశాల గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. "సినిమాలో కేవలం ఒకటి రెండు సీన్లు అని చెప్పలేను. క్రికెట్ మ్యాచ్‌లు, మల్టిపుల్ రెజ్లింగ్ ఫైట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరోని కేవలం ఒక్క రూపాయికి వేలం వేసే క్రికెట్ వేలం సీన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని గుర్తింపు తెచ్చుకుంటాడు అనేది ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది" అని తెలిపారు.
ఇక సినిమాలో అత్యంత భావోద్వేగభరితంగా సాగే హాస్పిటల్ సీన్ గురించి చెబుతూ.. హీరో ఇకపై ఎప్పటికీ రెజ్లింగ్ చేయలేడని తెలుసుకునే ఆ ఎమోషనల్ మూమెంట్ తనకు చాలా దగ్గరైందని అన్నారు. "ఆ సమయానికి నటీనటులందరూ పాత్రల్లో పూర్తిగా లీనమైపోయారు. దర్శకుడు బుచ్చి బాబు ఆ సీన్ కోసం చాలా రోజులు హోంవర్క్ చేసి ప్లాన్ చేశారు. కానీ అందరి అద్భుతమైన కోఆపరేషన్ వల్ల మేం కేవలం 8 గంటల్లోనే ఆ మొత్తం సీన్‌ను పూర్తి చేశాం. నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే సీన్ అది" అని చరణ్ ఎమోషనల్ అయ్యారు.
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు.. ఓటీటీలోనూ దూకుడు
సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. 'పెద్ది' సినిమా ఇండియాలో రూ. 244.64 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 341.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన ఊరికి చట్టబద్ధమైన గుర్తింపు కోసం ప్రభుత్వంతో పోరాడే ఈ కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతుండగా, తెలుగు టెలివిజన్ ప్రీమియర్ పూర్తయింది. ఇప్పుడు అక్టోబర్ 24న సోనీ మాక్స్ వేదికగా హిందీలో ప్రసారం కానుండటంతో హిందీ బెల్ట్ ఆడియన్స్ కూడా ఈ మాస్ ఎంటర్టైనర్ను వీక్షించడానికి సిద్ధమవుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


