Jiohotstar Top 10: ఓటీటీ ప్రపంచంలో జియోహాట్‌స్టార్ (JioHotstar) సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20' మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఇటీవల ముగిసిన 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' గ్రాండ్ ఫినాలే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో ఈ వారం హాట్‌స్టార్ వీక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.
బిగ్ బాస్ 20 టాప్ గేర్.. 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' విన్నర్ అనౌన్స్‌మెంట్

1. బిగ్ బాస్ 20 (Bigg Boss 20): బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ నడిపిస్తున్న బిగ్ బాస్ 20 జియోహాట్‌స్టార్ ఓటీటీలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి రీతి తివారి, ఈషా రిఖీ, రోహెద్ ఖాన్ ఎలిమినేట్ కాగా, లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫేమస్ గేమర్ స్కౌట్ ఓపీ, కాజీ తౌకీర్ మధ్య జరిగిన రచ్చ షోలో వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
2. ఖత్రోన్ కే ఖిలాడీ 15 (Khatron Ke Khiladi 15): రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో సాగే అడ్వెంచరస్ స్టంట్ షో గ్రాండ్ ఫినాలే ముగియడంతో ఓటీటీలో వ్యూయర్ షిప్ పెరిగింది. ఫినాలే రేస్‌లో రిత్విక్ ధంజాని, ఓరీలను వెనక్కి నెట్టి అవినాష్ మిశ్రా విన్నర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. మొదటి ఎపిసోడ్ నుంచే తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అవినాష్ అందరి మనసులు గెలుచుకున్నారు.
డార్క్ క్రైమ్ థ్రిల్లర్ 'హుంకార్' నుంచి హారర్ ఫన్ వరకు..
3. హుంకార్ (Hunkaar): 6 ఎపిసోడ్లతో వచ్చిన ఈ పవర్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో 3వ స్థానంలో నిలిచింది. సిటీలో పేరుగాంచిన బాబా బాప్జీపై మీనూ రావత్ అనే యువతి చేసిన రేప్ ఆరోపణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అనీత్ పడ్డా, ఫాతిమా సనా షేక్, రఘుబీర్ యాదవ్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది.
4. అలీ బాబా ఔర్ 40 భూత్ (Ali Baba Aur 40 Bhoot): హారర్ ప్లస్ కామెడీ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ 4వ స్థానంలో ఉంది. మిస్సయిన తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే ఒక అమ్మాయికి విచిత్రమైన దెయ్యాలు ఎదురైనప్పుడు జరిగే ఫన్నీ సంఘటనలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.
{{/usCountry}}4. అలీ బాబా ఔర్ 40 భూత్ (Ali Baba Aur 40 Bhoot): హారర్ ప్లస్ కామెడీ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ 4వ స్థానంలో ఉంది. మిస్సయిన తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే ఒక అమ్మాయికి విచిత్రమైన దెయ్యాలు ఎదురైనప్పుడు జరిగే ఫన్నీ సంఘటనలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.
{{/usCountry}}5. బెత్లెహేమ్ కుడుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit): వయసులో చాలా పెద్దవాడైన పక్కింటి వ్యక్తి జస్టిన్‌తో ప్రేమలో పడే యాష్లే కథ ఆధారంగా తెరకెక్కిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా 5వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
'దృశ్యం' కల్ట్ క్లాసిక్ క్రేజ్ అండ్ వినోదాల కిచిడీ
6. దృశ్యం (Drishyam): అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ లీడ్ రోల్స్ చేసిన కల్ట్ క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' 6వ స్థానంలో ఉంది. థియేటర్లలో మూడో భాగం సందడి చేస్తుండటంతో, మొదటి భాగాన్ని ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు.
7. లాఫ్టర్ షెఫ్స్ (Laughter Chefs): భారతీ సింగ్ హోస్ట్ చేస్తున్న ఈ సెలబ్రిటీ కామెడీ-కుకింగ్ షో 7వ స్థానంలో ఉంది. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ ట్రోఫీని అలీ గోనీ, జన్నత్ జుబేర్ దక్కించుకున్నారు.
8. కినారే-కినారే (Kinare-Kinare): 7.1 ఐఎండీబీ రేటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ రొమాంటిక్ డ్రామా 8వ స్థానంలో నిలిచింది. ఆటో డ్రైవర్ రాజు, ఎంతో స్వేచ్ఛగా జీవించే మాయ మధ్య సాగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది.
9. మై లడేగా (Main Ladega): 8.2 ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఈ స్పోర్ట్స్ డ్రామా 9వ స్థానంలో ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయించడానికి బాక్సింగ్‌ను తన ఆయుధంగా మార్చుకున్న ఒక కుర్రాడి స్పూర్తిదాయకమైన కథ ఇది.
10. బాంబే స్టోరీస్ (Bombay Stories): సాదత్ హసన్ మంటో పుస్తకం ఆధారంగా రాహత్ షా కాజ్మీ తెరకెక్కించిన ఈ ఆంథాలజీ మూవీ 10వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
జియోహాట్‌స్టార్ టాప్ 10 ట్రెండింగ్
1. బిగ్ బాస్ 20 : రియాలిటీ షో
2. ఖత్రోంకే ఖిలాడీ: రియాలిటీ షో
3. హుంకార్: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
4. అలీ బాబా ఔర్ 40 భూత్ : హారర్ కామెడీ వెబ్ సిరీస్
5. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్: మలయాళం ఫ్యామిలీ డ్రామా
6. దృశ్యం: హిందీ థ్రిల్లర్ మూవీ
7. లాఫ్టర్ ఛెప్స్: కామెడీ కుకింగ్ షో
8. కినారే కినారే: రొమాంటిక్ డ్రామా
9. మై లడేగా: హిందీ స్పోర్ట్స్ డ్రామా మూవీ
10. బాంబే స్టోరీస్ : ఆంథాలజీ