Drones OTT Trending: మగవాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె.. ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్ లోకి తమిళ హారర్ థ్రిల్లర్!

Drones OTT Trending: ఓటీటీలోకి వచ్చిన ఒక్క రోజులోనే తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీని ఓటీటీలో ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. తెలుగులోనూ ఈ హారర్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. అసలు ఆ మూవీ ఏంటీ? దాని స్టోరీ ఏంటీ? అనే విషయాలు తెలుసుకోండి.

Published on: Nov 21, 2026, 15:44:26 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Drones OTT Trending: థియేటర్లలో విడుదలైనప్పుడు తగినన్ని స్క్రీన్లు దొరక్కపోయినా, ఓటీటీలోకి రాగానే అదరగొడుతున్న సినిమాల జాబితాలో ‘డ్రోన్స్’ చేరిపోయింది. సిద్ధి ఇద్నానీ, అంజలి నాయర్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం నవంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మగవాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె.. ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్ లోకి తమిళ హారర్ థ్రిల్లర్!
మగవాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె.. ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్ లోకి తమిళ హారర్ థ్రిల్లర్!

ఓటీటీ ట్రెండింగ్ లో డ్రోన్స్

డిజిటల్ వేదికపై అడుగుపెట్టిన ఒక్క రోజులోనే డ్రోన్స్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని రొమాన్స్ మూవీస్ విభాగంలో ఏకంగా నంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది డ్రోన్స్ మూవీ. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీగా వ్యూస్ వస్తున్నాయి.

ఓటీటీలో హవా

‘బన్ బటర్ జామ్’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు ఆర్. రాఘవ్ మిర్దత్ తన రెండో చిత్రంగా ‘డ్రోన్స్’ను తెరకెక్కించారు. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ కు సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అంతకు ఒక రోజు ముందే భారీ చిత్రం ‘జైలర్ 2’ విడుదల కావడంతో, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకక బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేకపోయింది.

అప్పుడు థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన సినీ ప్రియులంతా ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఐఎండీబీలోనూ 7.4 రేటింగ్‌తో మంచి టాక్ సొంతం చేసుకోవడం ఈ చిత్రానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బాగా కలిసొచ్చింది.

స్టోరీ ఏంటంటే?

హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా పలు అంశాలను కలగలిపి దర్శకుడు ఒక కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించారు. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు విద్యార్థులు ఒక విచిత్రమైన సైంటిస్ట్ ఇంట్లో తలదాచుకోవడంతో అసలు కథ మలుపు తిరుగుతుంది. జాతకాలు, మూఢనమ్మకాలను వ్యతిరేకించే ఆ సైంటిస్ట్ పద్మనాభన్.. మనుషుల్లా భావోద్వేగాలు పండించే హ్యూమనాయిడ్‌ను తయారు చేయాలని ప్రయత్నిస్తుంటాడు.

మరోవైపు నిద్రలో నడిచే అలవాటున్న విద్యార్థి, మినియేచర్ ఆర్టిస్ట్ ప్రకృతి, ఆమెతో పాటు ఉండే మంత్రగత్తె, ఆత్మలు బందీగా ఉన్న బొమ్మల ఇల్లు, ప్రేమ శాపంతో బాధపడే పోలీస్ అధికారి, ప్రేమలో పడ్డ మగవాళ్లను బొమ్మలుగా చేసే మంత్రగత్తె.. ఇలా విభిన్న పాత్రల జీవితాలు అనూహ్య పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి ముడిపడతాయి. ఈ అద్భుతమైన ఫాంటసీ ప్రయాణంలో చోటుచేసుకునే మలుపులు, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.