JioHotstar OTT: జియో హాట్‌స్టార్‌లో బెస్ట్ 7 క్రేజీ థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు, మైండ్ బ్లాక్ కాన్సెప్ట్, టాప్ రేటింగ్

JioHotstar Top 7 OTT Thrillers: ఓటీటీలో ఈ వీకెండ్ సమయాన్ని ఆస్వాదించేందుకు మంచి థ్రిల్లర్ సినిమాల కోసం వెతుకుతున్నారా? అయితే, జియో హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న క్లాసిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామాలతో కూడిన 7 అద్భుతమైన క్రేజీ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Published on: Oct 24, 2026, 20:47:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

JioHotstar Top 7 OTT Thriller Movies: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఓటీటీ వేదికల్లో మంచి సినిమాలు వెతుక్కోవడమే చాలామందికి మొదటి ప్రాధాన్యంగా మారుతుంది. వారమంతా పడిన పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని ఓటీటీల్లో వినోదాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు.

జియో హాట్‌స్టార్‌లో బెస్ట్ 7 క్రేజీ థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు, మైండ్ బ్లాక్ కాన్సెప్ట్, టాప్ రేటింగ్
జియో హాట్‌స్టార్‌లో బెస్ట్ 7 క్రేజీ థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు, మైండ్ బ్లాక్ కాన్సెప్ట్, టాప్ రేటింగ్

క్లాసిక్ కామెడీ టు క్రైమ్ థ్రిల్లర్

ఈ వారం జియో హాట్‌స్టార్‌లో వైవిధ్యమైన కథాంశాలతో అలరించే బెస్ట్ 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. క్లాసిక్ కామెడీల నుంచి సీటు అంచున కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లర్ల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గ చిత్రాలు ఇందులో ఉన్నాయి.

కామెడీ, ఫాంటసీ, ఎమోషనల్ డ్రామాల సమాహారం

1. మోనా (Moana):

సాహసయాత్రలు, ఫాంటసీ చిత్రాలను ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపిక. తన దీవిని ఆవహించిన శాపాన్ని నివారించేందుకు మోనా అనే ధైర్యవంతురాలైన చిన్నారి చేసే సముద్ర ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. పిల్లలతో కలిసి హాయిగా వీక్షించదగిన ఈ యానిమేషన్ డ్రామాను దర్శకుడు థామస్ కైల్ రూపొందించారు. ఐఎమ్‌డీబీ (IMDb)లో 5.8 రేటింగ్ లభించిని మోనా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

2. ఆర్యభట్ కా జీరో (Aaryabhatt Ka Zero):

సమాజం, కుటుంబం 'జీరో'గా జమకట్టిన బగ్గు అనే యువకుడి కథ ఇది. కామెడీ, ఎమోషనల్ డ్రామా మేళవింపుగా రూపొందిన ఈ సినిమాలో హిమాన్ష్ కోహ్లీ, రవికిషన్, సొనాలీ సెహగల్ ముఖ్య పాత్రల్లో నటించారు. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో ఏకంగా 8.1 రేటింగ్ లభించింది. నవ్వులతో పాటు ఆలోచింపజేసే సన్నివేశాలతో కథ సాగుతుంది.

స్టాక్ మార్కెట్ క్రైమ్స్ నుంచి మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్

3. బజార్ (Baazaar):

స్టాక్ మార్కెట్ నేపథ్యంలో సాగే బిజినెస్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారు సైఫ్ అలీ ఖాన్ నటించిన 'బజార్' చూడొచ్చు. అలహాబాద్ నుంచి ముంబై వచ్చి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరేందుకు ప్రయత్నించే రిజ్వాన్ అహ్మద్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గౌరవ్ కే చావ్లా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 6.5 రేటింగ్ ఉంది. దళాల్ స్ట్రీట్ రాజకీయం, డబ్బు, మోసాల చుట్టూ ఈ థ్రిల్లర్ సాగుతుంది.

4. ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా (Everybody Loves Sohrab Handa):

రజత్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. సోహ్రాబ్ హండా అనే వ్యక్తి హత్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ హత్య వెనుక ఉన్న హంతకుడిని ఎలా పట్టుకున్నారనే ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్‌తో సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఐఎమ్‌డీబీలో ఈ చిత్రానికి 6 రేటింగ్ లభించింది.

కనిపెట్టలేని రహస్యాలు.. సామాజిక వాస్తవాలు

5. సెర్చింగ్ (Searching):

కనిపించకుండా పోయిన తన కూతురి కోసం ఒక తండ్రి చేసే పోరాటమే 'సెర్చింగ్' సినిమా. డిజిటల్ యుగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందో చూపించే అద్భుతమైన థ్రిల్లర్ ఇది. కూతురి ల్యాప్‌టాప్ శోధిస్తున్న కొద్దీ తండ్రికి ఎదురయ్యే నిజాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. థ్రిల్లర్ ప్రియులకు కచ్చితంగా నచ్చే మూవీ ఇది.

6. ది గ్రేట్ డిక్టేటర్ (The Great Dictator):

1940లో విడుదలైన చార్లీ చాప్లిన్ ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ ఇది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక యూదు బార్బర్, నిరంకుశ పాలకుడి అణచివేత మధ్య ఎలా నలిగిపోయాడో నవ్వులు పూయిస్తూనే ఆలోచింపజేసేలా తెరకెక్కించారు. ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్ పొందిన ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.

7. కడ్వీ హవా (Kadvi Hawa):

వాతావరణ మార్పులు, తీవ్రమైన కరువు, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రూపొందిన సామాజిక చిత్రం 'కడ్వీ హవా'. రాజస్థాన్‌లోని నీటి ఎద్దడి గ్రామం మహువాతో పాటు బుందేల్‌ఖండ్ ప్రాంతాల నేపథ్యంతో దర్శకుడు నీల్ మాధవ్ పాండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ ఉంది.

టాప్ 7 విభిన్న థ్రిల్లర్స్

ఒకే శైలికి పరిమితం కాకుండా విభిన్న అంశాలతో కూడిన ఈ టాప్ 7 చిత్రాలు జియోహాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ వీకెండ్‌లో మీ మూడ్‌కు తగ్గట్టుగా ఒక మంచి సినిమాను ఎంచుకుని చూసేయండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More