Bigg Boss: ఒకేసారి ఆరు భాషల్లో బిగ్ బాస్ రచ్చ.. ఇండియన్ టీవీ హిస్టరీలో ఫస్ట్ టైమ్.. ఎప్పటి నుంచంటే?
Bigg Boss: ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే తొలిసారి బిగ్ బాస్ షో ఒకేసారి ఆరు భాషల్లో ప్రారంభం కాబోతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రాబోతున్న ఈ షోకి సల్మాన్ ఖాన్, నాగార్జున, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్, గంగూలీ హోస్ట్ చేయబోతున్నారు.
Bigg Boss: జియోస్టార్ నెట్‌వర్క్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఆరు భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షోను లాంచ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ సెప్టెంబర్ 2026 నుంచి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ వర్షన్లు ఒకేసారి టెలివిజన్ స్క్రీన్లు, జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ క్రేజీ రియాలిటీ ఫ్రాంచైజీని మునుపెన్నడూ లేనంత గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు.

ఆరు భాషలు, ఆరుగురు సెలబ్రిటీలు
ఈ బిగ్ బాస్ మెగా షోలను నడిపించడానికి ఇండియాలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీలు హోస్ట్‌లుగా రెడీ అయ్యారు. హిందీలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడలో అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్, మలయాళంలో పరిపూర్ణ నటుడు మోహన్‌లాల్ తమ హోస్టింగ్ పవర్‌తో మెప్పించనున్నారు. వీరితో పాటు ఈసారి బెంగాలీ వర్షన్ కోసం ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ దాదా సౌరవ్ గంగూలీ బిగ్ బాస్ ఫ్యామిలీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
డిజిటల్ స్క్రీన్లపై రికార్డుల వేట
గత ఏడాది బిగ్ బాస్ క్రియేట్ చేసిన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 2025 సీజన్లలో ఈ షో ఏకంగా 500 మిలియన్ల వ్యూయర్స్‌ను రీచ్ అయింది. ఆరు భాషల్లో కలిపి మొత్తం 438 బిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. వ్యూయర్స్ ఎంగేజ్‌మెంట్ కూడా ఏటా 47 శాతం మేర పెరుగుతూ వస్తోంది.
JioHotstar ప్లాట్‌ఫామ్‌పై ప్రతి 10 మంది వ్యూయర్స్‌లో ఆరుగురు లైవ్ ఫీడ్‌ను 24x7 ఫాలో అవుతున్నట్లు డేటా చెబుతోంది. ఈ క్రేజ్ వల్ల దాదాపు 46 కేటగిరీలకు చెందిన 625 పైగా బ్రాండ్స్ ఈ షోతో టైఅప్ అయ్యాయి. ఇందులో మొదటిసారి యాడ్స్ ఇస్తున్న కంపెనీలు 49 వరకు ఉన్నాయి. కంటెంట్ మధ్యలో బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం వల్ల బిజినెస్ పరంగా కూడా బిగ్ బాస్ ఒక పెద్ద సక్సెస్ మోడల్‌గా మారింది.
'ఇండియాస్ బిగ్ రియాలిటీ' బుక్ లాంచ్
బిగ్ బాస్ సాధించిన ఈ రెండు దశాబ్దాల సక్సెస్ జర్నీ, ఇండియన్ పాప్ కల్చర్‌పై అది చూపించిన ఇంపాక్ట్‌ను వివరిస్తూ JioStar ఒక స్పెషల్ కాఫీ టేబుల్ బుక్‌ను రిలీజ్ చేసింది. 'ఇండియాస్ బిగ్ రియాలిటీ' పేరుతో వచ్చిన ఈ బుక్‌లో ఆడియన్స్ ఇన్‌సైట్స్, బ్రాండ్ కేస్ స్టడీస్‌ను పొందుపరిచారు.
కేవలం సాధారణ ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్స్ మాత్రమే కాకుండా, షోలోని టాస్క్‌ల ద్వారా బ్రాండ్స్‌ను ఎలా ప్రమోట్ చేశారో ఇందులో క్లియర్ గా చూపించారు. గతంలో వచ్చిన స్నాక్ అండ్ స్నాక్ డ్రోన్ డెలివరీ యాక్టివేషన్, వ్యాసిలిన్ థీమ్ టాస్కులు, బ్రాండెడ్ ఎలివేటర్, స్పై కుట్టన్ రోబోట్ లాంటి ఇన్నోవేటివ్ ఐడియాల గురించి ఈ బుక్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ మైల్‌స్టోన్ గురించి జియోస్టార్ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సేల్స్ హెడ్ మహేష్ శెట్టి మాట్లాడుతూ.. గత ఇరవై ఏళ్లలో బిగ్ బాస్ తన రేంజ్‌ను ప్రతి సీజన్‌కు పెంచుకుంటూ వచ్చిందని చెప్పారు. ఈ పండగ సీజన్ లో ఆరు భాషల ఎడిషన్లు ఒకేసారి రావడం అనేది ఇండియన్ టెలివిజన్ రంగంలోనే అతిపెద్ద సెలబ్రేషన్ అని కామెంట్ చేశారు. ఈ షోని కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా డాక్యుమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాఫీ టేబుల్ బుక్ తెచ్చినట్లు వివరించారు.
జియోస్టార్ డిజిటల్ సేల్స్ హెడ్ భాస్కర్ రమేష్ మాట్లాడుతూ.. పండగ సీజన్ సేల్స్ జరిగే మూడు ముఖ్యమైన నెలల్లో బిగ్ బాస్ ఒక పవర్‌ఫుల్ మ్యాగ్నెట్‌లా పని చేస్తుందని చెప్పారు. 2025లోనే ఆడియన్స్ నుంచి 9.32 బిలియన్ల ఓట్లు, 43 మిలియన్ల లైవ్ చాట్స్ వచ్చాయని, సోషల్ మీడియాలో 1.7 బిలియన్ల ఎంగేజ్‌మెంట్స్ తో పాటు 30 మిలియన్ల మీమ్స్ క్రియేట్ అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే 300 మిలియన్ల వ్యూయర్స్ ఉన్నారని, ఇక్కడి మిగతా రియాలిటీ షోల కంటే బిగ్ బాస్ రీచ్ 3.5 రెట్లు ఎక్కువని డేటా స్పష్టం చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


