OTT Release Movies: ఓటీటీలోకి ఈవారం తెలుగు, మలయాళం, తమిళంలలో వస్తున్న మస్ట్ వాచ్ టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే
OTT Release Movies: జూన్ 12 నుంచి ఓటీటీ ప్రియులకు సరికొత్త వినోదం అందుబాటులోకి రానుంది. సూర్య ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు'తో పాటు అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, ఆహా లాంటి ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న టాప్ 5 చిత్రాల పూర్తి డీటెయిల్స్ మీకోసం.
OTT Release Movies: వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఎప్పటిలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను జల్లెడ పట్టడం సహజం. థియేటర్ల హడావుడి పక్కన పెడితే, ఇంట్లోనే హాయిగా కూర్చుని విభిన్నమైన కంటెంట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ల కోసం ఈ వారం సరికొత్త సినిమాలు క్యూ కట్టాయి. జూన్ 12 నుంచి సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు క్రేజీ సినిమాలు డిజిటల్ స్క్రీన్‌లపై హంగామా చేయడానికి రెడీ అయ్యాయి.

తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులు అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, ఆహా వీడియో లాంటి పాపులర్ ఓటీటీలలో డైరెక్ట్ గా ల్యాండ్ అవుతున్నాయి. ఈ వీకెండ్ లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మన ముందుకు రాబోతున్న ఆ టాప్ 5 క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో ఓసారి చూద్దాం.
Suriya Karuppu Prime Video | లాయర్ అవతారంలో దేవుడు.. సూర్య 'కరుప్పు'
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (Karuppu). ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (కాలేయ మార్పిడి) కోసం కేరళ నుంచి చెన్నై వచ్చిన ఒక తండ్రీకూతుళ్లు దారుణంగా మోసపోతారు. న్యాయం కోసం వాళ్లు చెన్నైలోని సెవెన్ వెల్స్ కోర్టును ఆశ్రయిస్తే.. అక్కడ కరప్ట్ జడ్జి, స్వార్థపరుడైన లాయర్ చేతిలో మరింత దారుణంగా నలిగిపోతారు.
అన్ని దారులు మూసుకుపోయిన టైమ్ లో, ఆ తండ్రి ఏడుస్తూ వేట కరుప్పు స్వామి దేవాలయంలో కన్నీరు పెట్టుకుంటాడు. భక్తుడి పిలుపు అందుకున్న సాక్షాత్తూ ఆ కరుప్పు దేవుడు (సూర్య).. మనిషి రూపంలో ఒక పవర్ ఫుల్ లాయర్‌గా కోర్టులోకి అడుగుపెడతాడు. విలన్ బేబీ కన్నన్ విసిరిన సవాల్‌ను స్వీకరించి, ఎలాంటి దైవిక శక్తులు వాడకుండా కేవలం బుద్ధి బలంతో కోర్టులో ఎలా ఫైట్ చేశాడు, చివరికి దుర్మార్గులను ఎలా అంతమొందించాడు అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. వీరభద్రుడు పేరుతో తెలుగులోనూ వచ్చిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతోంది.
Dridam JioHotstar | ఇడుక్కి మిస్టరీ.. షేన్ నిగమ్ 'దృఢం'
మలయాళం టాలెంటెడ్ యువ హీరో షేన్ నిగమ్ మెయిన్ లీడ్ లో డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'దృఢం' (Dridam) జూన్ 12 నుంచి జియోహాట్‌స్టార్‌లో అలరించనుంది. ఈ సినిమా కూడా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. కేరళలోని చాలా ప్రశాంతంగా ఉండే ఇడుక్కి గ్రామానికి బదిలీ అయిన కొత్త సబ్-ఇన్‌స్పెక్టర్ విజయ్ రాధాకృష్ణన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
చాలా ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న అతని డ్యూటీ.. ఒక మృతదేహం బయటపడటంతో ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. ఆ ఊళ్లో జరిగే వరుస హత్యలు, దోపిడీల మిస్టరీని ఆ యువ ఆఫీసర్ ఎలా చేధించాడనేది చాలా ఉత్కంఠ భరితంగా చూపించారు. దినేష్ ప్రభాకర్, కృష్ణ ప్రభ, సానియా ఫాతిమా ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Sshhh Season 3 Aha | ఎమోషనల్ అంథాలజీ 'ష్.. 3'
తమిళంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బోల్డ్ అండ్ ఎమోషనల్ అంథాలజీ సిరీస్ 'ష్' (Sshhh) ఇప్పుడు థర్డ్ సీజన్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మానవ సంబంధాలు, మనసులోని ఫీలింగ్స్, వ్యక్తుల పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ చుట్టూ అల్లుకున్న విభిన్న కథలతో ఈ సిరీస్ రూపొందింది.
పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, తమిజ్వాని లాంటి గ్లామరస్ తారాగణంతో తెరకెక్కిన ఈ సిరీస్ జూన్ 12 నుంచి పాపులర్ రీజనల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha Video) లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఢిల్లీ బ్యాక్‌డ్రాప్ క్రైమ్ డ్రామా 'రాఖ్'
హిందీ నుంచి వస్తున్న పీరియడ్ క్రైమ్ డ్రామా 'రాఖ్' (Raakh) వెబ్ సిరీస్ కూడా జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తోంది. ప్రోసిత్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ 1970ల నాటి ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.
ఒక మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసే సబ్-ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్‌కు ఎదురైన షాకింగ్ నిజాలు, సమాజంలోని చీకటి కోణాల చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. అలీ ఫజల్, సోనాలి బేంద్రే, అమీర్ బషీర్ కీ రోల్స్ ప్లే చేశారు.
Ramani Kalyanam ETV Win | మనసులను జోడించే 'రమణి కల్యాణం'
గతంలోని చేదు జ్ఞాపకాలు, గాయాల వల్ల ఒంటరిగా బతుకుతున్న ఇద్దరు వ్యక్తుల లైఫ్స్ అనుకోకుండా ఒకరితో ఒకరికి ఎలా ముడిపడ్డాయనే కాన్సెప్ట్‌తో వస్తున్న క్యూట్ ఫీల్ గుడ్ డ్రామా 'రమణి కల్యాణం' (Ramani Kalyanam).
దీప్షికా చంద్రన్, సూర్య వసిష్ఠ మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ ప్రేమకథ జూన్ 12 నుంచి ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. మనసుకు హత్తుకునే డైలాగ్స్ తో ఈ సినిమా సాగనుంది.
People Also Ask (FAQs)
సూర్య నటించిన 'కరుప్పు' సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతోంది?
ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య, త్రిష మెయిన్ లీడ్స్ లో నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
టాలెంటెడ్ యాక్టర్ షేన్ నిగమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'దృఢం' జూన్ 12 నుంచి జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తుంది.
'ష్ సీజన్ 3' అంథాలజీ సిరీస్ ఏ ప్లాట్‌ఫామ్‌లో రాబోతోంది?
పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్ లాంటి తారాగణంతో తెరకెక్కిన ఎమోషనల్ అంథాలజీ సిరీస్ 'ష్ 3' జూన్ 12 నుంచి ఆహా (Aha Video) లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


