Jr NTR Anil Ravipudi: వాట్ ఏ సర్ప్రైజ్-ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా-మళ్లీ కామెడీ వైపు తారక్-ఆ సంక్రాంతికి
Jr NTR Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం.
Jr NTR Anil Ravipudi: గత కొంతకాలంగా వరుస పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒకే ఒక్క ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను తారక్ తన అధికారిక ఖాతాల్లో షేర్ చేశారు. ఎవరూ కనీసం ఊహించని విధంగా సడెన్ గా వచ్చిన ఈ ప్రకటన చూసి నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పక్కా కామెడీ ఎంటర్టైనర్
'ఆర్ఆర్ఆర్', 'దేవర', బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ లాంటి భారీ యాక్షన్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 'డ్రాగన్' ప్రాజెక్టుతో తారక్ బిజీగా ఉన్నారు. అయితే, చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తనలోని వింటేజ్ కామెడీ యాంగిల్ ను ఈ సినిమాతో బయటకు తీయబోతున్నారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్లకు పాపులర్ అయిన అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నారు.
ఫొటోతో అనౌన్స్ మెంట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇవాళ (నవంబర్ 11) సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇది సినిమా నవ్వులతో నిండి ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రం ఆద్యంతం నవ్వించే పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. 'అదుర్స్', 'బృందావనం' తరహాలో తారక్ కామెడీ టైమింగ్ ను థియేటర్లలో ఎంజాయ్ చేసే అవకాశం రాబోతోంది.
ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' (NTR Arts) పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తారక్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన 'జై లవకుశ', 'దేవర' చిత్రాలు ఎంతటి భారీ విజయాలు సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ బ్యానర్ లో అనిల్ రావిపూడి లాంటి అగ్ర దర్శకుడు చేరడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఫ్యామిలీ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్
డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో వినోదానికి ఏమాత్రం లోటు ఉండదన్న సంగతి తెలిసిందే. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సరిలేరు నీకెవ్వరు', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన ఆయన.. ఇప్పుడు ఎన్టీఆర్ లోని అద్భుతమైన ఎనర్జీకి, కామెడీకి తన మార్క్ మార్క్ టేకింగ్ ను జోడించనున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ కు ఒక పర్ఫెక్ట్ ట్రీట్ లా రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీకి 2028 సంక్రాంతికి రిలీజ్ చేస్తారేమోననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


