The Odyssey OTT: ఇవాళే ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ది ఒడిస్సీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్!

The Odyssey OTT: థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ది ఒడిస్సీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు సై అంటుంది ఈ విజువల్ వండర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతుంది. కానీ ఓ ట్విస్ట్ ఉంది.

Published on: Nov 17, 2026, 05:47:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

The Odyssey OTT: హాలీవుడ్ అగ్ర దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ'. ఈ సినిమా థియేటర్లలో విడుదలై రికార్డుల మోత మోగించింది. ఓపెన్‌హైమర్ తర్వాత నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఇవాళే ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ది ఒడిస్సీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్! (x/odysseymovie)
ఇవాళే ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ది ఒడిస్సీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్! (x/odysseymovie)

ది ఒడిస్సీ ఓటీటీ

క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ ఓటీటీ రిలీజ్ కు రెడీ యింది. ఇవాళ (నవంబర్ 17) నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), అలాగే యాపిల్ టీవీ (Apple TV)లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇది నేరుగా ఫ్రీగా చూసే అవకాశం లేదు. సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ (Rent/Buy) చెల్లించి చూడాల్సి ఉంటుంది. త్వరలో సబ్‌స్క్రైబర్స్ అందరికీ ఉచితంగా స్ట్రీమింగ్ కు రానుంది.

తెలుగు ప్రేక్షకులకు పండుగే

సాధారణంగా హాలీవుడ్ సినిమాలు ఇంగ్లీష్ లో మాత్రమే ముందుగా వస్తుంటాయి, కొన్ని నెలల తర్వాత డబ్బింగ్ వర్షన్లు వస్తాయి. కానీ ఒడిస్సీ సినిమా మాత్రం భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఓటీటీలోకి ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి వచ్చేస్తోంది. కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు కూడా యాపిల్ టీవీ, లేదా ప్రైమ్ వీడియోలో ఈ అద్భుతాన్ని తెలుగు భాషలోనే నేరుగా ఆస్వాదించవచ్చు.

కళ్లు చెదిరే కథ, భారీ తారాగణం

ది ఒడిస్సీ సినిమా కథ విషయానికి వస్తే.. ట్రోజన్ యుద్ధం తర్వాత ఇథాకా రాజు ఒడిస్సియస్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లే క్రమంలో ఎదుర్కొన్న భయంకరమైన సవాళ్లు, సముద్ర ప్రయాణాలు, రాక్షసులు, దేవతలతో జరిగిన పోరాటాల చుట్టూ తిరుగుతుంది. సైక్లోప్స్, సైరన్స్ వంటి గ్రీక్ పౌరాణిక జీవులను నోలన్ తన మార్క్ టేకింగ్ తో తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఇందులో ఒడిస్సియస్ పాత్రలో మ్యాట్ డామన్ (Matt Damon), టెలిమాకస్ పాత్రలో స్పైడర్ మ్యాన్ ఫేమ్ టామ్ హాలండ్ (Tom Holland) నటించారు. అలాగే జెండయా (Zendaya), అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, లూపిటా న్యోంగో వంటి హాలీవుడ్ అగ్ర తారలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

రికార్డుల సునామీ

ఒడిస్సీ థియేట్రికల్ రన్ లో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా 1.8 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.15,000 కోట్లు) వసూలు చేసి 2026వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో రెండవ స్థానంలో నిలిచింది. గ్రీక్ పురాణాలకు చెందిన హోమర్ రాసిన ఇతిహాసం ఆధారంగా ఐమ్యాక్స్ కెమెరాలతో నోలన్ ఈ సినిమాను ఒక అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More