Free OTT: ఓటీటీలోకి ఉచితంగా సర్వైవల్ థ్రిల్లర్.. ఊపిరి కోసం పోరాటం.. స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకున్నా ఫ్రీగా చూసేయొచ్చు!

Survival Thriller Free OTT: ఓటీటీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకపోయినా ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ పూర్తి విషయాలను ఇక్కడ చూసేయండి. 

Published on: Nov 21, 2026, 20:42:33 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Survival Thriller Free OTT: రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఢిల్లీ 2021’ ఓటీటీలోకి రాబోతుంది. గతంలో కొవిడ్ స్టోరీస్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు పేరు మార్చుకొని డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ఓటీటీలోకి ఉచితంగా సర్వైవల్ థ్రిల్లర్.. ఊపిరి కోసం పోరాటం.. స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకున్నా ఫ్రీగా చూసేయొచ్చు!
ఓటీటీలోకి ఉచితంగా సర్వైవల్ థ్రిల్లర్.. ఊపిరి కోసం పోరాటం.. స‌బ్‌స్క్రిప్ష‌న్ లేకున్నా ఫ్రీగా చూసేయొచ్చు!

ఢిల్లీ 2021 ఓటీటీ రిలీజ్ డేట్

కరోనా కాలం నాటి ప్రమాదకర పరిస్థితులు, మనసును కదిలించే కథలతో తెరకెక్కిన ఢిల్లీ 2021 మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు.

ఫ్రీ స్ట్రీమింగ్

ఢిల్లీ 2021 ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు జీ5 మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఈ మూవీని డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేయడమే కాదు ఉచితంగా చూసే ఛాన్స్ కూడా కల్పిస్తోంది. జీ5 ఓటీటీలోనీ ఫ్రీ5 విభాగంలో భాగంగా ఢిల్లీ 2021 చిత్రాన్ని ఎవరైనా సరే, ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకపోయినా ఉచితంగా చూసేయొచ్చు.

స్టోరీ ఏంటంటే?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే. లెక్కలేనంత మంది ప్రాణాలను ఆ వైరస్ బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ రోజుల్లో ఢిల్లీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఢిల్లీ 2021 తెరకెక్కింది.

ఊపిరి కోసం సాగే పోరాటం, కాలంతో పోటీపడే క్షణాలు, అంచున వేలాడుతున్న ప్రాణాలు అనే ట్యాగ్ లైన్ తో ఢిల్లీ 2021 మూవీని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ లైన్ చూస్తేనే మూవీ ఎంత ఉత్కంఠభరితంగా, ఏడిపించేలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రియలిస్టిక్ డ్రామా

కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, మనసును హత్తుకునే వాస్తవిక కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ‘ఢిల్లీ 2021’ ఒక మంచి ఎంపికగా నిలవనుంది. ఉత్కంఠ, భావోద్వేగాలు, మానవ సంబంధాల విలువను చాటిచెప్పే ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ డ్రామాలు మూవీ లవర్స్ ను ఆద్యంతం కట్టిపడేస్తాయి.

మొత్తానికి ఊపిరి బిగబట్టి చూసేలా సాగే ఈ ‘ఢిల్లీ 2021’ ప్రయాణం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే నవంబర్ 25 వరకు వేచి చూడాల్సిందే. ఎలాంటి ఖర్చు లేకుండా జీ5లోని ఫ్రీ 5లో అందుబాటులోకి రానున్న ఈ కొత్త రిలీజ్‌ను ఓటీటీ ప్రియులు తమ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.