రామ్ చరణ్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ 100 సార్లు చూసిన జపాన్ అభిమాని.. అది కూడా థియేటర్లలో.. చరణ్‌ను కలిసి మురిసిపోతూ..

రామ్ చరణ్ ను కలిసేందుకు జపాన్ నుంచి పలువురు అభిమానులు రావడం విశేషం. అంతేకాదు వాళ్లు చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీని 100సార్లకుపైగా చూసినట్లు కూడా అతనితో చెప్పారు. అది కూడా థియేటర్లలో అని తెలుసుకొని చరణ్ ఆశ్చర్యపోయాడు.

Published on: Dec 9, 2025, 14:45:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను కలవాలనే కోరికతో జపాన్ నుంచి ఒక అభిమానుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని చరణ్ నివాసంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. తన కోసం వారు స్వయంగా తయారు చేసిన బహుమతులను చూసి చరణ్ మురిసిపోయాడు. వారితో చరణ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ 100 సార్లు చూసిన జపాన్ అభిమాని.. అది కూడా థియేటర్లలో.. చరణ్‌ను కలిసి మురిసిపోతూ..
రామ్ చరణ్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ 100 సార్లు చూసిన జపాన్ అభిమాని.. అది కూడా థియేటర్లలో.. చరణ్‌ను కలిసి మురిసిపోతూ..

థియేటర్లో 100 సార్లు.. చరణ్ షాక్

జపాన్ నుంచి తనను కలవడానికి అభిమానులు రావడం చూసి రామ్ చరణ్ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఈ ఆత్మీయ కలయికలో ఒక జపాన్ అభిమాని చరణ్ పట్ల చూపిన ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాళ్ల వెంట వచ్చిన ఓ ట్రాన్స్‌లేటర్ చరణ్‌తో మాట్లాడుతూ.. "ఈమె 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాను 100 సార్ల కంటే ఎక్కువ చూసింది. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఆ సినిమాను ప్రతిరోజూ చూసేవారు" అని చెప్పారు.

దీంతో ఆశ్చర్యపోయిన చరణ్.. "నెట్‌ఫ్లిక్స్‌లోనా?" అని అడగగా.. ఆ అభిమాని "కాదు, సినిమా హాళ్లలోనే" అని బదులిచ్చారు. ఈ మాట వినగానే చరణ్ షాక్ అయ్యాడు. వెంటనే ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. చరణ్ తనను పలకరించడంతో ఆ అభిమాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

హైదరాబాద్‌లో 'కన్మణి టూర్'

రామ్ చరణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ 'మగధీర' షూటింగ్ జరిగిన ప్రదేశాలను, ముఖ్యంగా గోల్కొండ కోటను ఈ జపాన్ బృందం సందర్శించింది. ఈ యాత్రకు వారు 'కన్మణి టూర్' అని పేరు పెట్టుకోవడం విశేషం. చరణ్ కనురెప్పలు అంటే తమకు చాలా ఇష్టమని ఒక అభిమాని చెప్పగా, మరొక అభిమాని గతంలో తానిచ్చిన బొమ్మ ఇంకా చరణ్ దగ్గర భద్రంగా ఉందని తెలిసి 30 నిమిషాల పాటు ఏడ్చానని చెప్పడం వారి అభిమానానికి నిదర్శనం. చరణ్ లేటెస్ట్ మూవీస్ 'గేమ్ చేంజర్', 'పెద్ది' జపాన్‌లో సబ్‌టైటిల్స్‌తో విడుదల కావాలని వారు కోరుకున్నారు.

చరణ్ కెరీర్ అప్‌డేట్స్

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' 2022లో జపాన్‌లో విడుదలయ్యాక ఎన్టీఆర్, చరణ్‌లకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో బాహుబలి నటులకు దక్కిన ఆదరణే ఇప్పుడు వీరికి దక్కుతోంది.

ఈ ఏడాది (2025) ప్రారంభంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ చేంజర్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' అనే మూవీలో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More