The Odyssey OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజువల్ వండర్.. ది ఒడిస్సీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. 15 వేల కోట్ల కలెక్షన్
The Odyssey OTT: పాపులర్ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ ఓటీటీలోకి రాబోతుంది. ఇక స్మాల్ స్క్రీన్ లపై నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది. 15 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూసేయండి.
The Odyssey OTT Release Date: క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) ఇక ఇంట్లోనే హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ విజువల్ వండర్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నవంబర్ 17 న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి అడుగుపెడుతోంది.

ది ఒడిస్సీ ఓటీటీ
సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను కాపాడేందుకు ది ఒడిస్సీ మూవీ కోసం నోలన్ దాదాపు 120 రోజుల సుదీర్ఘ థియేట్రికల్ విండోను పాటించారు. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత, నవంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV)లలో ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) అంటే రెంట్ లేదా బై (Rent/Purchase) పద్ధతిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
డిజిటల్ వెర్షన్‌తో పాటు 4K ఆల్ట్రా హెచ్డీ, బ్లూ-రే ఫార్మాట్లలో 90 నిమిషాల ఎక్స్ట్రా బోనస్ ఫుటేజ్ (మేకింగ్ వీడియోలు) తో ఈ సినిమా రిలీజ్ కాబోతుండటం విశేషం. నవంబర్ 17 నుంచి ఓటీటీలో ది ఒడిస్సీ మ్యాజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు.
పురాణ గాథకు నోలన్ మార్క్ విజువల్స్
హోమర్ రాసిన ప్రసిద్ధ గ్రీకు పురాణ కావ్యం ‘ది ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇథాకా రాజు ఒడీసియస్ (మాట్ డామన్) తన భార్య పెనెలోప్, కొడుకు వద్దకు తిరిగి వెళ్ళడానికి పది సంవత్సరాల పాటు సముద్ర మార్గంలో చేసిన సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణమే ఈ చిత్ర కథ.
ఈ ప్రయాణంలో రాక్షస సైక్లోప్స్, సైరన్స్, మంత్రగత్తె సిర్సే వంటి అనేక శక్తులు, దేవుళ్ల ఆగ్రహాన్ని దాటుకుంటూ ఒడీసియస్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేది ఉత్కంఠ రేపుతుంది. క్రిస్టోఫర్ నోలన్ తన అద్భుతమైన ఐమాక్స్ (IMAX) టెక్నాలజీతో ఈ కథను వెండితెరపై ఆవిష్కరించారు.
బాక్సాఫీస్ రికార్డుల వేట
రూ.2,100 కోట్లకు పైగా ($250 మిలియన్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా $1.78 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.15,000 కోట్లు) వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది.
ది ఒడిస్సీ రికార్డు
ఈ కలెక్షన్లతో 2024 లో వచ్చిన ‘డెడ్‌పూల్ & వోల్వరీన్’ ($1.338 బిలియన్లు) రికార్డును బ్రేక్ చేసి, ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ నంబర్ 1 R-Rated మూవీగా ది ఒడిస్సీ నిలిచింది. ఇండియాలో కూడా ఈ సినిమా సుమారు రూ.191 కోట్లు రాబట్టింది.
థ్రిల్ కు గురిచేసే ట్విస్ట్‌లు
క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటేనే మైండ్ బెండింగ్ ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ చిత్రంలో కేవలం పురాణ గాథను మాత్రమే చూపించకుండా, గ్రీక్ దేవుళ్ల ఉనికి, మానవ మనుగడ మధ్య జరిగే మానసిక పోరాటాన్ని, కాలానికి సంబంధించిన విభిన్న కోణాలను సరికొత్త స్క్రీన్‌ప్లేతో చూపించారు.
ముఖ్యంగా ఒడీసియస్ తన గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో ఎదురయ్యే మతిభ్రమింపజేసే సముద్రపు భ్రమలు, క్లైమాక్స్ లో వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


