...
...
Next Story

Jiohotstar Releases: జియోహాట్‌స్టార్‌లోకి ఆగస్టులో వచ్చే టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్.. మలయాళం థ్రిల్లర్, మైఖేల్ కూడా..

Jiohotstar August Releases: జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి ఆగస్టు నెలలో అదిరిపోయే కంటెంట్ రానుంది. ఇందులో మలయాళ థ్రిల్లర్ ఉయిర్ నుంచి బ్లాక్‌బస్టర్ మైఖేల్ వరకు స్ట్రీమింగ్ కానున్నాయి.

Published on: Jul 31, 2026, 18:17:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jiohotstar August Releases: ఆగస్టు నెలలో ఓటీటీ ప్రియులకు డిజిటల్ విందు అందించేందుకు జియోహాట్‌స్టార్ (JioHotstar) సిద్ధమైపోయింది. అక్షయ్ కుమార్ బిగ్ బడ్జెట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' నుంచి ఇంటెన్స్ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్', పాప్ కింగ్ 'మైఖేల్' బయోపిక్ వరకు ఏకంగా 10 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఒక్క నెలలోనే సందడి చేయబోతున్నాయి.

Jiohotstar Releases: జియోహాట్‌స్టార్‌లోకి ఆగస్టులో వచ్చే టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్.. మలయాళం థ్రిల్లర్, మైఖేల్ కూడా..
Jiohotstar Releases: జియోహాట్‌స్టార్‌లోకి ఆగస్టులో వచ్చే టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్.. మలయాళం థ్రిల్లర్, మైఖేల్ కూడా..

యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, డ్రామా, రియాలిటీ షోస్ వంటి విభిన్నమైన జానర్లలో రాబోతున్న ఆ 10 అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఏంటో, వాటి రిలీజ్ డేట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. ఖత్రోంకే ఖిలాడీ 15 – ఆగస్టు 1

రియాలిటీ షో లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాపులర్ స్టంట్ షో 'ఖత్రోంకే ఖిలాడీ 15' కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత సరికొత్త డేరింగ్ స్టంట్స్‌తో ఈ షో మళ్లీ ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తోంది.

2. భోజ్‌పురి బవాల్ – ఆగస్టు 2

భోజ్‌పురి ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్స్, పొలిటికల్ లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రధాన ఆకర్షణగా ఈ రియాలిటీ షో తెరకెక్కింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, గ్లామర్ వెనుక ఉన్న ఆసక్తికర కోణాలను ఈ షోలో చూపించనున్నారు. హాట్‌స్టార్‌లో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఇది అందుబాటులోకి వస్తుంది.

జియోహాట్‌స్టార్ ఆగస్ట్ 2026 రిలీజెస్

* భోజ్‌పురి బవాల్ (రియాల్టీ షో) : ఆగస్ట్ 2

* ఉయిర్ (మలయాళం క్రైమ్ థ్రిల్లర్) : ఆగస్ట్ 4

* యే ఫితూర్ తేరా (సీరియల్) : ఆగస్ట్ 5

* ది షార్డ్స్ (హాలీవుడ్ థ్రిల్లర్) : ఆగస్ట్ 6

* ది సూపర్ మారియో గెలాక్సీ (కిడ్స్) : ఆగస్ట్ 7

* హజిల్ సీజన్ 5 (ర్యాప్ షో) : ఆగస్ట్ 8

* వెల్‌కమ్ టు ది జంగిల్ (కామెడీ మూవీ) : ఆగస్ట్ 21

* జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (కిడ్స్) : ఆగస్ట్ 28

* మైఖేల్ (హాలీవుడ్ బయోపిక్) : ఆగస్ట్ 29

3. ఉయిర్ (Uyir) – ఆగస్టు 4

కేరళలోని కన్నూర్ ధర్మడం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్'. ఒక ఎండిపోయిన బావిలో దొరికిన మహిళ మృతదేహం కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊహించని ట్విస్టులతో సాగే ఈ డార్క్ థ్రిల్లర్ తెలుగు, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

4. యే ఫితూర్ తేరా (Yeh Fitoor Tera) – ఆగస్టు 5

స్టార్ ప్లస్ నెట్‌వర్క్ అందిస్తున్న సరికొత్త రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ 'యే ఫితూర్ తేరా'. జీత్, సౌమ్య అనే ఇద్దరి మధ్య సాగే అందమైన ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ డైలీ సీరియల్ ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ కానుంది.

5. ది షార్డ్స్ (The Shards) – ఆగస్టు 6

హాలీవుడ్ థ్రిల్లర్ లవర్స్ కోసం వస్తున్న అమెరికన్ హారర్ సస్పెన్స్ సిరీస్ 'ది షార్డ్స్'. ఒక నగరంలో సీరియల్ కిల్లర్ ఎంట్రీ ఇవ్వడంతో హైస్కూల్ విద్యార్థుల జీవితాలు ఎలా ప్రమాదంలో పడ్డాయి, ఆ కిల్లర్ నుంచి వారు ఎలా ప్రాణాలు దక్కించుకున్నారనేది ఈ సిరీస్ సారాంశం.

6. ది సూపర్ మారియో గెలాక్సీ (The Super Mario Galaxy) – ఆగస్టు 7

చిన్నారులను అలరించేందుకు వస్తున్న యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ 'ది సూపర్ మారియో గెలాక్సీ'. వీడియో గేమ్ ఆఫ్‌లైన్ వరల్డ్‌లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. మారియో, లూయీజీ కలిసి మష్రూమ్ కింగ్‌డమ్‌ను ఎలా కాపాడారనే కథతో కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ మూవీ వస్తోంది.

7. హస్సల్ సీజన్ 5 (Hustle Season 5) – ఆగస్టు 8

ఇండియాలోనే బిగ్గెస్ట్ ర్యాప్ సంగీత పోటీ 'హస్సల్' ఐదో సీజన్‌తో ముందుకు వస్తోంది. సమర్థ్ జురెల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ మ్యూజికల్ రియాలిటీ షోకి పాపులర్ రాపర్ బాద్‌షా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. శని, ఆదివారాల్లో సాయంత్రం 7 గంటలకు కొత్త రాపర్స్ తమ టాలెంట్‌తో రచ్చ చేయనున్నారు.

8. వెల్‌కమ్ టు ది జంగిల్ (Welcome To The Jungle) – ఆగస్టు 21

థియేటర్లలో నవ్వుల పూవులు పూయించిన అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్‌కమ్ టు ది జంగిల్' ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సునీల్ శెట్టి, అర్షద్ వర్సీ, జాకీ ష్రాఫ్, ఫరీదా జలాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ ఫన్ రైడ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బెస్ట్ ఛాయిస్ కానుంది.

9. జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ – ఆగస్టు 28

చిన్నతనం నుంచి అందరూ ఇష్టపడే మోగ్లీ అడ్వెంచర్స్ మళ్లీ సరికొత్త యానిమేటెడ్ ఫార్మాట్‌లో 'జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ' పేరుతో ఆగస్టు 28న రిలీజ్ కానుంది.

10. మైఖేల్ (Michael) – ఆగస్టు 29

ఇక ఆగస్టు 29న ప్రపంచ పాప్ సంగీత సంచలనం మైఖేల్ జాక్సన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ బయోపిక్ 'మైఖేల్' ఓటీటీలో గ్రాండ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.9500 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా ఇది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe