Dridam Movie Review: దృఢం మూవీ రివ్యూ.. ఓటీటీలో మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. షాకింగ్ క్లైమ్యాక్స్ కానీ..
Dridam Movie Review: మలయాళ యంగ్ వెర్సటైల్ యాక్టర్ షేన్ నిగమ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' (Dridam). లెజెండరీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రెజెంటర్‌గా వ్యవహరించిన ఈ సినిమాకు ఎలా ఉందో చూడండి.
Dridam Movie Review: మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ పేరు ఒక ప్రాజెక్ట్ పై ఉందంటే ఆడియన్స్ లో అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఆయన సమర్పణలో, డెబ్యూ డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'దృఢం' (Dridam). షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మే 8న థియేటర్లలో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఈ శుక్రవారం (జూన్ 12) జియోహాట్‌స్టార్ లోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఆ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం.

Dridam Movie Plot | ప్రశాంతమైన ఊరిలో భయంకరమైన నేరాలు
చాలా మలయాళం సినిమాలలాగే.. ఈ దృఢం కూడా అదిరిపోయే కేరళ అందాలను చూపిస్తూ మొదలవుతుంది. విజయ్ (షేన్ నిగమ్) అనే ఒక కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)కి కేరళలోని 'కుళినిలం' అనే ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ వస్తుంది. ఆ ఊరిలో పెద్దగా ఎలాంటి క్రైమ్స్ జరగవు.
ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవచ్చు అని విజయ్ భావిస్తాడు. పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది కూడా అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ విజయ్ చార్జ్ తీసుకున్న కొద్దిరోజులకే ఆ ఊరిలో ఒక కుళ్లిన శవం దొరుకుతుంది. ఆ వెంటనే ఒక లోకల్ ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడీ జరుగుతుంది.
ఈ దొంగతనం కేసు విచారణ సాగుతుండగానే, మరో గుర్తుతెలియని శవం బయటపడుతుంది. అసలు ఈ క్రైమ్స్ అన్నింటికీ ఏమైనా లింక్ ఉందా? సీనియర్ ఆఫీసర్స్ నుంచి ప్రెజర్ పెరుగుతున్న టైమ్ లో ఈ యంగ్ పోలీస్ ఆఫీసర్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్.
షేన్ నిగమ్ నటన.. క్లైమాక్స్ ట్విస్ట్
ఈ దృఢం సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన షేన్ నిగమ్ ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా బాగా సెట్ అయ్యాడు. ఒక కొత్త ఎస్ఐ పడే కంగారును, అమాయకత్వాన్ని తన బాడీ లాంగ్వేజ్ తో బాగా పండించాడు.
క్రైమ్స్ జరుగుతున్నప్పుడు అతను క్రమంగా మెచ్యూర్డ్ ఆఫీసర్ గా మారే జర్నీ బాగుంది. సీనియర్ నటుడు శోభి తిలకన్ తన అనుభవంతో సినిమాకు బలాన్నిచ్చారు. దినేష్ ప్రభాకర్, సాసియా ఫాతిమా మిగిలిన పోలీస్ క్యారెక్టర్లలో కనిపించారు.
సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని ప్రధాన కథాంశం, చివరి 20 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్. మలయాళం థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే ఆశ్చర్యకరమైన క్లైమ్యాక్స్ ఈ దృఢంలోనూ చూడొచ్చు. ఇదే సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
నత్తనడకన సాగే కథనం..
అయితే సినిమాలో మంచి లీడ్ పాయింట్ ఉన్నా.. దాన్ని నడిపించిన విధానంలోనే లోపాలు ఉన్నాయి. మూవీ చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో ఉండాల్సిన స్పీడ్ ఈ సినిమాలో కనిపించదు. అంతగా అవసరం లేని లవ్ ట్రాక్ కూడా మైనస్ అని చెప్పాలి. వరుస హత్యలు, ఫైనాన్స్ కంపెనీ దోపిడీ.. వాటి మధ్య ఉండే లింక్ ఏంటన్నది క్లైమ్యాక్స్ వరకూ ఉత్కంఠ రేపినా.. నెమ్మదిగా సాగే కథనం దానిని నీరుగారుస్తుంది.
హెచ్‌టీ విశ్లేషణ
'దృఢం' ఒక మంచి ఐడియాతో మొదలైనా దానిని స్క్రీన్ పై సరిగా ప్రెజెంట్ చేయడంలో తడబాటు వల్ల దెబ్బతిన్న సినిమా అని చెప్పొచ్చు. జీతూ జోసెఫ్ సినిమాల్లో ఉండే ఆ గ్రిప్పింగ్ నెరేషన్ ఇందులో మిస్ అయింది. డైరెక్టర్ కేవలం క్లైమాక్స్ ట్విస్ట్ నమ్ముకుని మిగతా సినిమాను చాలా ఫ్లాట్ గా నడిపించారు.
షేన్ నిగమ్ పెర్ఫార్మెన్స్, ఆ షాకింగ్ ఎండింగ్ కోసం ఈ సినిమాను ఒకసారి ఓటీటీలో ట్రై చేయొచ్చు. కానీ 'దృశ్యం' లేదా 'కిష్కింధ కాండం' రేంజ్ థ్రిల్స్ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
People Also Ask (FAQs)
'దృఢం' (Dridam) సినిమాలో హీరో ఎవరు? దీనికి ప్రెజెంటర్ ఎవరు?
ఈ సినిమాలో షేన్ నిగమ్ లీడ్ రోల్ ప్లే చేయగా, లెజెండరీ మేకర్ జీతూ జోసెఫ్ ప్రెజెంటర్‌గా వ్యవహరించారు.
దృఢం సినిమా ప్రధాన కథాంశం ఏంటి?
ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్ లో కొత్తగా చార్జ్ తీసుకున్న యంగ్ పోలీస్ ఆఫీసర్ విజయ్, అక్కడ హఠాత్తుగా జరిగిన ఒక మర్డర్, బ్యాంక్ రాబరీ కేసులను ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.
దృఢం సినిమాకు వచ్చిన టాక్ ఏంటి?
ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ, ఫస్టాఫ్, స్క్రీన్‌ప్లే చాలా స్లోగా, ఓవర్ ఎక్స్‌పొజిషన్ తో సాగడం మైనస్ అయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


