Scene Collection: ఒకే ఏడాదిలో సూర్య హాట్రిక్- తన రికార్డు తానే బ్రేక్ చేసిన హీరో- సీన్ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Suriya Scene Box Office Collection Day 1: స్టార్ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జితు మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సీన్’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి వచ్చి తొలిరోజే అదరగొట్టింది. భారతదేశంలో సీన్ సినిమాకు వచ్చిన నెట్ కలెక్షన్స్ సూర్య గత రెండు మూవీస్ వసూళ్లను బ్రేక్ చేసేసింది.

Published on: Nov 7, 2026, 11:21:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Suriya Scene 1st Day Worldwide Collection: కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని హవాను కొనసాగిస్తున్నారు. మలయాళంలో ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు జితు మాధవన్ తమిళంలో తొలిసారి తెరకెక్కించిన ‘సీన్’ చిత్రం దీపావళి పండగ రేసులో బాక్సాఫీస్ విజేతగా నిలిచే సంకేతాలను ఇస్తోంది.

ఒకే ఏడాదిలో సూర్య హాట్రిక్- తన రికార్డు తానే బ్రేక్ చేసిన హీరో- సీన్ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
ఒకే ఏడాదిలో సూర్య హాట్రిక్- తన రికార్డు తానే బ్రేక్ చేసిన హీరో- సీన్ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

తొలిరోజే రూ. 19 కోట్లకు పైగా రాబడి

సూర్యతోపాటు నజ్రియా నజీమ్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీన్ సినిమా నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. బాక్సాఫీస్ వర్గాల గణాంకాల ప్రకారం, 'సీన్' చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 19.15 కోట్ల నికర వసూళ్లను (నెట్ కలెక్షన్స్) రాబట్టింది.

ఇందులో తమిళ వెర్షన్ నుంచే రూ. 16.15 కోట్లు రాగా, తెలుగు డబ్బింగ్ రూపంలో రూ. 3 కోట్లు వచ్చాయి. ఇక విదేశీ మార్కెట్‌లోనూ ఈ చిత్రం జోరు చూపిస్తూ తొలిరోజే రూ. 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీపావళి సుదీర్ఘ సెలవులు తోడవడంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సొంత రికార్డులను తిరగరాసిన సూర్య

ఈ ఏడాది సూర్య ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి. మే నెలలో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం తొలి రోజున రూ. 15.50 కోట్లు (తమిళం రూ. 13.10 కోట్లు, తెలుగు రూ. 2.40 కోట్లు) సాధించగా, ఆ తర్వాత ఆగస్టులో విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలిరోజు రూ. 15.35 కోట్లు వసూలు చేసింది.

ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ కంటే ‘సీన్’ ఎక్కువ వసూళ్లను సాధించి సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ‘జైలర్ 2’ (రూ. 59.70 కోట్లు), విజయ్ ‘జన నాయగన్’ (రూ. 42.70 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూడో చిత్రంగా ‘సీన్’ నిలిచింది.

హ్యాట్రిక్ దిశగా వేగంగా అడుగులు

గతంలో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం రూ. 310.12 కోట్ల లైఫ్‌టైమ్ వసూళ్లతో ఆయన కెరీర్‌లోనే ఆల్-టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ. 209.46 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ‘సీన్’ పొందుతున్న పాజిటివ్ టాక్ ఆధారంగా ఈ సినిమా కూడా రూ. 200 కోట్ల క్లబ్‌లో సులువుగా చేరుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది.

ఈ లెక్కన ఒకే ఏడాదిలో వరుసగా హిట్స్ సాధించి సూర్య హాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. అలాగే, ఇండియాలో సీన్ సినిమాకు రూ. 22.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. వరల్డ్ వైడ్‌గా తొలి రోజున రూ. 34.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఓవర్సీస్‌లో రూ. 12 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్

2D ఎంటర్‌టైన్‌మెంట్స్, దగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఆనందరాజ్, లాల్, లాల్‌ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఒక పోలీస్ ఆఫీసర్ తాను ఇదివరకే పూర్తి చేసిన ఒక కేసును అనుకోని పరిస్థితుల్లో మళ్లీ విచారించాల్సి రావడం, తన రహస్యం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కాంట్రాక్ట్ కిల్లర్ వెంటపడే క్రమంలో సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ సీన్ సినిమా కథాంశం.

ఊహించని క్యామియో పాత్రలు

సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం సీన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కోలీవుడ్, మాలీవుడ్ నటుల ఊహించని క్యామియో పాత్రలు థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More