Today OTT: ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ..మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా.. తెలుగులో డైరెక్ట్ స్ట్రీమింగ్!
Today OTT: ఓటీటీ లవర్స్ అలర్ట్. మీకు మంచి ఫీల్ అందించేందుకు హాలీవుడ్ రొమాంటిక్ ఎమోషనల్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా మస్ట్ వాచ్ అనే కామెంట్లు వస్తున్నాయి. అసలు ఈ మూవీ ఏంటీ? ఓటీటీలో ఎందుకు చూడాలి? అనే వివరాలపై లుక్కేయండి.
Today OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లోకి ఈరోజే (అక్టోబర్ 14, 2026) నేరుగా సరికొత్త హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా వచ్చేస్తోంది. ‘లవ్ ఆఫ్ యువర్ లైఫ్’ (Love of Your Life) మూవీ మధ్యాహ్నం 12.30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకురాలు రేచెల్ మోరిసన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ఫీల్ అందిస్తుంది.

మనసును తాకే కథ
లవ్ ఆఫ్ యువర్ లైఫ్ సినిమా కథ అంతా మాయ (మార్గరెట్ క్వాలీ) అనే ఒక బోస్టన్ ఈఆర్ నర్స్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకు చార్లీ (గాబ్రియేల్ బస్సో) అనే ఒక అబ్బాయి పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్తుంది. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో కోవిడ్-19 మహమ్మారి రూపంలో వీరికి ఊహించని కష్టం వస్తుంది.
ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా ఉన్న మాయకు అండగా నిలిచిన చార్లీ.. దురదృష్టవశాత్తూ ఆ కరోనా వైరస్ బారిన పడి మరణిస్తాడు. యువ వితంతువుగా మారిన మాయ ఆ తీవ్రమైన విషాదం నుండి తట్టుకోలేక, తన వారిని అందరినీ వదిలేసి లిస్బన్, లండన్ వంటి నగరాలకు ప్రయాణమవుతుంది. అక్కడ ఆమెకు ఫెలిక్స్ (ఆరోన్ పియరీ) పరిచయం కావడం, ఆమె మళ్లీ తన జీవితాన్ని ఎలా రీబిల్డ్ చేసుకుందనేదే ఈ సినిమా కథ.
తెలుగులోనూ
ఈ హాలీవుడ్ ఒరిజినల్ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా తెలుగులోనూ అందుబాటులోకి వస్తోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను తమ ఇంట్లోనే ఓటీటీలో చూసేయొచ్చు.
అదే బలం
ఈ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా మాయ పాత్రలో మార్గరెట్ క్వాలీ (Margaret Qualley) ఒంటరితనాన్ని, బాధను ఎంతో తన నటనతో జీవం పోసిందనే కామెంట్లు వస్తున్నాయి. మూవీ ట్రైలర్ చూస్తే అది స్పష్టమవుతోంది. ఇక చార్లీ పాత్రలో గాబ్రియేల్ బస్సో (Gabriel Basso), మాయ జీవితంలోకి కొత్త ఆశగా వచ్చే ఫెలిక్స్ పాత్రలో ఆరోన్ పియరీ (Aaron Pierre) అద్భుతంగా నటించారు.
ఊహించని ట్విస్ట్‌లు
ఈ సినిమా ఒక సాధారణ రొమాంటిక్ కామెడీలా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో.. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే చార్లీ మరణంతో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత మాయ ఎవరికీ చెప్పకుండా, కనీసం చార్లీ అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే దేశం విడిచి వెళ్ళిపోవడంతో ప్రేక్షకులలో ఎమోషనల్ సస్పెన్స్‌ను క్రియేట్ అవుతుంది. చివర్లో ఆమె తిరిగి చార్లీ తల్లి రూత్‌ను ఎదుర్కొనే సన్నివేశాలు ఎంతో ఉత్కంఠగా ఉంటాయి.
ఓటీటీలో ఎందుకు చూడాలి?
• మార్పు లేని ఎమోషన్స్: జీవితంలో మనం అనుకున్నది జరగనప్పుడు, ఆ నిరాశ నుండి బయటపడి సెకండ్ ఛాన్స్ ఎలా అందుకోవాలో ఈ సినిమా చాలా ప్రాక్టికల్ గా చూపిస్తుంది.
• నటీనటుల కెమిస్ట్రీ: మార్గరెట్ క్వాలీ, ఆరోన్ పియరీల మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా నేచురల్ గా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
• విజువల్స్: పోర్చుగల్ లోని లిస్బన్, లండన్ వంటి అందమైన లోకేషన్స్ లో సినిమాను చాలా రిచ్ గా షూట్ చేశారు.
ఈ వీకెండ్లో ఒక మంచి ఎమోషనల్ అండ్ మెచ్యూర్ రొమాంటిక్ డ్రామాను చూడాలనుకుంటే, ఖచ్చితంగా మీ టిష్యూ బాక్స్ పక్కన పెట్టుకుని ప్రైమ్ వీడియోలో ‘లవ్ ఆఫ్ యువర్ లైఫ్’ సినిమాను వీక్షించండి!
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


