Jetlee Release Trailer: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించే సత్య.. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 'మత్తు వదలరా' వంటి విభిన్న చిత్రాలను అందించిన దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన 'జెట్లీ' చిత్రం ప్రమోషన్ల నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. రేపు (శుక్రవారం, మే 1) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న తరుణంలో.. సినిమా యూనిట్ ఒక పక్కా ఎంటర్టైనింగ్ ట్రైలర్‌ను వదిలింది.
ఫ్లైట్ మిషన్.. కన్ మెన్ వేట

జెట్లీ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. 'ప్రజాపతి' (అజయ్) అనే ఒక మోసగాడు సామాన్య ప్రజల సొమ్మును కొల్లగొట్టి దుబాయ్ పారిపోతుంటాడు. అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక సీక్రెట్ ఏజెంట్‌ను మిషన్‌పై పంపిస్తుంది. ఈ మిషన్ అంతా ఒక విమాన ప్రయాణం మధ్యలో ఎలా సాగింది? అందులో సత్య పాత్ర ఏంటి? అనేదే అసలు కథ.
సత్య ఈ సినిమాలో గతాన్ని మర్చిపోయిన వ్యక్తిగా నటిస్తూనే, సీరియస్ యాక్షన్ సీన్లలో కూడా తన మార్క్ కామెడీని పండించారు. విమానం లోపల జరిగే డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ట్రైలర్ చివర్లో సత్య డైలాగ్ అదిరింది. మీరు ఎక్కడ చూస్తారు.. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్, ఐబొమ్మ.. తీసేసారుగా అని అతడు అనడం విశేషం.
రితేష్ రాణా సిగ్నేచర్ స్టైల్
దర్శకుడు రితేష్ రాణా తనదైన 'డార్క్ కామెడీ' శైలిని మరోసారి ఈ సినిమాలో చూపించారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ విమానం లోపల జరిగే సీన్లను చాలా రిచ్‌గా, డార్క్ షేడ్స్‌లో అద్భుతంగా చిత్రీకరించారు. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) యాక్షన్ సన్నివేశాల్లో వేగాన్ని, కామెడీ సీన్లలో ఫన్‌ని బాగా ఎలివేట్ చేసింది.
ఈ సినిమాలో హీరోగా సత్య తన గ్రేస్ ఫుల్ కామెడీతో సినిమాను భుజాన మోసినట్లు కనిపిస్తోంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే అదిరిపోయింది, ట్రైలర్‌లోని ఆయన డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి. కథలో కీలకమైన పాత్రలో రియా సింఘా నటించి ఆకట్టుకుంది. ప్రజాపతిగా తన పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీని జోడించారు సీనియర్ నటుడు అజయ్.
{{/usCountry}}ఈ సినిమాలో హీరోగా సత్య తన గ్రేస్ ఫుల్ కామెడీతో సినిమాను భుజాన మోసినట్లు కనిపిస్తోంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే అదిరిపోయింది, ట్రైలర్‌లోని ఆయన డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి. కథలో కీలకమైన పాత్రలో రియా సింఘా నటించి ఆకట్టుకుంది. ప్రజాపతిగా తన పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీని జోడించారు సీనియర్ నటుడు అజయ్.
{{/usCountry}}మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. రేపటి విడుదలకు ముందు వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'జెట్లీ' సినిమా ఎప్పుడు విడుదల అవుతోంది?
ఈ చిత్రం రేపు, అంటే మే 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
2. జెట్లీ సినిమాకు దర్శకుడు ఎవరు?
'మత్తు వదలరా', 'హ్యాపీ బర్త్ డే' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
3. జెట్లీ సినిమాలో విలన్ పాత్ర ఎవరు పోషించారు?
నటుడు అజయ్ ఈ చిత్రంలో 'ప్రజాపతి' అనే మోసగాడి పాత్రలో విలన్‌గా కనిపించనున్నారు.