Jiohotstar Thriller: మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో ఉన్న డిమాండ్ తెలుసు కదా? అలాంటిదే ఓ సినిమా గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా మైంబ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగుతుంది. ఒక హత్య అనుకునేలోపే చివరికి అది రెండు హత్యల మిస్టరీగా ఎలా మారిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉయిర్

జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' (Uyir) సినిమా చూసేవారికి మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి నిమిషం టెన్షన్ పుట్టిస్తూ సస్పెన్స్‌తో కట్టిపడేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ వీకెండ్‌లో ఇది పర్ఫెక్ట్ వాచ్.
నిజ జీవిత ఘటనల ఆధారంగా పవర్‌ఫుల్ స్టోరీ
పోలీస్ ఆఫీసర్ అన్షాద్ ఎస్. రియల్ లైఫ్ అనుభవాల నుంచి ఈ కథను తీసుకున్నారు. ట్రైన్ జర్నీలో ఓ ఫ్యామిలీకి ఎదురైన అనుకోని సంఘటనతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ప్రయాణం మధ్యలో చిన్న పాప అదృశ్యం కావడంతో కథ మరో లెవెల్‌కి మారుతుంది. అసలు ఆ పాప ఎవరు? ఏంటి అన్నది మూవీ చివరికిగానీ మనకు క్లారిటీ రాదు.
సూసైడ్ లేదా మర్డర్? ఊహించని ట్విస్టులు
కొంత కాలం తర్వాత ఒక పాడుబడిన బావిలో ఓ మహిళ కుళ్ళిన శవం దొరుకుతుంది. ముందుగా చూసేవారికిదో సూసైడ్ కేసులా అనిపిస్తుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ అది కచ్చితంగా ప్లాన్ చేసిన మర్డర్ అని తేలుతుంది. అసలు ఆ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది ఈ మూవీలో చూడొచ్చు.
నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్
ఈ చిత్రంలో సయామి ఖేర్, రోషన్ మాథ్యూ, దివ్య ఎం. నాయర్, వినీత్ తట్టిల్ డేవిడ్ తమ నటనతో అదరగొట్టేశారు. ప్రతి క్యారెక్టర్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. దర్శకుడు ఎం. పద్మకుమార్ టేకింగ్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది.
క్లైమాక్స్ వరకు అంతుచిక్కని సస్పెన్స్
{{/usCountry}}ఈ చిత్రంలో సయామి ఖేర్, రోషన్ మాథ్యూ, దివ్య ఎం. నాయర్, వినీత్ తట్టిల్ డేవిడ్ తమ నటనతో అదరగొట్టేశారు. ప్రతి క్యారెక్టర్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. దర్శకుడు ఎం. పద్మకుమార్ టేకింగ్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది.
క్లైమాక్స్ వరకు అంతుచిక్కని సస్పెన్స్
{{/usCountry}}ఈ ఉయిర్ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. కేసు పరిష్కారం అయిపోయిందని ఆడియన్స్ అనుకునే లోపే డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ చూశాకే మూవీలోని అసలు థ్రిల్ ఏంటో అర్థమవుతుంది. ఒక ఆత్మహత్య కేసులో మొదలై హత్య కేసుగా మారి.. అది కాస్తా రెండు హత్యలు ఎలా అయ్యాయన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించారు.
ఉయిర్ మూవీ విశేషాలు
మూవీ పేరు : ఉయిర్
జానర్ : క్రైమ్ థ్రిల్లర్ / సస్పెన్స్ డ్రామా
దర్శకత్వం : ఎం. పద్మకుమార్
ప్రధాన నటులు : సయామి ఖేర్, రోషన్ మాథ్యూ, దివ్య ఎం. నాయర్
ఓటీటీ వేదిక : జియోహాట్‌స్టార్ (మలయాళం, తెలుగు, హిందీ,కన్నడ, తమిళం)
ఐఎండీబీ రేటింగ్ : 6.5 / 10