చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.
This Week Web Series OTT: కోర్టు థ్రిల్లర్ నుంచి ఆఫీస్ రొమాన్స్ వరకు.. ఓటీటీలో ఈ వారం చూడాల్సిన 6 వెబ్ సిరీస్ లు!
This Week Web Series OTT: ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 వేదికలుగా సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, హారర్, కొరియన్ రొమాన్స్ జానర్లలో ఆరు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు ఎంటర్ టైన్మెంట్ కు సై అంటున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
This Week Web Series OTT: సినిమాల కంటే ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లను వరుసగా చూడటానికి ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పాలి. నవంబర్ 24 నుంచి 27 మధ్య హాలీవుడ్ భారీ ప్రాజెక్టులతో పాటు దక్షిణాది, కొరియన్ భాషల నుంచి క్రేజీ షోలు అందుబాటులోకి వస్తున్నాయి.

బ్లేడ్ రన్నర్ 2099 (అమెజాన్ ప్రైమ్ వీడియో – నవంబర్ 25)
సైన్స్ ఫిక్షన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ వెబ్ సిరీస్ ‘బ్లేడ్ రన్నర్ 2099’ నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందిన ఈ లిమిటెడ్ సిరీస్ అన్ని భాగాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండటం భారతీయ ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్.
నైన్ టు సిక్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో – నవంబర్ 25)
కొరియన్ డ్రామా అభిమానులను అలరించేందుకు పాపులర్ నటి పార్క్ మిన్ యంగ్ ‘నైన్ టు సిక్స్’ అనే ఆఫీస్ రొమాన్స్ సిరీస్‌తో తిరిగి వస్తున్నారు. నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి బుధ, గురువారాల్లో కొత్త ఎపిసోడ్లు విడుదలవుతాయి.
సత్యమేవ (జీ5 – నవంబర్ 27)
మలయాళ క్రైమ్, కోర్ట్ రూమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం ‘సత్యమేవ’ వెబ్ సిరీస్ నవంబర్ 27న జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆరు ఎపిసోడ్లతో రూపొందిన ఈ మలయాళ ఒరిజినల్ సిరీస్‌కు దీపు కరుణాకరన్ దర్శకత్వం వహించడమే కాకుండా, ఇందులో అడ్వకేట్ అజయ్ నంబియార్ అనే కీలక పాత్రలోనూ నటించారు.
కార్పొరేట్ లవ్ స్టోరీ (జీ5 – నవంబర్ 27)
నేటి యువత ఆలోచనలకు, కార్పొరేట్ ఆఫీస్ వాతావరణానికి అద్దం పట్టే కన్నడ రొమాంటిక్ డ్రామా ‘కార్పొరేట్ లవ్ స్టోరీ’ నవంబర్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. పన్నగ భరణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ప్రియాంక ఉపేంద్ర, సంజన దాస్, ప్రణవ్ శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌లో కలిసి పనిచేసే ఇద్దరు ఉద్యోగుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఫ్రమ్ (నెట్‌ఫ్లిక్స్ – నవంబర్ 24)
హారర్, మిస్టరీ జానర్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన అమెరికన్ సై-ఫై థ్రిల్లర్ సిరీస్ ‘ఫ్రమ్’ నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. హారోల్డ్ పెరినో ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్, తొలి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. దారితప్పి ఒక అంతుచిక్కని రహస్య పట్టణంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, అక్కడి నుంచి ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతారు. మిస్టరీని ఛేదించేందుకు వారు చేసే పోరాటం వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ది హంటింగ్ వైవ్స్ సీజన్ 2 (నెట్‌ఫ్లిక్స్ – నవంబర్ 26)
మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకున్న ‘ది హంటింగ్ వైవ్స్’ రెండో సీజన్‌తో నవంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. బ్రిటనీ స్నో (సోఫీ), మాలిన్ అకెర్మాన్ (మార్గో) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎనిమిది ఎపిసోడ్ల సీజన్‌లో డెర్మోట్ ముల్రోనీ, జాన్ స్టామోస్, డేల్ డిక్కీ, క్యామ్ గిగాండెట్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

E-Paper
