Janhvi Kapoor: టాలీవుడ్ లో డోర్స్ క్లోజ్? కోలీవుడ్ వైపు జాన్వీ కపూర్ చూపు.. వెట్రిమారన్, విజయ్ పేర్లతో కొత్త స్కెచ్!
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు తన చూపును కోలీవుడ్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. 'పెద్ది' మూవీ వివాదం తర్వాత డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా సీనియర్ నటి మహేశ్వరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించింది. డైరెక్టర్ వెట్రిమారన్ అంటే ఇష్టమని చెప్పింది.
Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాపై కామెంట్స్ తో జాన్వీ కపూర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడింది. పెద్ది సినిమాకు సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు తాజాగా తన బంధువు, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

తమిళ సినిమాల జపం
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సడెన్ గా తమిళ సినిమాల జపం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో ఆమె కోలీవుడ్ ఫేవరెట్ డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ.. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తదుపరి ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారా అని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. దీంతో జాన్వీ కపూర్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనుందనే వార్తలకు బలం చేకూరినట్లయింది.
'బ్లాస్ట్' మూవీ చూశా
ఇక తాను రీసెంట్ గా చూసిన తమిళ సినిమా గురించి చెబుతూ.. యాక్షన్ కింగ్ అర్జున్, యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్లాస్ట్' (Blast) మూవీ అని జాన్వీ బదులిచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు చూస్తారని అనుకుంటారు. కానీ జాన్వీ ఇలాంటి ఒక కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న సినిమా పేరు చెప్పడం విశేషం.
అంతేకాకుండా సాయి అభ్యంకర్, ప్రీతి ముకుందన్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్ గురించి కూడా జాన్వీ ప్రత్యేకంగా మాట్లాడింది. దీంతో సోషల్ మీడియాలో 'బ్లాస్ట్' సినిమాకు, హీరోయిన్ ప్రీతి ముకుందన్ కు మళ్లీ సరికొత్త అటెన్షన్ దక్కింది. అలాగే కోలీవుడ్ లో తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన 'పోకిరి' (Pokkiri) అని చెప్పి తమిళ ఫ్యాన్స్ మనసు కూడా దోచుకుంది.
టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్..
జాన్వీ కపూర్ సడెన్ గా తమిళ తంబీలపై ఈ రేంజ్ లో ప్రేమ కురిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా జాన్వీ పాత్రకు పెద్దగా మైలేజ్ రాలేదు. ఇక తాజాగా పెద్ది కాంట్రవర్సీలతో టాలీవుడ్ లో ఆమెకు డోర్స్ క్రమంగా మూసుకుపోతున్నాయనే నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అందుకే పరిస్థితిని ముందే పసిగట్టిన జాన్వీ.. ఇప్పుడు తన టార్గెట్ ను కోలీవుడ్ వైపు మళ్లించిందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా కోలీవుడ్ స్టార్స్, డైరెక్టర్లను పొగుడుతూ అక్కడ అవకాశాలు దక్కించుకునేందుకు జాన్వీ వేసిన స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


