...
...
Next Story

Jiohotstar Top 10: తెలుగు, మలయాళం థ్రిల్లర్ మూవీస్ హవా.. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈరోజు టాప్ 10 ట్రెండింగ్ ఇవే

Jiohotstar Top 10: జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇక్కడ చూడొచ్చు. ఇందులో యాక్షన్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్లతో పాటు బుల్లితెర రియాలిటీ షోలు కూడా విపరీతమైన వ్యూయర్ షిప్ తో సందడి చేస్తున్నాయి.

Published on: Jun 17, 2026, 19:55:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jiohotstar Top 10: ఓటీటీ ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు డిజిటల్ స్క్రీన్స్ పై సరికొత్త కంటెంట్ సిద్ధమైంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. సౌత్ సినిమాల నుంచి బుల్లితెర క్రేజీ షోల వరకు ప్రేక్షకులు వీటిని ఎగబడి చూస్తున్నారు.

Jiohotstar Top 10: తెలుగు, మలయాళం థ్రిల్లర్ మూవీస్ హవా.. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈరోజు టాప్ 10 ట్రెండింగ్ ఇవే (IMDb)
Jiohotstar Top 10: తెలుగు, మలయాళం థ్రిల్లర్ మూవీస్ హవా.. జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈరోజు టాప్ 10 ట్రెండింగ్ ఇవే (IMDb)

ఈ రోజు అంటే బుధవారం (జూన్ 17) జియోహాట్‌స్టార్‌లో విపరీతమైన వ్యూవర్‌షిప్‌తో ట్రెండ్ అవుతున్న ఆ టాప్ 10 సినిమాలు, సిరీస్‌ల పూర్తి జాబితాను మీకోసం అందిస్తున్నాం. వీకెండ్ ప్లాన్స్ లేకపోతే వీటిని వెంటనే మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చేసుకోండి.

1. లాఫ్టర్ షెఫ్స్ (Laughter Chefs)

జోనర్: కామెడీ రియాలిటీ షో

బుల్లితెరపై పాపులర్ అయిన సెలబ్రిటీలు వంటలు చేస్తూ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే అద్భుతమైన షో ఇది. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా, ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ షోకి ఈ వారాంతంలో 'ధమాల్ 4' చిత్ర బృందం అతిథులుగా రానుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

2. ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2)

జోనర్: స్పై థ్రిల్లర్ యాక్షన్

ఈ ట్రెండింగ్ జాబితాలో రెండో స్థానంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' నిలిచింది. ఈ ఏడాదే థియేటర్లలో విడుదలైన ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ఎన్నో రికార్డులను తిరగరాసింది. స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ విజువల్ వండర్ కు దర్శకత్వం వహించారు.

3. దృఢం (Dridam)

నేరాలే జరగని ఒక ప్రశాంతమైన గ్రామానికి బదిలీపై వస్తాడు ఒక పోలీస్ అధికారి. అయితే ఆ ఇన్‌స్పెక్టర్ అడుగుపెట్టిన వెంటనే అక్కడ ఒక శవం లభ్యమవుతుంది. ఆ వెంటనే బ్యాంకు దోపిడీ కూడా జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఆ పోలీస్ అధికారికి ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయనేది ఉత్కంఠ రేపుతుంది.

4. 24 సీజన్ 2 (24 Season 2)

జోనర్: యాక్షన్ అడ్వెంచర్ డ్రామా

ముంభై నగరంలో ఒక ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేయాలని చూసే ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాను కేవలం 24 గంటల్లో అడ్డుకోవాల్సిన బాధ్యత జై సింగ్ రాథోడ్ (అనిల్ కపూర్) పై పడుతుంది. ఈ ఉత్కంఠభరితమైన మిషన్‌లో జై సింగ్ ఎలా విజయం సాధించాడనేది సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇస్తుంది.

5. ధురంధర్ (Dhurandhar - Part 1)

జోనర్: స్పై థ్రిల్లర్

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో గత ఏడాది విడుదలైన సూపర్ హిట్ చిత్రం 'ధురంధర్'. 'ధురంధర్: ది రివెంజ్' చిత్రానికి ఇది మొదటి భాగం కావడంతో, పార్ట్ 2 చూసే ముందు డిజిటల్ ఆడియన్స్ ఈ మొదటి భాగాన్ని ఓటీటీలో తెగ చూస్తున్నారు.

6. కెనాథా కాణోమ్ (Kenatha Kanom)

జోనర్: కామెడీ డ్రామా

ఇది తమిళ మూవీ అయినప్పటికీ జియోహాట్‌స్టార్‌లో తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి ఊరంతా ఒక్కటవుతుంది. ఆ తర్వాత జరిగే వినోదాత్మక, ఆసక్తికర పరిణామాలు అవుట్ అండ్ అవుట్ నవ్వులు పూయిస్తాయి.

7. రివాల్వర్ రీటా (Revolver Rita)

జోనర్: డార్క్ కామెడీ

పాండిచ్చేరిలో ప్రశాంతంగా సాగిపోయే రీటా జీవితంలో ఒక గ్యాంగ్ వార్ వల్ల ఒక్కసారిగా అలజడి రేగుతుంది. ప్రమాదంలో పడిన తన మధ్యతరగతి కుటుంబాన్ని రక్షించుకోవడానికి రీటా ఎలాంటి ధైర్యం ప్రదర్శించిందనేది ఈ డార్క్ కామెడీ చిత్రంలో చూడవచ్చు. మహనటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది.

8. జాలీ ఎల్‌ఎల్‌బీ 3 (Jolly LLB 3)

జోనర్: కామెడీ కోర్ట్‌రూమ్ డ్రామా

అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రల్లో నటించిన 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఒక వృద్ధురాలికి న్యాయం చేయడం కోసం ఇద్దరు జాలీలు (అక్షయ్, అర్షద్) కలిసి చేసే కోర్టు పోరాటం ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.

9. ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (Inspector Avinash 2)

జోనర్: క్రైమ్ థ్రిల్లర్

ఈ పాపులర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఈ ఏడాదే హాట్‌స్టార్‌లో విడుదలై దూసుకుపోతోంది. ఉత్తరప్రదేశ్‌లో నేరాలను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవినాష్ మిశ్రా.. తానే ఎలా నిందితుడిగా మారాల్సి వచ్చింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సీజన్ సాగుతుంది. రణ్‌దీప్ హుడా ఇందులో ఇన్‌స్పెక్టర్ అవినాష్‌గా పవర్‌ఫుల్ నటనను కనబరిచారు.

10. అగ్లీ స్టోరీ (Ugly Story)

జోనర్: సోషల్ క్రైమ్ ఫిల్మ్

తన భార్యపై విపరీతమైన వ్యామోహం పెంచుకున్న ఒక భర్త కథ ఇది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవడానికి అతను ఏ స్థాయికైనా తెగిస్తాడు. ఈ సైకో థ్రిల్లర్ తరహా కథనం ప్రేక్షకులను కాస్త కలవరపెట్టేలా ఉన్నప్పటికీ, డిఫరెంట్ కంటెంట్ ఇష్టపడే వాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు మూవీలో శ్రీ నందు, అవికా గోర్ లీడ్ రోల్స్ లో నటించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe