OTT Review: దొంగ బాబాల అరాచకాలు, న్యాయ వ్యవస్థలోని లొసుగులను కళ్లకు కడుతూ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ లీగల్ డ్రామా 'హుంకార్' ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. 'సయ్యారా' మూవీ ఫేమ్ అనీత్ పడ్డా తన అద్భుతమైన నటనతో స్టార్ హోదాను పక్కన పెట్టి రియల్ యాక్టర్‌గా నిలబడగా, ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న దిగ్గజ నటుడు రఘుబీర్ యాదవ్ గూస్‌బంప్స్ తెప్పించే విలనిజంతో దుమ్మురేపారు.

ఈ వెబ్ సిరీస్ కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, దేశ న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే ఒక పవర్ ఫుల్ సోషల్ డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.
హుంకార్ సిరీస్ అసలు కథేంటి?
మధ్యప్రదేశ్‌లోని ఓర్చా పట్టణంలో ఉన్న ఒక ఆశ్రమంలో 17 ఏళ్ల విద్యార్థిని మీనూ రావత్ (అనీత్ పడ్డా) చదువుకుంటూ ఉంటుంది. సొంత తల్లిదండ్రులే భక్తులుగా పూజించే స్వయంప్రకటిత దేవుడు, ఆశ్రమ అధిపతి సునీల్ చకోసి అలియాస్ బాప్‌జీ (రఘుబీర్ యాదవ్) తనను రేప్ చేశాడని మీనూ బహిరంగంగా ఆరోపిస్తుంది. ఈ సంచలన ఆరోపణ దేశవ్యాప్తంగా పెద్ద తుఫాను రేపుతుంది.
ఈ సున్నితమైన కేసును దర్యాప్తు చేసే బాధ్యత యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ జస్లీన్ (ఫాతిమా సనా షేక్) చేతికి వస్తుంది. దేవుడిగా పూజలందుకునే ఒక శక్తివంతమైన బాబా నిజస్వరూపం బయటపెట్టడం అంత సులువు కాదని జస్లీన్ గ్రహిస్తుంది.
ఆశ్రమ గుండాలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకుంటూ, ఒక సామాన్య న్యాయవాది (మహమ్మద్ జీషాన్ అయూబ్) సహాయంతో ఆమె నిజం కోసం ఎలా పోరాడింది అనేది ఈ వెబ్ సిరీస్ సారాంశం.
బాధితురాలి నరకం కళ్లకు కట్టేలా..
కోర్టులో తనపై జరిగిన దారుణాన్ని మీనూ ఏకంగా 11 సార్లు రిపీట్‌గా చెప్పాల్సి రావడం ఈ వెబ్ సిరీస్‌లో అత్యంత కీలకమైన ఘట్టం. దర్శకులు కరణ్ డి కపాడియా, నిత్య మెహ్రా ఈ సీన్లను చాలా సెన్సిటివ్‌గా, బోల్డ్‌గా తెరకెక్కించారు. ఏమాత్రం హింస లేదా అసభ్యకర దృశ్యాలు చూపించకుండానే బాధితురాలు ఎదుర్కొనే మానసిక నరకాన్ని వీక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు.
{{/usCountry}}కోర్టులో తనపై జరిగిన దారుణాన్ని మీనూ ఏకంగా 11 సార్లు రిపీట్‌గా చెప్పాల్సి రావడం ఈ వెబ్ సిరీస్‌లో అత్యంత కీలకమైన ఘట్టం. దర్శకులు కరణ్ డి కపాడియా, నిత్య మెహ్రా ఈ సీన్లను చాలా సెన్సిటివ్‌గా, బోల్డ్‌గా తెరకెక్కించారు. ఏమాత్రం హింస లేదా అసభ్యకర దృశ్యాలు చూపించకుండానే బాధితురాలు ఎదుర్కొనే మానసిక నరకాన్ని వీక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు.
{{/usCountry}}మన దేశంలోని న్యాయ వ్యవస్థలో కేసు విచారణే బాధితురాలికి ఒక పెద్ద శిక్షగా ఎలా మారుతుందో ఈ సీన్ల ద్వారా ఎంతో నిజాయితీగా చూపించారు. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, పవర్ పాలిటిక్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఈ షో కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది.
అనీత్ పడ్డా మరో లెవెల్
రఘుబీర్ యాదవ్ యాక్టింగ్ ఈ వెబ్ సిరీస్‌కు అసలైన గుండెకాయ లాంటిది. పంచాయత్ లాంటి వెబ్ సిరీస్ లో ఊరి పెద్దగా కామెడీ పండించిన ఆయన.. ఈ సిరీస్ లో తనదైన విలనిజంతో ఆశ్చర్యపరిచారు. పెద్దగా అరిచి కేకలు వేయకుండా, ప్రశాంతమైన ముఖంతోనే సైకోలాంటి బాబా పాత్రలో ఆయన జీవించారు. మనుషులను ఎలా లొంగదీసుకోవాలో చూపే క్రూరమైన విలన్‌గా ఆయన నటన నెక్స్ట్ లెవల్‌లో ఉంది.
ఆయనకు ఏమాత్రం తగ్గకుండా సయ్యారా మూవీ ఫేమ్ అనీత్ పడ్డా తన కళ్లతోనే బాధను, ఆక్రోశాన్ని అద్భుతంగా పండించింది. ఆ మూవీలో గ్లామరస్ రోల్, లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ఆమె.. ఇందులో పూర్తిగా భిన్నమైన ఓ రేప్ బాధితురాలి పాత్రలో అదరగొట్టింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో అనీత్ ఇచ్చే సుదీర్ఘమైన మోనోలాగ్ ఈ ఏడాదే బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలిచిపోతుంది.
ఇక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఫాతిమా సనా షేక్, న్యాయవాదిగా జీషాన్ అయూబ్ తమ నటనతో షోను నిలబెట్టారు. మీనూ తల్లిదండ్రులుగా నటించిన రాజేష్ శర్మ, చారు శంకర్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఓటీటీ ఫార్ములాను తిరగరాసిన ‘హుంకార్’
ఈ రోజుల్లో ఓటీటీ వేదికల్లో వచ్చే దాదాపు ప్రతి వెబ్ సిరీస్ ఒకే రకమైన ఫార్ములా, రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ టెంప్లేట్‌తో వస్తున్నాయి. కానీ 'హుంకార్' అలాంటి రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ వచ్చిన ఒక అరుదైన మాస్టర్‌పీస్.
సమాజంలోని నగ్న సత్యాన్ని నిర్భయంగా ఎండగట్టిన ఈ లీగల్ థ్రిల్లర్‌ను చూడటం ఒక సరికొత్త డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ మైండ్ బెండింగ్ సోషల్ డ్రామాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన మస్ట్ వాచ్ షో.