ఓటీటీలోకి మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రైలర్ రిలీజ్.. నిజ జీవిత ఘటనల ఆధారంగా..

ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు ఫార్మా. మలయాళ స్టార్ నటుడు నివిన్ పౌలీ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. తాజాగా గురువారం (డిసెంబర్ 11) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.

Published on: Dec 11, 2025, 15:24:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. మలయాళంలో రూపొందిన ఈ సిరీస్ ను తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా గురువారం (డిసెంబర్ 11) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్ ఓ మెడికల్ మాఫియాకు ఎలా ఎదురు తిరిగాడన్న ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

ఓటీటీలోకి మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రైలర్ రిలీజ్.. నిజ జీవిత ఘటనల ఆధారంగా..
ఓటీటీలోకి మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రైలర్ రిలీజ్.. నిజ జీవిత ఘటనల ఆధారంగా..

ఫార్మా వెబ్ సిరీస్ ట్రైలర్

ఫార్మా వెబ్ సిరీస్ వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కేపీ వినోద్ అనే ఓ మెడిల్ రెప్ చుట్టూ తిరిగే కథ ఇది. మొదట తన ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి అతడు పడే బాధలను ఫన్నీగా చూపించిన ఈ ట్రైలర్.. తర్వాత అసలు కథలోకి వెళ్లింది. ఆ చిన్న ఉద్యోగే క్రమంగా ఎదిగి.. ఓ పెద్ద మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఇందులో చూడొచ్చు.

ఫార్మా వెబ్ సిరీస్ గురించి..

'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ స్టార్ నివిన్ ఫౌలీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. మంగళవారం (డిసెంబర్ 9) జరిగిన జియోహాట్‌స్టార్ 'సౌత్ అన్‌బౌండ్' ఈవెంట్‌లో ఈ ఫార్మా వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

'ఫార్మా' అనేది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే మెడికల్ డ్రామా. ఇందులో నివిన్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సిరీస్ గురించి నివిన్ ఎమోషనల్ అయ్యాడు.

"ఈ సిరీస్ థీమ్ పిల్లల గురించి.. వారి జీవితం, వారి భవిష్యత్తు గురించి. ఇది నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడే కథ. స్క్రిప్ట్‌లో చాలా విలువలు ఉన్నాయి. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, అంతకు మించి. ప్రతి కుటుంబం తప్పక చూడాల్సిన సిరీస్ ఇది" అని నివిన్ చెప్పుకొచ్చాడు.

25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు రజిత్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 90వ దశకంలో (1999) నటి శోభనతో కలిసి నటించిన అతడు.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళ ఇండస్ట్రీకి తిరిగి వస్తున్నాడు. "స్క్రిప్ట్ వినగానే వెంటనే ఓకే చెప్పేశాను. ఒక నటుడిగా నా ఇన్‌స్టింక్ట్‌ను నమ్మాను" అని రజిత్ అన్నాడు.

పి.ఆర్. అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫార్మా వెబ్ సిరీస్‌లో నరేన్, శృతి రామచంద్రన్, వీణా నందకుమార్, ముత్తుమణి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫార్మా వెబ్ సిరీస్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More