ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఓ మలయాళ మెడికల్ థ్రిల్లర్, మరో సైకలాజికల్ థ్రిల్లర్
ఒకే ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో ఒకటి మలయాళ మెడికల్ థ్రిల్లర్ కాగా.. మరొకటి హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ కావడం విశేషం.
జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ మధ్య దూకుడు పెంచుతోంది. వరుసగా కొత్త సినిమాలతోపాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లనూ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఇప్పుడీ శుక్రవారం అంటే డిసెంబర్ 19న ఒకే రోజు రెండు వేర్వేరు భాషలకు చెందిన రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఫార్మా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
జియోహాట్‌స్టార్ లోకి ఫార్మా అనే మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఓ సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్ ఓ మెడికల్ మాఫియాకు ఎలా ఎదురు తిరిగాడన్న ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
కేపీ వినోద్ అనే ఓ మెడిల్ రెప్ చుట్టూ తిరిగే కథ ఇది. మొదట తన ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి అతడు పడే బాధలను ఫన్నీగా చూపించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్.. తర్వాత అసలు కథలోకి వెళ్లింది. ఆ చిన్న ఉద్యోగే క్రమంగా ఎదిగి.. ఓ పెద్ద మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఇందులో చూడొచ్చు.
'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. 'ఫార్మా' అనేది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే మెడికల్ డ్రామా. ఇందులో నివిన్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ పాత్రలో కనిపిస్తాడు.
మిసెస్ దేశ్‌పాండే వెబ్ సిరీస్
ఇక జియోహాట్‌స్టార్ లోనే శుక్రవారం (డిసెంబర్ 19) నుంచి మిసెస్ దేశ్‌పాండే అనే మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో ఈ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి వస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకలో మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర తాను చేయలేదని, తనలోని భిన్నమైన కోణాన్ని ఈ పాత్ర చూపించనుందని చెప్పింది. అందుకే తాను ఈ పాత్ర చేయాలని అనుకున్నానని, దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది.
ఫ్రెంచ్ సిరీస్ ఆధారంగా 'మిసెస్ దేశ్‌పాండే'
'మిసెస్ దేశ్‌పాండే' అనేది ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ 'లా మాంటే' (La Mante) అధికారిక రీమేక్. దీనికి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'లా మాంటే' ఒక సీరియల్ కిల్లర్ కథను చెబుతుంది. ఆమె తనలాంటి కాపీక్యాట్ హంతకుడిని పట్టుకోవడంలో సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హంతకుడిని ఆమె పట్టుకుంటుందా లేదా అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. ఇలా రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్ లతో జియోహాట్‌స్టార్ ఈ వీకెండ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


