OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన సూర్య సీన్, నయనతార మహాశక్తి, జయసుధ సమ్మర్ హాలీడేస్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Scene OTT Mahasakthi OTT Summer Holidays OTT: బాక్సాఫీస్ వద్ద నిన్నటి నుంచి సందడి చేస్తున్న సూర్య 'సీన్', నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలీడేస్' చిత్రాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఒక్కోటి ఒక్కో జోనర్లో వచ్చిన ఈ మూడు సినిమాల ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Scene OTT Mahasakthi OTT Summer Holidays OTT: సినిమా ప్రియులకు బాక్సాఫీస్ వద్ద వినోదాల పంట పండుతోంది. థియేటర్లలో పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయడం ఒకెత్తయితే, మనసుకు నచ్చిన చిత్రాన్ని ఇంటి వద్దే ఓటీటీ వేదికలపై వీక్షించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
ఈ క్రమంలో ఇటీవల ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీన్', 'మహాశక్తి', 'సమ్మర్ హాలీడేస్' ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. నిన్న (నవంబర్ 6) థియేటర్లలో విడుదలైన ఈ మూడు సినిమాల ఓటీటీ రైట్స్ విశేషాలు, స్ట్రీమింగ్ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రూ. 88 కోట్ల భారీ డీల్.. సూర్య 'సీన్' ఓటీటీ విశేషాలు
మలయాళ స్టార్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య, నజ్రియా జంటగా నటించిన చిత్రం 'సీన్'. 12 ఏళ్ల విరామం తర్వాత నజ్రియా నజీమ్ నటించిన తమిళ సినిమా కావడం, కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి విజయాల తర్వాత సూర్య నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
జాగ్రమ్ స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సీన్ చిత్రం విడుదల కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 115 కోట్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 110 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా రూ. 230 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది.
ఇక డిజిటల్ హక్కుల విషయానికి వస్తే, డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ. 88 కోట్ల భారీ ధరకు సీన్ ఓటీటీ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన 4 వారాల విండో పీరియడ్ ఒప్పందం ప్రకారం, డిసెంబర్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో సీన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
ఓటీటీలోకి నయనతార 'మహాశక్తి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లేడీ సూపర్‌స్టార్ నయనతార, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన సోషియో ఫాంటసీ డివోషనల్ సినిమా 'మహాశక్తి' (మూకుత్తి అమ్మన్ 2). దేవుళ్లు, రాక్షసులు వంటి కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై కుటుంబ ప్రేక్షకులలో మంచి క్రేజ్ నెలకొంది.
మహాశక్తి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) దక్కించుకుంది. బుల్లితెర ప్రసార హక్కుల (Satellite Rights) కోసం పోటీ నెలకొనగా 'స్టార్ మా' (Star Maa) ఛానెల్ సొంతం చేసుకుంది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల నిబంధన అమలులో ఉన్నందున, డిసెంబర్ నెలాఖరు నాటికి జియోహాట్‌స్టార్ ఓటీటీలో మహాశక్తి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సోనీ లివ్‌లో 'సమ్మర్ హాలీడేస్'.. ఎప్పుడు రానుందంటే?
తెలుగు వెండితెరపైకి వచ్చిన ఫ్యామిలీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'సమ్మర్ హాలీడేస్'. శ్రీకర్ నయన్ జి దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రోహన్ రాయ్, అరుణ్ దేవ్, వాసుకి, హర్షవర్ధన్, జయసుధ వంటి నటీనటులు కీలక పాత్రలలో నటించారు.
చిన్న చిత్రమైనప్పటికీ యూత్‌ఫుల్ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో 'సోనీ లివ్' (Sony LIV) సంస్థ సమ్మర్ హాలీడేస్ ఓటీటీ హక్కులను చేజిక్కించుకుంది. ప్రాంతీయ చిత్రాలకు ఉండే 4 నుంచి 8 వారాల థియేట్రికల్ విండో ఆధారంగా డిసెంబర్ మూడో వారం లేదా చివరి వారంలో సోనీ లివ్ వేదికగా సమ్మర్ హాలీడేస్ ఓటీటీ రిలీజ్ అవనుంది.
థియేటర్లలో చూడటమే!
ఈ మూడు సినిమాలు వేర్వేరు జోనర్లలో ప్రేక్షకులను అలరిస్తూనే.. ఓటీటీ వేదికలపై కూడా సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మాస్ యాక్షన్ నుంచి సోషియో ఫాంటసీ, యూత్‌ఫుల్ డ్రామా వరకు ప్రతి వర్గం ప్రేక్షకులకు అనువైన కంటెంట్ ఓటీటీలోకి రానుంది. అయితే, ఓటీటీలోకి వచ్చేవరకు ఆగే బదులు థియేటర్లలో ఈ సినిమాలను ఎక్స్‌పీరియెన్స్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


