Pakistan Web Series: పాకిస్థాన్ వెబ్ సిరీస్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందా? బ్యాన్ చేయాలని డిమాండ్-నెట్‌ఫ్లిక్స్ సైలెన్స్

Pakistan Web Series: పాకిస్థాన్ తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఈ సిరీస్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఈ వెబ్ సిరీస్‌ను భారత్‌లో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Published on: Nov 26, 2026, 09:49:11 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Pakistan Web Series: ఇంటర్నేషనల్ వైల్ డా ‘ఆల్ ది లవ్ అవర్ హార్ట్స్ క్యారీ’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ భారీ వెబ్ సిరీస్‌ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ పై ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో భారీ ఆసక్తి నెలకొంది. దాదాపు మూడేళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ట్రైలర్ నవంబర్ 24న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ ఈ సిరీస్ ఇండియా రిలీజ్ సందిగ్ధంలో పడింది.

పాకిస్థాన్ వెబ్ సిరీస్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందా? బ్యాన్ చేయాలని డిమాండ్-నెట్‌ఫ్లిక్స్ సైలెన్స్
పాకిస్థాన్ వెబ్ సిరీస్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందా? బ్యాన్ చేయాలని డిమాండ్-నెట్‌ఫ్లిక్స్ సైలెన్స్

ప్రధాని మోదీకి ఏఐసీడబ్ల్యూఏ లేఖ

డిసెంబర్ 4, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ సిరీస్‌ను భారత్‌లో బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వ్యాపార ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ఎప్పుడూ మిన్న అని స్పష్టం చేస్తూ, నెట్‌ఫ్లిక్స్ ఇండియాతో పాటు ఇతర ఓటీటీ వేదికలు పాకిస్థానీ కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.

2025 మే నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థానీ సినిమాలు, పాటలు, ఓటీటీ కంటెంట్‌ను నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మే 8, 2025న జారీ చేసిన మార్గదర్శకాలను ఏఐసీడబ్ల్యూఏ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని, టీవీలు, థియేటర్లు, ఓటీటీ వేదికలపై పాకిస్థానీ కంటెంట్‌ను పూర్తిగా నిరోధించేలా శాశ్వత చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) సహా పలువురు సినీ ప్రముఖులు సైతం మద్దతు తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్ సైలెన్స్

ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. డిసెంబర్ 4న ఈ సిరీస్ గ్లోబల్ ప్రీమియర్ ఉంటుందని ప్రకటించినప్పటికీ, భారతదేశంలో దీని స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.

మూడు తరాల ప్రేమకథలు!

ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ 2013లో ప్రచురించిన బెస్ట్ సెల్లింగ్ ఉర్దూ నవల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మోమినా దురైద్ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ షో.. మూడు తరాలకు చెందిన ఆరు విభిన్న ప్రేమకథలను హృద్యంగా చూపించనుంది. పాకిస్థాన్‌తో పాటు ఇటలీ, యూకేలోని అందమైన లోకేషన్లలో ఈ సిరీస్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించారు.ఈ సిరీస్‌లో ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, సనమ్ సయీద్‌లతో పాటు హానియా అమీర్, అహద్ రజా మీర్, హంజా అలీ అబ్బాసీ, ఇక్ర అజీజ్, మాయా అలీ, బిలాల్ అష్రఫ్ వంటి అగ్ర తారలు నటించారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.