Amazon Prime OTT: ఓటీటీలోకి లేటుగా సూపర్ హిట్ కామెడీ సిరీస్ 5వ సీజన్- షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో- ఎందుకంటే?
Amazon Prime On Panchayat Season 5 OTT Release: ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ ఐదో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అమెజాన్ ప్రైమ్ వీడియో షాక్ ఇచ్చింది. ఈ నెలాఖరులోనే కొత్త సీజన్ వస్తుందన్న ప్రచారానికి తెరదించుతూ మేకర్స్ ఆదివారం కీలక ప్రకటన చేశారు.
Amazon Prime On Panchayat Season 5 OTT Streaming: భారతీయ ఓటీటీ రంగంలో సహజమైన కథనంతో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ 'పంచాయత్'. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ తమ అద్భుత నటనతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది మనసు గెలుచుకున్నారు.

తెలుగులో సివరపల్లిగా
మన తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూరి వాతావరణాన్ని, సర్పంచ్ ఎన్నికల హడావుడిని తలపించేలా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సిరీస్‌ను బాగా ఆదరించారు. అంతేకాకుండా ఇదే సిరీస్‌ను తెలుగులో సివరపల్లిగా ఓటీటీలోకి తీసుకొచ్చారు.
అయితే, ఇప్పుడు పంచాయత్ నుంచి సరికొత్తగా ఐదో సీజన్‌పై క్యూరియాసిటీ నెలకొంది. తెలుగు డబ్బింగ్‌లోనూ విపరీతమైన ఆదరణ పొందిన ఈ ఓటీటీ సిరీస్ ఐదో సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫులేరా గ్రామంలో ఈసారి ఎలాంటి రాజకీయ రగడ మొదలవుతుందో చూడాలని ఆరాటపడుతున్న ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిరాశ కలిగించే వార్త చెప్పింది.
షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్
గత కొన్ని రోజులుగా 'పంచాయత్ సీజన్ 5' ఈ నెలాఖరులోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ మేకర్స్ ఆదివారం అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పష్టత ఇచ్చారు.
బన్రాకస్ పోస్ట్‌తో అభిమానులకు షాక్
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైమ్ వీడియో రెండు ఆసక్తికరమైన ఫోటోలను పంచుకుంది. మొదటి ఫోటోలో "పంచాయత్ సీజన్ 5 ఈ ఏడాది రాదు" అని స్పష్టంగా రాసి ఉంది. రెండో ఫోటోలో ఈ సిరీస్‌లో 'బన్రాకస్' పాత్రతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటుడు దుర్గేష్ కుమార్ చేతులు జోడించి నిలబడ్డారు. కొత్త సీజన్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని ఆయన ఆ ఫోటో ద్వారా సంకేతాలిచ్చారు.
ఈ పోస్ట్‌కు మేకర్స్ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "చెప్పడానికి విచారిస్తున్నాం, పంచాయత్ తదుపరి సీజన్ ప్రస్తుతానికి బందీగా ఉంది - బన్రాకస్" అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. అయితే ఇది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి మేకర్స్ పన్నిన కొత్త ప్రచార వ్యూహమా, లేక నిజంగానే ఈ ఏడాది సిరీస్ విడుదల కాదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సచివ్ జీ అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే.
ఐదో సీజన్‌లో ఏం జరగబోతోంది?
నాలుగో సీజన్ ముగింపులో ఫులేరా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అక్కడి నుంచే ఐదో సీజన్ కథ మొదలుకానుంది. గత సీజన్‌లో మిగిలిపోయిన అనేక కీలక ప్రశ్నలకు ఈ కొత్త భాగంలో సమాధానాలు దొరకనున్నాయి. గ్రామ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని సమాచారం.
మరోవైపు అందరి అభిమాన పాత్రధారి ప్రహ్లాద్ చా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అంశం ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు సచివ్ జీ, మాజీ ప్రధాన్ కుమార్తె రింకీ మధ్య చిగురించిన ప్రేమకథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలని యువత ఆసక్తిగా ఉంది. మన పల్లెటూరి రాజకీయాలను, ఆప్యాయతలను గుర్తుచేసే 'పంచాయత్' కొత్త సీజన్ కోసం ఓటీటీ ప్రియులు మరికొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


