Mrigaya 1.5 OTT: టెక్నాలజీ శత్రువుగా మారితే- హై ఐక్యూ డిజిటల్ మాఫియాపై పోలీసుల వేట- ఓటీటీలోకి మృగయ 1.5- ట్రైలర్ అదుర్స్
Mrigaya 1.5 The Hunt Continues OTT Release Trailer Out: ఓటీటీలోకి సరికొత్త సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మృగయ 1.5 ట్రైలర్‌ను విడుదల చేశారు. అధిక తెలివితేటలు కలిగిన టీనేజ్ నేరస్థుల మూఠాను పట్టుకోవడానికి పోలీసులు సాగిచే వేటగా కథ సాగనుంది.
Mrigaya 1.5 The Hunt Continues OTT Streaming Trailer Release: డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో.. దానితో పాటు సైబర్ నేరాలు కూడా అంతే తీవ్రంగా పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడే ముఠాలను పట్టుకోవడం పోలీసులకు సైతం పెద్ద సవాలుగా మారుతోంది.

మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్ ట్రైలర్ రిలీజ్
సరిగ్గా ఇదే తరహా సస్పెన్స్, హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో 'మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్' చిత్రం తెరకెక్కింది. 2025లో వచ్చిన హిట్ మూవీ 'మృగయ'కి స్పిన్-ఆఫ్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను తాజాగా ఓటీటీ సంస్థ శుక్రవారం (నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
సైబర్ నేరాల వెనుక హై-ఐక్యూ టీనేజర్లు
ఒక సున్నితమైన కేసు దర్యాప్తుతో ప్రారంభమయ్యే కథ, క్రమంగా పెద్ద సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను బయటపెడుతుంది. పోలీస్ అధికారి దేబాంజన్ దత్తా (రిత్విక్ చక్రవర్తి) ఈ సంక్లిష్టమైన కేసును విచారించే బాధ్యతను తీసుకుంటారు.
అయితే ఈ నేరాల వెనుక ఉన్నది ఏ సీనియర్ క్రిమినలో కాకుండా.. అసాధారణమైన తెలివితేటలు (హై ఐక్యూ) కలిగిన టీనేజ్ కుర్రాళ్ల ముఠా అని తెలుసుకుని దర్యాప్తు బృందం దిగ్భ్రాంతికి గురవుతుంది. ఆధునిక సాంకేతికత, డిజిటల్ సాధనాలను వాడుకుంటూ నేరాలకు పాల్పడే ఆ ముఠాను పట్టుకోవడానికి ఫొరెన్సిక్ సైన్స్, సైబర్ వ్యూహాలను పోలీసులు ఎలా ఉపయోగించారనేది సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పోలీస్ బృందంలో విభిన్నమైన పాత్రలు
దర్శకుడు అభిరూప్ ఘోష్ ఈ కథలో పాత్రలను ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ప్రధాన అధికారి దేబాంజన్కు సహకరించే పోలీస్ బృందంలో విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న అధికారులు ఉన్నారు. వైద్య విద్యా నేపథ్యం ఉండి, కోపధారిగా ఉండే మహిళా అధికారి జోయితా (కౌషాని ముఖర్జీ) దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తుంది.
బెంగాలీ భాషపై విశేష పట్టు ఉన్న జూనియర్ అధికారి పరితోష్ తనదైన రీతిలో విచారణకు సహకరిస్తాడు. పదవీ విరమణకు దగ్గరపడిన సీనియర్ అధికారి అగ్నిశ్వర్ తమ అనుభవంతో ఈ యువ బృందానికి దిశానిర్దేశం చేస్తారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సవాళ్లు విసురుతున్న కుర్రాళ్లకు, అనుభవజ్ఞులైన పోలీసులకు మధ్య సాగే మైండ్ గేమ్ చివరిదాకా ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులు
మృగయ 1.5 ది హంట్ కంటిన్యూస్ చిత్రంలో రిత్విక్ చక్రవర్తి, కౌషాని ముఖర్జీలతో పాటు మీర్ అఫ్సర్ అలీ, అనన్య భట్టాచార్య, అర్పణ్ ఘోషాల్, అరిత్ర దత్తా బానిక్, సోహిణి గుహారాయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. అరిత్ర బందోపాధ్యాయ స్క్రీన్‌ప్లే అందించగా, దేబాశిష్ దత్తా కథను సమకూర్చారు.
సౌమిత్ దేవ్ సంభాషణలు రాశారు. రాణా మజుందార్ సంగీత దర్శకత్వంలో ప్రముఖ గాయకులు ఉషా ఉతుప్, అంతర మిత్ర పాటలను ఆలపించారు. టెన్త్ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
మృగయ 1.5 ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ రిలీజ్
డిజిటల్ మాఫియా, టెక్నాలజీ ఎలా శత్రువుగా మారిందనే కోణంలో తెరకెక్కిన మృగయ 1.5 ది హంట్ కంటిన్యూస్ ఓటీటీలోకి వచ్చేయనుంది. జీ5లో మృగయ 1.5 ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ రిలీజ్ కానుంది. నవంబర్ 13 నుంచి జీ5లో మృగయ 1.5 ది హంట్ కంటిన్యూస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


